అక్షాంశ రేఖాంశాలు: 15°10′N 77°23′E / 15.17°N 77.38°E / 15.17; 77.38

గుంతకల్

వికీపీడియా నుండి
(గుంతకల్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుంతకల్
గుంతకల్ రైల్వే జంక్షన్
గుంతకల్ రైల్వే జంక్షన్
గుంతకల్ is located in ఆంధ్రప్రదేశ్
గుంతకల్
గుంతకల్
Location in Andhra Pradesh, India
Coordinates: 15°10′N 77°23′E / 15.17°N 77.38°E / 15.17; 77.38
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
విస్తీర్ణం
 • Total51.90 కి.మీ2 (20.04 చ. మై)
Elevation
432 మీ (1,417 అ.)
జనాభా
 (2011)[2]
 • Total1,26,270
 • జనసాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
515801
టెలిఫోన్ కోడ్+91–8552
Vehicle registrationAP–02

గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.[3] ఇదే పేరుగల మండలానికి ఇది కేంద్రం.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పాత గుంతకల్లులో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద గుంతకల్లుకు ఆ పేరువచ్చిందని చెపుతారు.

చరిత్ర

[మార్చు]

తొలిగా బ్రిటీష్ ఈస్టిండియా, తరువాత బ్రిటీష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలుమార్గాలు వేయడం, రైలు ప్రయాణాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో జంక్షన్‌గా గుంతకల్లు ప్రాభవం పొందింది. 1893లో సికింద్రాబాద్‌కి ప్రయాణం చేస్తూ గుంతకల్లు బంగళాలో బసచేసిన ఆంగ్ల సైనికుల్లో ఒక యువతిని, ఒక మహిళని అత్యాచారం చేయబోగా అడ్డుకున్న రైలు గేట్ కాపలా దారుడు గొల్ల హంపన్నను కాల్చిచంపారు. వారు వ్యభిచరించడానికి హంపన్నను మధ్యవర్తిగా ఉపయోగించారని, ఆ సమయంలోనే హంపన్నకు-సైనికులకు వివాదం రేగి హంపన్న దాడిచేయబోగా కాల్చారని వాదించారు. ఈ వాదనను ప్రత్యేకంగా బ్రిటీషర్ల కోసం ఏర్పరిచిన జ్యూరీ అంగీకరించి నిర్దోషులని తీర్పునిచ్చింది. ఐతే ఇదంతా జాత్యహంకారంగా పరిగణించి హిందూ పత్రిక, నిష్కళంకులైన హంపన్న, స్త్రీల సంఖ్యపై కళంకం ఆపాదించినందుకు గ్రామస్థులు వ్యతిరేకిస్తూ గ్రామంలో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించారు.[4]

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన అనంతపురానికి ఉత్తరంగా 81 కి.మీ దూరంలో వుంది.

జనగణన వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గుంతకల్ మున్సిపాలిటీలో 126,270 జనాభా ఉంది,అందులో 62,851 మంది పురుషులు, 63,419 మంది మహిళలు ఉన్నారు.[5]

పరిపాలన

[మార్చు]

గుంతకల్లు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

కర్ణాటక లోని రాంనగర్ వద్ద ప్రారంభమై తాడిపత్రి గుండా కృష్ణపట్నం రోడ్డును కలిపే జాతీయ రహదారి 67 (భారతదేశం) మార్గంలో గుంతకల్లు వుంది. ఇక్కడే రద్దీగా వుండే రైలు కూడలి వుంది.

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]
  • కసాపురం దేవాలయం: గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది ప్రతి శనివారం, మంగళవారం భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరం తరువాత అరిగిపోయి ఉండడం స్వామి వారి మాహాత్మ్యం అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశీ విశ్వేశ్వర స్వామి వెలసినాడు.
  • హజారత్ వలి మస్తాన్ దర్గా. ప్రతి సంవత్సరము మొహర్రము తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.

ఇతర విశేషాలు

[మార్చు]

అనంతపురం తరువాత మూడవ పెద్ద పట్టణం గుంతకల్లు. దక్షిణ మధ్య రైల్వే లోని 5 ప్రధాన డివిజన్ లలో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా గుంతకల్లుకు పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉంది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టణ జనాభాలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.
  3. "Villages & Towns in Guntakal Mandal of Anantapur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-22.
  4. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
  5. "Guntakal Municipality City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-22.

బయటి లింకులు

[మార్చు]