కృష్ణా సోబ్తి
కృష్ణా సోబ్తి ( జననం: 1925 ఫిబ్రవరి 18 ) ప్రఖ్యాత హిందీ నవలా రచయిత్రి, వ్యాసకర్త. 2017లో ప్రతిష్ఠాత్మ జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. హిందీ, ఉర్దూ, పంజాబీ బాషా సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.[1] 1996లో కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ పురస్కారం కూడా పొందారు. ఈమె 1999లో కథ చూడామణి పురస్కారం, 1981 లో శిరోమణి పురస్కారం, 1982లో హిందీ అకాడమీ పురస్కారం పొందారు. 2008లో ఈమె రచించిన సమయ్ సర్గం నవల కేకే బిర్లా ఫాండషన్ వారి వ్యాస్ సమ్మాన్ కి ఎంపికైనది. అంతేకాక హిందీలో అత్యంత గౌరవప్రదమైన మైథిలీ శరణ్ గుప్త పురస్కారాన్ని పొందారు. ఈమె హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలో రచనలను రచిస్తారు. ఈమె నవలలు కొన్ని రష్యన్, ఇంగ్లిష్, స్వీడిష్ ఇటీవలి వంటి భాషల్లోకి తర్జుమా అయ్యాయి.
జననం
[మార్చు]ఈమె 1925 ఫిబ్రవరి 18 న అవిభక్త భారతదేశంలోని ఉత్తర పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్) లో జన్మించింది. ఈమెకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. తన కుంటుంబం బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసేవారు. దేశ విభజన అనంతరం వీరి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. సిమ్లా, ఢిల్లీలో చదువుకున్నారు. ఉన్నత విద్యను లాహోర్‌లో పూర్తి చేశారు. ఈమె శివంత్ అనే రచయితను తన 70వ ఏట పెళ్లి చేసుకుంది.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె రచనలు భారత ఉపఖండం విభజన, మారుతున్న భారతీయ సమాజంలో మార్పులకు లోనవుతున్న స్త్రీ పురుష సంబంధాలు, మానవీయ విలువల్లో నెలకొంటున్న క్షీణత వంటి అంశాలపై ఎక్కువగా రచించేవారు. మొదట్లో ఈమె చిన్న కథలు రాస్తూ ఉండేవారు. అందులో లామా, నఫిసా 1994లో ప్రచురితమయ్యాయి. అదే సంవత్సరంలో భారతదేశ విభజన అంశాల గురించి సిక్కా బాదల్ గయాలో వివరించారు.
రచనలు
[మార్చు]ఈమె మొదటికథ ‘దాదీ అమ్మా’ కానీ ‘ఔర్ సిక్కా బదల్ గయా’ నే తన మొదటి కథగా ఈమె చెప్తుంటారు. 1979లో తన తొలి రచన ‘జిందగీనామా’కు పొడిగింపుగా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ పేరిట ఇంకా చిన్న నవల రాసి ఈ రెండు కలిసి ‘జిందారుఖ్’నవలగా ప్రకటించారు. ఈ నవలకు తన 92వ ఏట 2017లో జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. 1966లో ఈమె రచించిన మిత్రో మరంజని నవల వివాహిత స్త్రీలపై జరుగుతున్న లైంగికత అసమానతలపై అదేవిధంగా, ఈమె రచించిన బాదలోంకే ఘెరే, మిత్రో మార్జని, అలీ లడ్కీ, గుజరాత్ పాకిస్తాన్ సే గుజరాత్ హిందుస్తాన్, దార్ సే బిచేడీ వంటి రచనలు ప్రజాదరణ పొందాయి. ఎ లడ్ కీ' పేరుతో వెలువడిన రచనలో భార్యలుగా, తల్లులుగా మహిళలు నిర్వహిస్తున్న పాత్రను వివరించారు. ఈమె రచనలే కాక హిందీ సాహితీ దిగ్గజాలు అయినటువంటి నామ్‌వర్‌సింగ్, శ్రీకాంత్ వర్మ, నిర్మల్ వర్మ, భీష్మ్ సహాని ల యొక్క జీవిత విశేషాలను వ్యాసాల రూపంలో రచించారు.
పురస్కారాలు
[మార్చు]2010 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.
- సాహిత్య అకాడమీ పురస్కారం (1980)
- సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ పురస్కారం (1996
- కథ చుదమని పురస్కారం (1999)
- జ్ఞానపీఠ్ అవార్డు (2017)
- శిరోమణి పురస్కారం (1981)
- హిందీ అకాడమీ పురస్కారం (1982)
- మైథిలీ శరణ్ గుప్త పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ "కృష్ణా సోబ్తి". vanithavani.com. Retrieved 18 April 2018.[permanent dead link]
- All articles with dead external links
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- జీవిస్తున్న ప్రజలు
- హిందీ కవయిత్రులు
- హిందీ కవులు
- హిందీ పండితులు
- 1925 జననాలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- సాహితీకారులు
- రచయిత్రులు
- భారతీయ కవయిత్రులు
- భారతీయ సాహిత్యవేత్తలు
- పంజాబ్ వ్యక్తులు
- సాహిత్య పురస్కారాలు
- ఉర్దూ పండితులు
- ఉర్దూ రచయిత్రులు
- ఉర్దూ సాహితీకారులు
- ఉర్దూ సాహిత్యం
- ఉర్దూ కవులు
- పంజాబ్ రచయితలు