వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 29
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 29 నుండి దారిమార్పు చెందింది)
అభ్యంతరం
- నేను ఇంత కష్టపడి వ్రాసిన దాన్ని ఎవరో అనామకులు, అదీ ఆ విషయం గురించి ఏమీ తెలియనివారు, ఎడా పెడా దిద్దుబాట్లు చేసేస్తారా? అందులో వట్టి చెత్తను జతపరిచే అవకాశం ఉంది కదా? ఎందుకు ఒప్పుకోవాలి?
జవాబు
- వికీపీడియాలో కృషి చేసేవారు స్వంత ఆస్థిని పేర్చుకోవాలని అనుకోవడం లేదు. అందరికీ ఉమ్మడి సంపదగా స్వేచ్చా విజ్ఞానాన్ని కూడబెట్టాలని కలిసి యత్నిస్తున్నారు. ఎంతవారైనా గాని ఒక్కరే గొప్ప వ్యాసాలు వ్రాయగలరని మేము భావించడంలేదు. కాని కలిసి కృషి చేస్తే బృహత్కార్యాన్ని సులువుగా సాధించవచ్చును. ఈ పనిలో కొందరు అజ్ఞానం వలన కాని, లేదా ఉద్దేశ్యపూర్వకంగా గాని మంచి భాగాలను చెడగొట్టవచ్చును. అయితే పాత కూర్పులు "వ్యాసం చరిత్ర"లో భద్రంగా ఉంటాయి గనుక వాటిని పునరుద్ధరించవచ్చును. మన అనుభవం ప్రకారం సదుద్దేశంతో వికీలో పనిచేసేవారు చాలా ఎక్కువమంది. కనుక వ్యాసాలు చెడిపోయేందుకంటే మెరుగుపడేందుకే పుష్కలంగా అవకాశాలున్నాయి.
- ఆంగ్ల వికీలో ఇందుకు సంబంధించిన వ్యాసం - Wikipedia:Replies to common objections
- తెలుగు వికీలో వ్రాయాల్సిన వ్యాసం - వికీపీడియా:అభ్యంతరాలు - సమాధానాలు