కాన్సర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 71: పంక్తి 71:
* [[సునిటినిబ్]]
* [[సునిటినిబ్]]
* [[థియోటెపా]]
* [[థియోటెపా]]
* [[మిటోమైసిన్ సి]]


==ఇవి కూడా చుడండి==
==ఇవి కూడా చుడండి==

15:42, 12 నవంబరు 2024 నాటి కూర్పు

కాన్సర్
వర్గీకరణ & బయటి వనరులు
When normal cells are damaged beyond repair, they are eliminated by apoptosis (A). Cancer cells avoid apoptosis and continue to multiply in an unregulated manner (B).
DiseasesDB 28843
m:en:MedlinePlus 001289
MeSH {{{m:en:MeshID}}}

క్యాన్సర్ని తెలుగులో "కర్క రోగం" అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్‌ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో [1] వెల్లడించింది.

పేర్ల వెనక కథ

ఇంగ్లీషులో 'టుమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors) . నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.

  • అవి నిరవధికం (unlimited) గా, దూకుడుతనం (aggressiveness) తో పెరిగిపోవు
  • అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue)
  • శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)

అయితే విటమిన్ B 17 లోపం అనే ఒక్ వాదన ఉంది.[2] అంతే గాని ఇది జబ్బు కాదని. ఒక రచయిత world without Cancer book పుస్తకాన్ని రాశాడు.

కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes) లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

ట్యూమర్లు రకాలు

  • మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors) : ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
  • బినైన్ ట్యూమర్లు (Benign tumors) : ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.

కేన్సరు సప్త సూచికలు

కాన్సర్ ఉత్పరివర్తనాలు

  • వైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం
  • ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
  • డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
  • క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.

పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు.

క్యాన్సర్‌ రకాలు

క్యాన్సరు ఏ అవయవంలో ప్రారంభమైంది, ఇది ప్రారంభమైన అవయవంలో కణం రకంపై ఆధారపడి ఇది అనేక రకాలుగా ఉండొచ్చు. [3][4]

  • కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ,, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.
    చేతి కార్సినోమా క్యాన్సర్
  • సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.
  • లూకీమియా (Leukemia) : గ్రీకు భాషలో 'లూకోస్‌' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.
  • లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంథులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించబడుతోంది.

అవయవాలు

క్యాన్సర్‌ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. అయినా గర్భాశయం, రొమ్ము క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు, నోరు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.

క్యాన్సర్‌ను చంపే పసుపు

పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు, పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది. (ఆంధ్రజ్యోతి 29.10.2009).

భారతదేశం లో ఈ వ్యాధి గ్రస్తులు

క్యాన్సర్‌ భారతదేశంలో 2020 సంవత్సరంలో 13.92 లక్షలు మంది ప్రజలు కాగా, 2021 సంవత్సరంలో 14.26 లక్షల మంది, 2022 సంవత్సరం లో 14.61 ప్రజల మంది ఈ మహమ్మారీ వ్యాధిలో నమోదు అయ్యారు. క్యాన్సర్ మరణాల సంఖ్య 2018 సంవత్సరంలో 7.33 లక్షల సంఖ్యలో మరణాలు జరిగినవి. ఆ మరణాలు 2022 సంవత్సరంలో 8.08 లక్షల మంది ప్రజలు చనిపోయారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,ఢిల్లీ ( ఎయిమ్స్ ) నివేదికలో పేర్కొన్న ప్రకారం 2026 సంవత్సరానికి ఈ క్యాన్సర్ మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలలో ప్రజలు మరణిస్తారని తెలిపింది. ఈ వ్యాధి నిరోధమునకు ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, ఈ వ్యాధిని కొంత వరకు తగ్గుముఖం పట్టవచ్చని తెలిపింది.[5]

మందులు

ఇవి కూడా చుడండి

వనరులు

1. గవరసాన సత్యనారాయణ, కర్రీ తింటే కేన్సరు రాదా?: కేన్సరు వ్యాధిపై వ్యాసాలు, గవరసాన ఫౌండేషన్‌, గొల్లప్రోలు-533 455, ఇండియా, 2006

మూలాలు

  1. https://www.who.int/health-topics/cancer
  2. https://www.google.co.in/imgres?imgurl=https://images-na.ssl-images-amazon.com/images/I/519aXD3-uVL._SX258_BO1,204,203,200_.jpg&imgrefurl=https://www.amazon.in/World-Without-Cancer-Story-Vitamin/dp/1943499039&h=260&w=260&tbnid=jYjlgPxET0DaDM:&q=world+without+Cancer+book&tbnh=122&tbnw=122&usg=AFrqEzd7MpH7xli1QO2ZrJhq3Base_mJqA&vet=12ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA..i&docid=OE8CgM_-KM3c_M&itg=1&sa=X&ved=2ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA[permanent dead link]
  3. "క్యాన్సర్ రకాలు". CancerInfo. India.[permanent dead link]
  4. "4 Deadliest Cancers In India And Theirs Symptoms. - Dollars Bag" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-21. Retrieved 2023-03-17.
  5. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2023-02-06.