కరణం సురేష్
కరణం సురేష్ (సెప్టెంబర్ 9, 1963 - ఏప్రిల్ 16, 2018) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, గుణ నిర్ణేత.[1]
కరణం సురేష్ | |
---|---|
జననం | |
మరణం | 2018 ఏప్రిల్ 16 | (వయసు 54)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు, గుణ నిర్ణేత |
జననం - ఉద్యోగం
మార్చుసురేష్ 1963, సెప్టెంబర్ 9 న గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం గోళ్ళమూడిపాడులో జన్మించాడు. మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేశాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చుగుంటూరులో రంగయాత్ర యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ అనే నాటక సంస్థను స్థాపించి 15 సంవత్సరాలుగా అనేక నాటకాలను ప్రదర్శించారు. ఎల్లప్పుడు యువతను సురేష్, దాదాపు 100 మందికిపైగా నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు నాటకరంగానికి పరిచయం చేశాడు.
నటించినవి
మార్చు- గ్రహణం
- అనంతం
- సత్యాగ్రహి
దర్శకత్వం చేసినవి
మార్చు- అంతర్నేత్రం
గుణ నిర్ణేతగా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మక నంది నాటక పరిషత్తుకు అనేక మార్లు గుణ నిర్ణేతగా వ్యవహరించడమేకాకుండా రాష్ట్రంలోని దాదాపు అన్ని పరిషత్తులకు గుణ నిర్ణేతగా వ్యవహరించాడు.
మరణం
మార్చుసురేష్ 2018, ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవం రోజున లింగారావుపాలెంలోని కొండవీటి కళాపరిషత్ నాటక పోటీలకు గుణ నిర్ణయం చేసిన కొద్దిసేపటికే గుండెపోటు వచ్చింది. కారులో కాటూరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రభూమి, గుంటూరు (4 January 2018). "కళాసాంస్కృతిక రంగ దిక్సూచి అజోవిభొ కందాళం". Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 17 April 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ ముగిసిన నాటక పోటీలు, లింగారావుపాలెం, ఈనాడు గుంటూరు రూరల్, పుట 12.
- ↑ రంగస్థల నటుడు సురేష్ హఠాన్మరణం, యడ్లపాడు, ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్, పుట 22.
- ↑ కళామతల్లి ఒడిలో కన్నుమూత, యడ్లపాడు, సాక్షి గుంటూరు ఎడిషన్, పుట 9.