జావళి
జావళి ఒక కర్ణాటక సంగీత ప్రక్రియ. జావళీలలో సాథారణంగా శృంగార రసం, భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రచన ఆకర్షణీయమైన మెట్టులో రచియింపబడుటచే సంగీత ప్రపంచమున వ్యాప్తి చెందినది. సామాన్య రాగములోనూ, సాధారణ తాళములోను రచియింపబడినవి. కేవలం శృంగారమే దీని సాహిత్య భావము. పల్లవి, అనుపల్లవి, ఒకటి లేక కొన్ని చరణములను కలిగి యుండును. ఈ రచనలో నాయకా నాయకీ భావములే కాని, ద్వందార్థములు గాని, భక్తి మార్గము గాని ఏమియు లేవు. భాష సామాన్య వాడుకలో నుండు భాష. కొన్ని చోట్ల కొంత బూతులు కూడ కాననగును. పదము వలె కాక చాల చురుకుగా పాడదగిన రచన. తేలిక రచన.
ధర్మపురి సుబ్బరాయర్, పట్నము సుబ్రహ్మణ్యయ్యర్, పట్టాభిరామయ్య,రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్, మొదలగువారు ప్రముఖ జావళీల రచయితలు.
కొన్ని గీతాలు
మార్చు- మధురానగరిలో చల్లలమ్మ పోను దారి విడువు కృష్ణా - చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై
- ఇటు సాహసముల ఏల నాపై చక్కని స్వామీ - స్వాతి తిరునాళ్
- ఇది మంచి సమయము రారా - భక్త పోతన సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య
- మల్లియలారా మాలికలారా - నిర్దోషి సినిమా కోసం సి. నారాయణ రెడ్డి
కొన్ని జావళీలు
మార్చు1. | మరులుకొన్నదిరా | ఖమాస్ | ఆది | రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ |
2. | మాతాడబారాదెనో | ఖమాస్ | చాపు | నరహరిరావు |
3. | అపుడు మనసు | ఖమాస్ | రూపకము | పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ |
4. | ఏమందునే | ముఖారి | ఆది | పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ |
5. | వద్దని నేనంటిని | హిం.కాఫీ | రూపకము | పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ |
6. | కొమ్మరో | ఖమాస్ | ఆది | రమ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ |
7. | నిరుపమాన | బేహాగ్ | రూపకము | రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ |
8. | వేగనీవు | సురటి | రూపకము | రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ |
9 | చారుమతి ఉపచారము | కానడ | మిశ్ర చాపు | ధర్మపురి పట్టాభిరామయ్య |
యివి కూడా చూడండి
మార్చుసూచికలు
మార్చుయితర లింకులు
మార్చుఈ మధ్యనే https://javali.blog లో మాకు తెలిసిన జావళీల సాహిత్యం ప్రచురిస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు ఆ వెబ్ సైట్ చూడగలరు.