ఆహారం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆహారం (Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని వృత్తిగా స్వీకరించారు.
ఆహారం ఆధారాలు
[మార్చు]ఆహారం కోసం మొక్కల మీద ఆధార పడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి పాడి చేయడం ద్వారాను లభిస్తుంటాయి.
శాకాహారం
[మార్చు]మొక్కలనుండి లభించే ఆహారం.2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది.
పిండిపదార్ధాలను అందించే బియ్యము, గోదుమలు, ఇతర చిరు ధాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు, మినపప్పు, చెనగబేడలు, పెసలు, అలసందలు మొదలైన పప్పుధాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.
పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది.
తోటకూర, ఉల్లి, అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గోంగూర, తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసు కుంటాము.వంకాయ, బెండకాయ, కాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము.వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్, కుంకుమపువ్వు, అవిసిపువ్వు, మునగపువ్వు, అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి.
మాంసాహారం
[మార్చు]జంతువుల నుండి లభించే ఆహారం.క్షీరదాలనుండి పాలను సేకరించి, పాలనుండి అనేక ఇతర ఆహారపదార్ధాలను తయారుచేసి ఆహారలో ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగు, జున్ను, చీజ్, పనీర్, యోగర్ట్, వెన్న, నెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.జలచరాలను, పక్షులను, పక్షిగుడ్లను, జంతువుల మాంసం, కొన్ని చోట్ల, జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.కొన్నితూర్పుఆసియా ఖండంలోని దేశాలైన జపాన్, బర్మాలలోలో పాములను, చైనాలో ఎలుకలు ఆహాంగా తీసుకుంటారు.ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం భారతదేశంలో అలవాటే.
సంప్రదాయంలో ఆహారం
[మార్చు]అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం.దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.ఇవి ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి.పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాధాన్యత ఉంది.సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి.అథిధి అభ్యాగతులకు భోజనసదుపాయం చేయడం సంప్రదాయమే.పరిచయస్తులకు కాఫీ, టీ లనైనా అందిచడం సంప్రదాయమే.జబ్బున పడిన వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడూ, పసిపిల్లను చూడటనికి వెళ్ళేటప్పుడూ, బధి మిత్రులను చూడటానికి వేళ్ళే సమయాలలో పండ్లు మొదలైన ఆహారాన్ని తీసుకు వెళతారు.సత్రాలు కట్టి బాటసారులకు, దేవుని దర్శనానికి వచ్చే భక్తులకూ ఉచిత బోజనాలను అందించడం సంప్రదాయమే.ఆహారాన్ని ప్రసాదంగా అందించడం కోవెల సంప్రదాయాలలో ఒకటి.పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు జలపుష్పాలుగా పరిగణిస్తారు.ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు.చాలా చోట్ల శాకాహారులు కోడిగుడ్లను శాకాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
ఆహారం ఉత్పత్తి
[మార్చు]ఆహారం తోటలు, పైరు మొదలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తారు.కబేళాలు, పాడి ప్రిశ్రమ, చేపలు పట్టడం, అడవిలో లభించే వస్తుసేకరణ ద్వారా ఆహారం లభిస్తుంది.వేట కూడా ఒక పద్దతే అయినా అది ఇప్పుడు నిషేధం.వ్యవసాయంలో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.
ఆహారం వ్యాపారం
[మార్చు]తయారు చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ఆహారానికి సంబంధిచిన వ్యాపారం. ఇది పూర్వకాలం నుండి ఉంది. అనేక కారణాలచేత మగవారి అండ లేని కుటుంబాలలో ఆడవాళ్ళు తమకు తెసిన వంటనే పిండి వంటలు చేసి అమ్మడం, పూటకూళ్ళు అని ఈరోజులలో మెస్ మాదిరి భోజనాలు వండి భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటారు. అవే తరువాత ఫలహారం, కాఫీ, టీ మొదలైనవి అందించే హోటళ్ళుగా రూపు దాల్చాయి. టీ అంగడి, బడ్డీకొట్టు తినుబండారాలను అమ్ముతూ ఉంటాయి. పానీయాలు, పళ్ళ రసాలు ఇలాచిన్నచిన్న వ్యాపారాలన్నీ ఆహారానికి సంబంధించినవే. మిఠాయి కొట్లు కొంచెం పెద్ద తరహా తినుబండారాల వ్యాపారం. ఈ రోజులలో చిన్న కుటుంబాలు, ఆడవాళ్ళు ఉద్యోగాల కారణంగా అంతగా నిర్భంధం లేక సమయం చాలక ఆహారం ఇళ్ళల్లో చేయడం చాలా తగ్గింది. వడియాలు, అప్పడాలు, ఊరగాయలు, వరుగులు, పెరుగు, ఇడ్లీ, దోశ మొదలైనవి ఇంట్లో తయారు చేసే వస్తువులు ఇప్పుడు వ్యాపార సరళిలో చేసి అమ్మకానికి వస్తున్నాయి. ఆధునిక కాలంలో వీటి రూపు ఇంకామారి తయారు చేసిన వంటకాలు చపాతీలు, పరోటాలు, సైడ్ డిష్ లూ, వివిధ రకాల అన్నాలు గ్రేవీలు, చిప్స్, సీరియల్స్ అనబడే వివిధ సువాసనలతో కలిసిన పదార్ధాలు తాయారీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నాయి. ఈ రోజులలో ఆహారం వ్యాపారం చాలా పెద్ద వ్యాపార పరిమితి కలిగిన వ్యాపారాలలో ఒకటి.
మితాహారం
[మార్చు]ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంపూర్ణమైన ఆహారం చాలా అవసరం. మనం తినే పదార్ధాలతోనే మనకు పోషక విలువలు లభిస్తాయి. అవి మన శరీర పెరుగుదలకు, రక్షణకు, చురుకుదనానికి చాలా అవసరం.మితాహారం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని, వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుందని తెలిసింది.
ప్రకృతి వైద్యం
[మార్చు]ఆహారవిధానంలో మార్పులు తీసుకు వచ్చి ఆరోగ్య సంరక్షణ చేసేవిధానం ప్రకృతి చికిత్సలో ప్రధాన భాగం. ప్రస్తుత కాలంలో మంతెన సత్యనారాయణ ఈ ప్రకృతి చికిత్సా విధానానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిస్తూ ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి. ఈయన తన చికిత్సా విధానాన్ని అమలు చేయడానికి వైద్యాలయాలను ఏర్పరచి చికిత్సా విధానాలను అమలు చేస్తున్నాడు. ఈ వైద్య విధానంలో ఒక ప్రత్యేక పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటారు. మొలకెత్తిన ధాన్యాలు, కూరగాయల రసాలు పక్వం చేయకుండా తీసుకోగలిగిన ఆహారం. ఈ పద్ధతిలో ఆహారంలో సంపూర్ణంగా ఉప్పును నిషేధిస్తారు. ఆహార పదార్థాలలో సహజంగా ఉండే ఉప్పు మన శరీరానికి చాలు అనేది ఈ వైద్యుల అభిప్రాయం. పచనం చేసే సమయంలో అదనంగా చేర్చే ఉప్పు దేహానికి హాని కలిగిస్తుందన్న అభిప్రాయం ప్రకృతి చికిత్సకుల అభిప్రాయం. నూనెకు బదులుగా నువ్వులు, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు గింజలు, పచ్చికొబ్బరి పొడి చేచి వాడడాన్ని వీరు ప్రోత్సహిస్తారు. అలాగే ఆహారం పచనం చేసే సమయంలో చక్కెర, బెల్లం వంటి పదార్ధాలకు బదులుగా ఖర్జూరం, తేనె, ఎండు ద్రాక్ష వంటి ప్రకృతి సహజ పదార్ధాలను వ్డాలన్నది వీరి అభిమతం. చెరకు నుండి చక్కెరను చేసే సమయంలో చెరకులోని ఔషధ గుణాలు పోతాయన్నది వీరి అభిప్రాయం. చక్కెర కంటే బెల్లం మేలు దాని కంటే చెరకు రసం మేలని ప్రకృతి వైద్యులు చెపుతారు. వీరు కూరలను పచనంచేసే సమయంలో రుచి కొరకు కొబ్బరి తురుము, వేరుచెనగ పొడి, నువ్వుల పొడి, పొద్దుతిరుగుడు పొడి, మీగడ, పెరుగు, పాలు, టమేటా ముక్కలు చేరుస్తారు. పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువ కనుక పాల కూరను అనేక కూరలతో కలిపి పచనం చేస్తారు. ముడి బియ్యంతో అన్నం వండి తినడం మేలు చేస్తుందన్నది ప్రకృతి చికిత్సకుల అభిప్రాయం. ఈ వద్య విధానంలో జీర్ణ వ్యవస్థ మెరుగు పడి మధుమేహం, రక్త పోటు వంటి వ్యాధులను నియంత్రణ చేయవచ్చన్నది ప్రకృతి వైద్యుల అభిప్రాయం. మొలకెత్తించిన ధాన్యాలు, పుల్కాలు, అన్నం, రొట్టెలు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు ప్రకృతి వైద్యంలో చెప్పే ఆహారాలు. పప్పు ఉండలు, బూరెలు, లడ్లు లాంటి అనేక చిరుతిండ్లు కూడా ప్రకృతి సహజ పద్ధతిలో తయారు చేస్తారు. పాయసాలు, పచ్చళ్ళు కూడా ఈ ఆహార విధానాల్లో తయారు చేస్తారు. మొత్తం మీద చక్కెర, ఉప్పు లేకుండా ఆహారాన్ని తయారు చేయడం వీరి ప్రత్యేకత. అధికమైన నీటిని త్రాగడం కూడా ఈ చికిత్సలోని అంతర్భాగమే.
వివిధ రకాల ఆహారాలు
[మార్చు]- సహజ ఆహారాలు :- పండ్లు, పాలు, క్యారెట్, చిలగడ దుంప వంటి దుంపలు, వేరు చనగలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, బాదం, జీడిపప్పు, పిస్తా, ఆక్రూట్, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, తేనె, చెరకు, లేత కొబ్బరి నీళ్ళు మొదలైనవి యధాతతధంగా అలాగే తినగలిగిన ఆహారాలు.
- నానబెట్టిన ఆహారాలు :- పచ్చి శనగలు, పెసలు మొదలైనవి పెసర పప్పు, వీటిని నానిన తరువాత యధాతధంగా తినవచ్చు.
- మొలకెత్తించిన ధాన్యాలు :- పెసలు, అలసందలు, సజ్జలు, గోధుమలు, జొన్నలు, రాగులు మొదలైన చిరుధాన్యాలు మొలకెత్తించి తినవచ్చు. వీటిని యధాత్ధంగానూ, పచనం చేసి, ఎండబెట్టి పొడి చేసి, కూరలలో ఇతర ఆహారాలలో చేర్చి తినవచ్చు. మొలకెత్తించి ఉపయోగించడం ద్వారా ఆహారపు విలువలు పెరుగుతాయన్నది వైద్యుల
అభిప్రాయం.
- పచనం చేయకుండా తినగలిన ఆహారాలు :- పచనం చేయకుండా తిన గలిగిన ఆహారాలు రెండు విధాలు ఒకటి నిలువ చేసి సంవత్సరకాలం ఉపయోయించే ఆహారాలు.
రెండు తాత్కాలిక ఆహారాలు.
- నిలువచేచేసే ఆహారాలు :- వరుగులు అనేక కూరగాయలను విరివిగా దొరికే సమయంలో వాటి ఎండించి నిలువ ఉంచి వాడుకునేవి. వంకాయలు, గోరు చిక్కుళ్ళు, అత్తి కాయలు, బుడ్డ దోసకాయలు మొదలైన వాటిని ముక్కలు చేసి ఎండించి ఆహారంలో వాడు కోవచ్చు. అలాగే ఉత్తర భారత దేశంలో పచ్చి మామిడి ముక్కలను ఎండించి వంటలలో ఆమ్ చూర్ పేరుతో వాడుకుంటారు. పచ్చి మిరపకాయలను ఉప్పులో ఊర వేసి ఉప్పుడు మిరపకాయలు చేసి వేగించి మిగిలిన కూరలతో కలిపి ఆహారంగా వాడుకుంటారు. పచనం చేయకుండా నిలువ ఉండే ఆహారం ఆవకాయ. దీని తయారీకి అన్ని పచ్చిగానే ఉపయోగిస్తారు. ఖర్జూరాలు, చెర్రీ పండ్లు తేనెలో నిలువ చేసి ఆహారంహా వాడుకుంటారు.
- తాత్కాలిక ఆహారాలు :- వివిధ కూరగాయలతో చేసే పచ్చళ్ళు దోససకాయలు, దొండకాయలు, చింతకాయ పిందెలు, అడవి ఉసిరికాయలు, పచ్చి మామిడి కాయలు పచనం చేయకుండా అలాగే పచ్చళ్ళుగా నూరి ఆహారంలో వాడుకుంటారు. పండ్లరసాలు బత్తాయి, మామిడి, నిమ్మ, సపోటా, అరటి, జామ మొదలైన అనేక పండ్లను పచనం చేయవలసిన అవసరం లేకుండా తేనె లేక పంచదారను చేర్చి పంచదారను చేర్చకుండా తయారు చేయవచ్చు. బత్తాయి లాంటి రసాలు పంచదార చేర్చకుండా సహజసిద్ధంగా తరారు చేసినది లభ్యం ఔతుంది. అలాగే సలాడ్స్ అని చెప్పడేవి. వీటిని వివిధ కూరయాలు లేక పండ్లు ముక్కలు చేసి కొంత మసాలా వేసి అందిస్తుంటారు. కూరకాయలు పండ్లు మిశ్రమం చేసి చేయడం పరిపాటే.
- ద్రవాహారాలు లేక పానీయాలు :- పండ్ల రసాలు, పానకం, పాలు పండ్లు కలిపి పంచదారను చేర్చి తీసుకునే మిల్క్ షేక్, మజ్జిగ, తరవాణి, చెరకు రసం, షర్బత్ మొదలైనవి.
ద్రవాహారను యధాతధంగానూ శీతలీకరణ చేసి లేక కొంచం అయి ముక్కలను చేర్చి తీసుకుంటారు. అలాగే పాలు చేర్చి లేక పాలు లేకుండా చేసే కాఫీ, టీలు, పాలతో కొన్ని బవర్ధక పదార్ధాలైన హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్, కాంప్లాన్ మొదలైనవి చేర్చివేడిగా తీసుకునేవి.
- వేగించిన ఆహారాలు :- ఉప్పు చెనగలు, పెసలు, బఠానీలు, పల్లీలుగా పిలువబడే వేరుశనగ పప్పు, వేపిన వేరు శనగ కాయలు మొదలైనవి వేగించిన ఆహారాలు. ఇచి చిరుతిండ్లు అంటారు.
- ఉడక పెట్టిన ఆహారాలు :- అనేక రకాల పప్పులతో చేసే గుగ్గిళ్ళు, తాటి గింజల నుండి పండించే తేగలు, మొక్క జొన్న పొత్తులు, వేరు చనగకాయలు మొదలైనవి ఉడికించి తినే చిరుతిండి అంటారు.
- కాల్చిన ఆహారాలు :- పచ్చిగానే కోసి కాల్చిన వేరుచనగ కాయలు, జొన్న, సజ్జ, మొక్కజొన్న మొదలైన పొత్తులు. చిలగడ దుంప లేక గనిసి గడ్డలు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- సంతులిత ఆహారం (పోషకాహారం)
- ఆహార సంరక్షణ
- https://www.teluguheal.tech/search/label/food?m=1 Archived 2021-01-18 at the Wayback Machine
సూచికలు
[మార్చు](*వీటిని కలిపి తినొద్దు.*)
- మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న కలిపి
తినకూడదు
- పాలు + గుడ్లు కలిపి తినకూడదు
- పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కలిపి
తినకూడదు
- చల్లని+ వేడి పదార్థాలు వెంటవెంటనే తీసుకోకూడదు
- పెరుగు+ కాఫీ వెంటవెంటనే తాకకూడదు.
- ఐస్క్రీమ్ టీ వెంట వెంటనే తీసుకోకూడదు.
- తేనెను వేడి పదార్థాలతో కలిపి తినకూడదు.