వికీపీడియా:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో కొత్త ట్వింకిల్ ఉపకరణాన్ని స్థాపించడం, దాన్ని మన అవసరాలకు తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అవసరం

తెవికీలో ప్రస్తుతం ఉన్న ట్వింకిల్ ఉపకరణం సరిగా పనిచేయడం లేదు. దాని స్థానికీకరణ కూడా కోడు లోనే చేయడం వల్ల పైనుండి ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను మన ట్వింకిల్‌లో చేసుకోవడం చాలా పని, దానిలో పొరపాట్లకు అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్యలను నివారించేందుకు ట్వింకిల్ ఉపకరణాన్ని తతిమా వికీలు స్థానికీకరణ చేసి వాడుకోగలిగిన విధంగా ఒక ప్రయత్నం నడుస్తున్నది. ప్రస్తుతం ట్వింకిల్‌ను ఇతర వికీలలో వాడుకోడానికి ఇది సిఫారసు చేయబడిన పద్ధతి. ఈ ప్రయత్నంలో భాగంగా ట్వింకిల్ మూల సౌలభ్యాలనూ, స్థానికీకరణ సందేశాలను విడదీసారు. అందువల్ల (1) ట్వింకిల్ మూల ఉపకరణాన్ని ట్రాన్స్‌లేట్‌వికీలో స్థానికీకరించవచ్చు; (2) స్థానికీకరణతో సంబంధం లేకుండా ట్వింకిల్లో జరిగే మూల మార్పులను ఇతర వికీలు తెచ్చుకోగలిగే వీలుంటుంది; (3) ఎన్వికీ ట్వింకిల్ సౌలభ్యాలను ఇతర వికీలు తమకు తగ్గట్టు మలచుకునే వీలుంటుంది.

స్థితి

  • తదుపరి: మరికొన్ని మాడ్యూళ్ళను చేర్చి పరీక్షించడం
  • 2021-11-23: ట్వింకిల్-కోర్ నిర్మించి fluff, xfd మాడ్యూళ్ళతో దాన్ని వాడుకరి స్క్రిప్టుగా తెవికీలో విజయవంతంగా నడపగలిగాము.

కార్యరంగం (లేదా నేనెలా తోడ్పడగలను?)