తమిళ భాష

ద్రవిడ వర్గానికి చెందిన ఒక భారతీయ భాష
(తమిళం నుండి దారిమార్పు చెందింది)

తమిళం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడతారు. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు.1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తెలుగు భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష తమిళమే.ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో తమిళం 19వ స్థానంలో ఉంది.[1]

తమిళం
అరవం
స్థానిక భాషతమిళనాడు, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు
ప్రాంతంశ్రీలంక, సింగపూర్, భారతదేశం.
స్వజాతీయతతమిళ ప్రజలు
స్థానికంగా మాట్లాడేవారు
75 మిలియన్
mongloid,దక్షిణ ద్రావిడ
  • తమిళం
భాషా సంకేతాలు
ISO 639-3
బ్రహదేశ్వర ఆలయ స్తంభాలపై లిఖించిన తమిళ భాష

చరిత్ర

మార్చు
 
ழ்గా వ్రాయబడే హల్లు తమిళం, మలయాళంతో పాటు మాండరిన్ మొదలైన మంగోలాయిడ్ భాషా కుటుంబానికి చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.

ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలు ఉన్నప్పటికీ, తమిళం, భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించినదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్లా సుదీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య- చరిత్ర గల భాషగా తెలుగు, కన్నడ భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది.

తమిళ భాషకి అత్యంత దగ్గర పోలికలు గల భాష మలయాళం అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దం వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.

ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ, యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నాయి.

మొట్టమొదటి తమిళ గ్రంథం రచన సా.శ..పూ.3వ శతాబ్దంలో జరిగినని ఆధారాలు ఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే సా.శ..పూ.300 - సా.శ..300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి.దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగమకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.

తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:

  • సంగమ కాలం (సా.శ...పూ.300 - సా.శ.. 300)
  • సంగమ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (సా.శ..300 - సా.శ..700)
  • భక్తి సాహిత్య కాలం ( సా.శ..700 - సా.శ..1200)
  • మధ్య కాలం ( సా.శ..1200 -సా.శ..1800)
  • ప్రస్తుత కాలం (సా.శ...1800 - ఇప్పటి వరకు).

భక్తి సాహిత్య కాలంలో, మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసాయి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903), 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.

తమిళం గురించి

మార్చు

కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి:

  • తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.
  • మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి. దీనిపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
  • తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రంలో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి.
  • తమిళంలో చదువుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
  • తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
  • తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
  • కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి. అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత.
  • తమిళభాష, సంస్కృతం కన్నా చాలా పురాతనమైంది. తమిళ భాష 2600-1700 సా.శ..పూ. నుండే ఉంది. 1000 సా.శ...పూ. ముందు సింధు లోయలో కనబడిన ఋగ్వేదంలో కూడా ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి—అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్)
  • సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్

తమిళ దినపత్రికలు

మార్చు

కొన్ని ప్రాథమిక పదాలు

మార్చు
  • నాన్ - నేను
  • నీ - నీవు
  • నీంగళ్ - మీరు
  • అవన్ - అతను
  • అవళ్ - ఆమె
  • అవర్గళ్ - వారు
  • ఇవన్ - ఇతను
  • ఇవళ్ - ఈమె
  • ఇవర్గళ్ - వీరు

తరచూ వాడే కొన్ని వాక్యాలు

మార్చు
  • నమస్కారము: వణక్కమ్
  • బాగున్నారా?: నల్లా ఇరుకీంగళా/సౌక్యమా ఇరుకీంగళా.?
  • మీ పేరు ఏంటి?: ఉంగళ్ పేరు ఎన్న?
  • నా పేరు లక్ష్మి: ఎన్ పేర్ లట్చ్మి
  • దయచేసి: దయవసెయిదు
  • ధన్యవాదము: నన్ఱి (నండ్రి)
  • నాకు తమిళం తెలియదు: ఎనక్కు తమిళ్ తెరియాదు
  • క్షమించండి: మన్నిక్కవుం/మన్నిచిరుంగ
  • అది: అదు
  • ఇది: ఇదు
  • ఏది: ఎదు
  • రండి, కూర్చోండి :వాంగ, ఉట్కారుంగ (వ్యావహారికం: వక్కారుంగ)
  • ఎంత?: ఎవ్వళవు
  • ఎక్కడ: ఎంగ
  • అవును: ఆమాం
  • లేదు: ఇల్లై
  • నాకు అర్ధం కాలేదు: ఎనక్కు పురియవిల్లై
  • మరుగు దొడ్డి ఎక్కడ?: కళివరై ఎంగ ఇరుక్కు
  • మీకు ఆంగ్లం తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా?
  • సమయం ఎంత - నేరం ఎన్నాచ్చు

ఇవి కూడా చూడండి

మార్చు

దేవకన్య (తమిళం )

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు