సింహబలుడు
సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు.[1] ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు.[2]
సింహబలుడు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | తిరుపతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చురాజుగా పిలువబడే రాజేంద్రుడు(ఎన్టీయార్) రాజుల దురాగతాలను, అన్యాయాలను సహించడు. రఘునాథరాయలు (కైకాల సత్యనారాయణ) వంశపారంపర్యంగా మహారాజు గారి దగ్గర పనిచేస్తుంటాడు. పదవీవిరమణ సమయంలో అతని మంచితనాన్ని గుర్తించి అతనిని ముఖ్య న్యాయాధిపతిగా నియమిస్తారు. అతని స్థానంలో గజపతివర్మ (మోహన్ బాబు)ను సేనాపతిగా నియమిస్తాడు. గజపతివర్మ రాజును మోసంచేస్తూ దురాగతాలు చేస్తుంటాడు. యువరాణి వాణి (వాణిశ్రీ) మారువేషముతో కోటనుండి బయటకు వస్తుంది. గాజును అతను చేసే మంచిపనులను గుర్తించి ప్రేమిస్తుంది. రాజుగారు నిర్ణయించిన పోటీలలో రాజు, గజపతివర్మను ఓడించి, సింహబలుడుగా బిరుదు పొందుతాడు. ఆ సమయంలో రఘునాథరాయలు చిన్నప్పుడు ఇంటినుండి వెళ్ళిపోయిన రాజేంద్రే, రాజు అని గుర్తిస్తాడు. గజపతి, రాజుమీద కోపంతో అతనితో కలిసి ఉంటున్న చెల్లిని, తాతను చంపి ఇంటికి నిప్పుపెడతాడు. ఆ సమయంలోనే వాణియే యువరాణి అని తెలుసుకుంటాడు. రాజును బంధించి బానిసగా నిర్భందిస్తారు. యువరాణి సహాయంతో తప్పించుకుని, మిగతా బానిసలను కూడా తప్పిస్తాడు. వారందితో కలిసి గజపతిని మట్టుపెట్టి, రాజు కళ్లు తెరిపించి యువరాణిని వివాహమాడతాడు.
నటీనటులు
మార్చు- నందమూరి తారక రామారావు (రాజేంద్ర)
- వాణిశ్రీ (వాణి)
- కైకాల సత్యనారాయణ (రఘునాథరాయులు)
- మోహన్ బాబు (గజపతివర్మ)
- రమాప్రభ (లవంగి)
- మాడా వెంకటేశ్వరరావు (గోవింద్)
- జయమాలిని (రాణి రాణాఛండి)
- అంజలీదేవి (భాగ్యం)
- ఆనంద్ మోహన్ (కోటి)
సాంకేతిక నిపుణులు
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
- నిర్మాత: డి. శ్రీనివాసరాజు
- రచన, మాటలు: డి.వి.నరసరాజు
- సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
- ఛాయాగ్రహణం: కన్నప్ప
- కూర్పు: కె.ఏ. మార్తాండ్
- నిర్మాణ సంస్థ: తిరుపతి ప్రొడక్షన్స్
పాటలు
మార్చుక్ర.సం | పాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "ఏన్ను చురుక్కుమంది" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:16 |
2 | "చూపులతో ఉరకలేసి సోకులతో తడిపేసి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:34 |
3 | "సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి | 4:35 |
4 | "ఓ చెలి చలి చలి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 5:09 |
5 | "ఈ గంట ఘనఘన మోగాలి" | పి.సుశీల | 4:34 |
మూలాలు
మార్చు- ↑ ఇట్స్ ఓకే. "యన్.టి.ఆర్ 'సింహబలుడు"తో చెతుర్లు కాదు". www.itzok.in. Retrieved 26 July 2017.[permanent dead link]
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్: జానపద చిత్రాలు- 18". telugu.greatandhra.com. Archived from the original on 27 జూలై 2017. Retrieved 10 August 2017.