యూరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
యూరియా
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [57-13-6]
SMILES NC(=O)N
ధర్మములు
(NH2)2CO
మోలార్ ద్రవ్యరాశి 60.07 గ్రా./మోల్
స్వరూపం తెల్లని వాసనలేని ఘనపదార్థం
సాంద్రత 1.33·10³ కి.గ్రా./మై³[1], ఘనపదార్థం
ద్రవీభవన స్థానం 132.7 °C (406 K)
కృళ్ళిపోవును
బాష్పీభవన స్థానం లభించడం లేదు
108 గ్రా./100 మి.లీ. (20 °C)
167 గ్రా./100 మి.లీ. (40 °C)
251 గ్రా./100 మి.లీ. (60 °C)
400 గ్రా./100 మి.లీ. (80 °C)
733 గ్రా./100 మి.లీ. (100 °C)
ఆమ్లత్వం (pKa) 26.9
Basicity (pKb) 13.82
నిర్మాణం
ద్విధృవ చలనం
4.56 p/D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు విషపదార్థము
Except where noted otherwise, data are given for
materials in their standard state
(at 25 °C, 100 kPa)

Infobox disclaimer and references

యూరియా (Urea) మాంసకృత్తులు విచ్ఛిన్నం వల్ల ఏర్పడే నైట్రోజన్ సంబంధమయిన సమ్మేళనము. ఫ్రెడ్రిక్‌ ఓలర్ 1828లో ఆవిష్కరించిన ఈ సేంద్రీయ మిశ్రమం రసాయనిక శాస్త్రంలో ఒక మైలురాయి. ఇది నీటిలో బాగా కరుగుతుంది. మానవులు, ఇతర సకశేరుకాల మూత్రంలో ఉండే ముఖ్యమైన పదార్థం. మానవుల రక్తంలో కూడా ఇది కొద్దిగా ఉంటుంది. అయితే ఈ యూరియా రక్తంలో ఎక్కువైనప్పుడు వచ్చే వ్యాధిని యూరీమియా అంటారు. ఇది ఎక్కువగా మూత్రపిండాలు పాడైనప్పుడు వస్తుంది. వ్యవసాయంలో ఎరువుగా యూరియా ఉపయోగిస్తారు.

ఉపయోగాలు

వ్యవసాయం

బంగ్లాదేశ్‌లోని యూరియా ఎరువులు ఉత్పత్తి చేసే పరిశ్రమ

వ్యవసాయరంగములో నత్రజని-విడుదల ఎరువుగా వుపయోగిస్తారు.

ప్రాంతము, మట్టిని ఆధారంగా చేసుకొని, ఒక హెక్టారుకు 40 నుండి 300 కేజీల వరకు యూరియాను వెదజల్లుతారు. దీనిని ఎక్కువ మోతాదులో ఉపయోగించడమూ ప్రమాదకరమే. వ్యవసాయ అభివృద్ధిశాఖ వారు ప్రతిపాదించిన రీతిలో దీని ఉపయోగం ఉపయుక్తం.

ఇతర ఉపయోగాలు

  • ఎరువులు, పశువుల దానాలో నైట్రోజన్ అందించి పెరుగుదలను పెంచుతాయి
  • ప్లాస్టిక్ వస్తువుల తయారీలో యూరియా ఒక మూల పదార్థం
  • యూరియా ఫార్మాల్డిహైడ్ వాటర్ ప్రూఫింగ్ కోసం వాడతారు.
  • సిగరెట్ తయారీలో ఫ్లేవర్ ను పెంచడానికి.
  • జుత్తు కండీషనర్లు, ఫేస్ పాక్ లు, స్నానం కోసం వాడే నూనెలు, లోషన్లు .
  • మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షాలు సృష్టించడానికి యూరియాను ఉపయోగిస్తారు.
  • రసాయనిక అగ్నిమాపక పరికరాలలో యూరియా పొటాషియమ్ బైకార్బనేట్ వాడతారు.
  • పళ్ళును తెల్లగా చేసే పదార్ధాలలో యూరియా వాడతారు.
  • కాలి చర్మంలోని పగుళ్ళు పోవడానికి యూరియా క్రీమ్ ఉపయోగిస్తారు.

వైద్యంలో

మందుగా
  • కొన్ని చర్మవ్యాధులలో ఉపయోగిస్తారు. చర్మపు పొరలలో నీటి శాతం తగ్గినప్పుడు వాడతారు.
రోగ నిర్ధారణ
  • రక్తంలో యూరియా నైట్రోజన్ (BUN) : పరీక్షలో రక్తంలో యూరియానుండి ఉత్పత్తి అయ్యే నైట్రోజన్ తెలియజేస్తుంది. ఇది మూత్రపిండాలు ధర్మాన్ని తెలుపుతుంది.
  • యూరియా శ్వాస పరీక్ష: కడుపులో పుండు వ్యాధిగ్రస్తులలో హెలికోబాక్టర్ పైలోరీని గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ బాక్టీరియా తయారుచేసిన యూరియేజ్ ఎంజైమ్ యూరియా నుండి అమోనియాను తయారుచేస్తుంది.

వస్త్ర పరిశ్రమలో

యూరియా డైయింగ్, ప్రింటింగ్ లో తేమను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

ఇవీ చూడండి

మూలాలు