ఇకైనోడెర్మేటా
Jump to navigation
Jump to search
ఇకైనోడెర్మేటా Temporal range: Cambrian (or earlier?) - present
| |
---|---|
A brittle star resting on a brain coral | |
Scientific classification | |
Domain: | |
Kingdom: | |
Subkingdom: | |
Superphylum: | |
Phylum: | ఇకైనోడెర్మేటా Klein, 1734
|
Subphyla & Classes | |
† = extinct |
ఇకైనోడెర్మేటా (లాటిన్ Echinodermata) జీవులు ప్రధానంగా సముద్రాలలో నివసించేవి. వీటికి దేహమంతా ముళ్ళుతో కప్పబడి ఉంటుంది. వీటిలో గుండె, మెదడు, మూత్రపిండాలు, తల, వెన్నెముక ఉండవు. సముద్ర నక్షత్రాలు, సముద్ర దోసకాయలు, సముద్ర బిస్కట్లు, సాండ్ డాలర్లు, సముద్ర లిల్లీలు, అర్ఛిన్లు మొదలినవి ఈ వర్గానికి చెందినవి.
జీవుల లక్షణాలు
[మార్చు]- ఇవి ద్విపార్శ్వసౌష్టవ జీవులైనా ప్రౌఢదశలో పంచకిరణ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి.
- సాధారణంగా నక్షత్ర, స్థూప లేదా గోళాకారంగా ఉంటాయి.
- భుజాలు అయిదు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి.
- వీటి శరీరం నిండా ముళ్ళుంటాయి. అంతఃచర్మం నుంచి కాల్కేరియస్ ఫలకాలు, వాటి నుండ్చి అంతరాస్థిపంజరం ఏర్పడతాయి. దేహాన్ని కప్పి శైలికామయ బాహ్యచర్మం ఉంటుంది.
- శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, రక్షణకు, ఆహారాన్ని పట్టుకోవడానికి పెడిసెల్లేరియాలు ఉంటాయి. వీటికి రెండు లేదా మూడు దవడలు ఉంటాయి.
- గ్యాస్ట్రుల్ల దశలోని ఆది ఆంత్రం నుంచి కోశాలు, వాటి కలయిక వల్ల శరీర కుహరం ఏర్పడతాయి. ఇదే ఆంత్రకుహరం. శరీరకుహర ద్రవంలో అమీబోసైట్లు ఉంటాయి.
- నాళికా పాదాలు, భుజాలు, ముళ్ళు చలనానికి తోడ్పడతాయి.