సెయింట్ మేరీస్ హైస్కూల్ (సికింద్రాబాద్)

తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదు ప్రాంతంలోని సెయింట్ ఫ్రాన్సిస్ రోడ్‌లో ఉన్న క్యాథలిక్ పాఠశా

సెయింట్ మేరీస్ హైస్కూల్, తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదు ప్రాంతంలోని సెయింట్ ఫ్రాన్సిస్ రోడ్‌లో ఉన్న క్యాథలిక్ పాఠశాల. భారతదేశంలోని పురాతన పాఠశాలల్లో ఇదీ ఒకటి. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఎల్.కె.జి. నుండి స్టాండర్డ్ పదవ తరగతి వరకు పాఠశాల విద్యను అందిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ప్రసిద్ధి చెందిన ఈ పాఠశాలలో అసోసియేషన్ ఫుట్‌బాల్, క్రికెట్ వంటి ఆటల శిక్షణతోపాటు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఇండియా), ఎయిర్-వింగ్, ఆర్మీ వంటి విభాగాలలో కూడా శిక్షణ అందిస్తున్నారు. కాథలిక్ మైనారిటీకి చెందిన విద్యాసంస్థ అయినప్పటికీ, కులమతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.[1]

సెయింట్ మేరీస్ హైస్కూల్
స్థానం
,
భారతదేశం
సమాచారం
రకంప్రైవేటు పాఠశాల
Motto'కర్తవ్యం, సేవ, స్వచ్ఛత'
స్థాపన1885
తరగతులుఎల్.కె.జి. నుండి స్టాండర్డ్ పదవ తరగతి వరకు
Genderకో-ఎడ్యుకేషన్
Color(s)పసుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ
Websiteఅధికారిక వెబ్సైటు

చరిత్ర

మార్చు

సికింద్రాబాద్‌ ప్రాంతంలోని పురాతన పాఠశాలల్లో సెయింట్ మేరీస్ హైస్కూల్ ఒకటి. 1885లో స్థాపించబడిన ఈ స్కూల్ ను హైదరాబాద్ ఆర్చ్ డియోసెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తోంది. వాలెంటినో బిగీ ఈ స్కూల్ కు మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. రోమన్ కాథలిక్ ఆర్డర్ ద్వారా నిర్వహించబడుతోన్న ఈ పాఠశాలలో మొదట్లో బాలురకు మాత్రమే ప్రవేశం కల్పించారు, కొన్ని రోజుల తరువాత కో-ఎడ్యుకేషన్ గా మార్చారు. పాఠశాలలో నాలుగు భవనాలు ఉన్నాయి. ఈ పాఠశాలకు పనిచేసిన మొదటి నలుగురు ప్రిన్సిపాల్స్ పేర్లతో (బిగి (పసుపు), మరియన్ (నీలం), వాస్ (ఎరుపు), ఫెర్నాండెజ్ (ఆకుపచ్చ)) ఆ భవనాలకు పేరు పెట్టారు.[2]

విభాగాలు

మార్చు
  • కిండర్ గార్టెన్ - లోయర్ కె.జి., అప్పర్ కె.జి.
  • ప్రాథమిక పాఠశాల - 1 నుండి 5వ తరగతి వరకు (గ్రేడ్ 1 నుండి 5 వరకు)
  • సెకండరీ స్కూల్ - 6 నుండి 7వ తరగతి వరకు (గ్రేడ్ 6 నుండి 7 వరకు)
  • ఉన్నత పాఠశాల - 8 నుండి 10 తరగతులు (గ్రేడ్ 8 నుండి 10 వరకు)

ప్రతి తరగతితో మొదటి భాష ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి ఎ,బి,సి,డి అనే నాలుగు విభాగాలు ఉంటాయి.

ప్రముఖ పూర్వ విద్యార్థులు

మార్చు

సౌకర్యాలు

మార్చు
  • ఆడిటోరియం
  • సైన్స్ లేబొరేటరీలు
  • కంప్యూటర్ ల్యాబ్
  • గ్రంథాలయం
  • రెసిడెన్షియల్ హాస్టల్ (బోర్డింగ్,డైనింగ్‌తో)
  • నేషనల్ క్యాడెట్ కార్ప్స్

మూలాలు

మార్చు
  1. updated 8:38 AM (2012-01-01). "Yahoo! India". In.local.yahoo.com. Retrieved 2021-11-01.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Front Page : Thumma Bala installed Archbishop". The Hindu. 2011-05-06. Archived from the original on 2011-05-09. Retrieved 2021-11-01.