కేబుల్ టీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేబుల్ టీ.వి
Cable tv
దస్త్రం:Dish img.jpg
రకము కేబుల్ టీవీ నెట్‌వర్క్
దేశము India భారతదేశము
లభ్యత జాతీయ స్థాయి
యజమాని MSO & కేబుల్ ఆపరేటర్స్
ఆవిర్భావ దినం 1995
ఇతరపేర్లు శాటీలైట్ ప్రసారాల చానల్స్
జాలగూడు డి.డి. ఇండియా

మానవ నిర్మిత కృత్రిమ కొన్ని ప్రసారా సాధనల ద్వారా ప్రసారా మాద్యమాల ద్వారా ప్రసారాలు కొందరు ఉపగ్రహం కి పంపిన, మరి కొందరు కొన్ని ప్రసారా సాధనల ద్వారా అందుకున్న టీవీ సిగ్నలును కేబులు వైర్ల ద్వారా టీవీలకు కలిపినచో ఆయా చానల్స్ టీవీలో వచ్చేల చేయుదానినే టీవీ చానళ్ళూ ఇంటింటికీ అందించే వ్యవస్థను కేబుల్ టీవీ అంటారు. నవీన యుగంలో టీవీ ప్రధాన వినోద సాధనంగా మారింది. భారత్‌లో టీవీ ప్రసారాలను 1972 లో (టెర్రెస్ట్రియల్)పద్ధతిలో ఢిల్లీ లో చిన్నగా భూస్థిత నెట్ వర్క్ ను ప్రస్తుతం దూదదర్శన్ ప్రారంబించి, 1984 నాటికల్లా కలర్ ప్రసారాలను ప్రవేశపెట్టారు. 1990 తరువాత అంతర్ జాతీయ చానల్స్ ఉపగ్రహ ప్రసారాలు ప్రారంబించినా1995 లో ప్రాంతీయ చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ ప్రారంభమైయింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల టీవీ ప్రసార (బ్రాడ్ కాస్ట్) నెట్ వర్క్ లు ఉన్నాయి. ఒకటి భూస్థిత (టెర్రెస్ట్రియల్) రెండోది కేబుల్ అండ్ ఉపగ్రహ. భూస్థిత నెట్ వర్క్ ను ప్రస్తుతం దూదదర్శన్ మాత్రమే వినియోగిస్తోంది. కేవలం యాంటెన్నా ఉంటే చాలు ఎటువంటి ఇతర కనెక్షన్లు అవసరం లేకుండా టీవీలో దూదదర్శన్ ప్రసారాలను చూడొచ్చు. గతంలో ప్రతీ ఇంట్లోనూ ఇదే ఉండేది. నేటికీ దేశంలో మూడు కోట్ల మంది వరకు టెర్రెస్ట్రియల్ సౌకర్యాన్నే అందుకుంటున్నారు.

కేబుల్ టీవీ శైశవం

[మార్చు]

అంతర్జాతీయంగా ప్రముఖ రేడియో కంపెనీలు ఉపగ్రహ ప్రసారాలతో టీవీ చానల్స్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజుల్లోనే అవి ప్రముఖ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ BBC, సిఎన్ఎన్ (CNN), లాంటివి 1980వ దశకంలో ప్రారంబమైనవి. వీటిని అనుసరించి జాతీయ చానల్లు,వీటిని అనుసరించి ప్రాంతీయ చానళ్ళూ ప్రారంభమయ్యాయి.

తొలి రోజుల్లో కేబుల్ ఆపరేటర్లు అంతర్జాతీయ చానల్స్ ఆంగ్లభాష చానల్స్ తో ఢిల్లీ, ముంబాయి,కోల్కతా, చెన్నై లాంటి నగరాల్లో కేబుల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు. కొద్ది రోజుల్లోనే మరి కొందరు కూడా హిందీ భాషలో చానల్స్ పెట్టడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కేబుల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు కేబుల్ ఆపరేటర్లు.

భారతదేశంలో కేబుల్ టీవీ ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 మంది కేబుల్ ఆపరేటర్లుండగా వారి వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు మరో 2,50,000 మంది ఉన్నారు. ఆ తరువాత అన్ని భాషల్లోను ప్రాంతీయ చానల్స్ ఉపగ్రహ ప్రసారాల ప్రారంబించాయి. మొదట్లో అవి వినోద చానల్స్ వరకే పరిమితమైనవి.

వార్తల చానల్స్

[మార్చు]

అంతర్జాతీయ ఆంగ్ల వార్తల చానల్స్ ముందు రాగా, తరువాత హిందీలోను, 2000 సంవత్సరం తరువాత అన్ని భాషల్లోనూ వార్తల ఛానల్స్ వచ్చాయి. ప్రతీ భాషలో 24 గంటల వార్తా చానళ్ళు ఉన్నాయి. తెలుగులో 30 చానళ్ళున్నాయి. 2012 నుండి ఏడాదికి 4,5 చొప్పున కొత్త వార్తా చానళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇదే ధోరణి ఇతర భాషల్లోనూ ఉంది.

చానల్స్ సంఖ్య పెరగడం

[మార్చు]

2000 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం భారత భూభాగం నుండి అప్ లింకింగ్ (సిగ్నలును ఉపగ్రహానికి పంపడం) కు అనుమతులు ఇవ్వడం ప్రారంబించింది. అంతకు ముందు సింగపూర్, మలేషియా,ఫిలిప్పైన్స్, బ్యాంకాక్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుండి అప్ లింకిగ్ చేసేవారు. 2000 సంవత్సరం తరువాత చానల్స్ మ్యాన్యువల్ నుండి డిజిటల్ రూపం లోకి మారడంతో బ్రాడ్ కాస్టర్ (చానల్ యాజమానీ)కి ఖర్చు సగం తగ్గింది. చానళ్ళు స్థాపించడం సులభంగా మారింది. ప్రస్తుతం భారతదేశంలో 400 పైన చానల్స్ ప్రసారాలు చేస్తున్నాయి. ఇందులో వార్తల చానల్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఇంకా కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ప్రసారశాఖ వద్ద కొత్త చానల్ అనుమతి కోరుతూ వందల్లో దరఖాస్తులు పెండిగులో ఉన్నాయి.

కేబుల్ ఆపరేటర్లు

[మార్చు]

1995 లో ప్రాంతీయ చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్లతో ప్రారంబమైయింది. ప్రతీ చానల్ నూ ప్రజలకు చూపించేందుకు కేబుల్ ఆపరేటర్ సొంత ఖర్చుతో ఒక రిసీవర్, ఒక మాడ్యులేటర్ అనేవి పెట్టాలి. మెట్రోపాలిటన్ నగరాల్లో పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ లో సినిమాలు ప్రసారం చేయటానికి వీలుగా వీసీపీలో వీడియో కాసెట్లు ప్లే చేయటంతో కేబుల్ టీవీ మొదలైంది. ఇది 1985 నాటి మాట. ఆ విధంగా దరదర్శన్ ప్రసారాలతో విసిగిపోయినవాళ్ళకు ఈ సినిమాల ప్రసారం కారుచౌకగా అందుబాటులోకి వచ్చిన వినోదంగా మారాయి. అదే సమయంలో టెరెస్ట్రియల్ దూరదర్శన్ ప్రసారాలు సైతం పెద్ద పెద్ద కొండలున్నచోట సరిగా అందకపోవటంతో ఇలాంటి కేబుల్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ అందజేసిన సందర్భాలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. కానీ ఇది అప్పట్లో అతి కొద్ది ప్రాంతాలలో మాత్రమే కనిపించేది.

కానీ ఆ తరువాత స్టార్ టీవీ ప్రసారాలు, ఆ వెనువెంటనీ జీ టీవీ ప్రసారాలు మొదలయ్యాయి. ఆ ఉపగ్రహ చానల్స్ ప్రసారాలు ఇంటింటికీ అందాలంటే కేబుల్ టీవీ అనివార్యంగా మారింది. అలా చానల్స్ సంఖ్య 12 కు చేరింది. కానీ ఇలా కేబుల్ ద్వారా ప్రసారాలు అందించటమనేది అప్పటికి ఇంకా చట్టబద్ధం కాలేదు. ముందుగా 1994 లో కేబుల్ టీవీ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ వచ్చింది. ఆ తరువాత 1995 లో అది చట్టంగా మారింది. భారతదేశంలో 1992 లో కేవలం 4 లక్షలున్న కేబుల్ కనెక్షన్లు 2016 నాటికి 18 కోట్లకు చేరాయి.

అలా చొచ్చుకుపోవటానికి అసలు కారణం, మొదట్లో ఎలాంటి చట్టమూ లేకపోవటమేనని స్పష్టమవుతుంది. అలా బాగా వేళ్లూనుకుంటున్న సమయంలో 1994 లో కేబుల్ టీవీ చట్టానికి శ్రీకారం చుట్టి 1995 నాటికి పూర్తిచేశారు. అయితే, దీని పరిధి పరిమితంగా ఉండటానికి కారణం అప్పట్లో చానల్స్ ను ఇందులో చేర్చకపోవటం. ఆ తరువాత చిన్నా చితకా నిబంధనలు వచ్చినా పెనుమార్పులు లేవు. కానీ ఈ చట్టం వచ్చిన తరువాత ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అదే మల్టీ సిస్టమ్ ఆపరేటర్ – MSO. ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే సూపర్ హెడ్ ఎండ్ అది.

అప్పట్లో అంతా ఎనలాగ్ యూని డైరెక్షనల్ ట్రాన్స్ మిషన్ మాత్రమే ఉండేది. కొయాక్సియల్ కేబుల్ వాడుకుంటూ కంట్రోల్ రూమ్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో సేవలందించగేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక చానల్ కు 7 లేదా 8 మెగాహెర్ట్జ్ పట్టేది. (అదే డిజిటల్ ట్రాన్స్ మిషన్ అయితే 10 నుంచి 20 వరకూ చానెల్స్ కంప్రెస్ చేసి ప్రసారం చేయవచ్చు.) 1995 వరకూ అన్నీ ఉచిత చానల్సే ఉండేవి. కానీ ఆ తరువాతి కాలంలో పే చానల్స్ రావటంతో ఆ సిగ్నల్స్ అందుకోవటానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లో ఇంటిగ్రేటెడ్ రిసీవర్ అండ్ డీకోడర్స్ (IRDs) పెట్టాల్సి వచ్చింది. పే చానల్స్ చందాల విషయంలో చాలా గందరగోళం ఉండేది. బేరసారాలతో చెల్లింపు మొత్తం నిర్ణయమయ్యేదే తప్ప నిర్దుష్టమైన ధర అంటూ ఉండేది కాదు. కనెక్షన్ల సంఖ్య విషయంలోనూ పరస్పరం అంగీకరించుకున్న మొత్తాలే తప్ప కొలమానం అంటూ ఉండేది కాదు. ప్రజలకు ఈ వివరాలెప్పుడూ బహిర్గతం చెయ్యలేదు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే, అటు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖగానీ, ఇటు ట్రాయ్ గానీ ఏనాడూ ఈ ఒప్పందాల విషయంలో పే చానల్స్ నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

యం.ఎస్.ఓ.

[మార్చు]

వ్యాపారపు తెలివితేటలకు తోడు స్థానికంగా బలమున్నవాళ్ళు కేబుల్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత అర్థబలం, అంగబలం ఉన్నవాళ్ళు ఎమ్ ఎస్ వో (మల్టీ సిస్టమ్ ఆపరేటర్) లుగా రంగంలోకి దిగారు. అప్పట్లో 12 తో మొదలైన చానల్స్ సంఖ్య క్రమంగా 60 కి చేరింది. ఇంటింటికీ ప్రసారాలు అందించటానికి వీలుగా సొంత కంట్రోల్ రూమ్ లో చానల్స్ సిగ్నల్స్ అందుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కువ చానల్స్ ఇవ్వలేక సతమతమవుతున్న చిన్న ఆపరేటర్లు ఈ ఎమ్మెస్వోల రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లాస్ట్ మైల్ ఆపరేటర్ (LMO) గా పిలవబడే ఈ ఆపరేటర్లు నెలవారీ కొంత నిర్దుష్టమైన మొత్తాలు చెల్లిస్తూ ఎమ్మెస్వో కంట్రోల్ రూమ్ నుంచి కొయాక్సియల్ కేబుల్ ద్వారా ఫీడ్ అందుకోవటం ప్రారంభించారు. అలా వీళ్ళు అందించే చానల్స్ సంఖ్య 12 నుంచి 60 కి. ఆ తరువాత 92 కి పెరిగి 2002 నాటికి 106 కు చేరాయి.యం.ఎస్.ఓ. ఎక్కువ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటూ పోయింది.

ఈ పోటీ పెరిగేకొద్దీ ఈ రంగంలో మాఫియా ప్రవేశించింది. రాష్ట్రంలో కేబుల్ టీవీ వ్యవస్థను కీలకమలుపు తిప్పి సాంకేతికంగా దేశంలోనే రాష్ట్రం ఎంతో ముందడుగు వేసేట్టు కృషిచేసిన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి రామకృష్ణ హత్యకు గురికావడమే మాఫియా జోక్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ తరువాతి కాలంలో ఎక్కువగా రాజకీయనాయకులు ఇందులో ప్రవేశించి సొంతంగానో, బంధువుల పేర్లమీదనో నడపటం మొదలైంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా యం.యస్.ఓ.ల నుండి మండలాలు ఇతర జిల్లాల్లోని కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇస్తున్నారు. హైదరాబాదు లోని యం.యస్.ఓ.లు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇచ్చారు, ఇంకా మరికొన్ని ప్రాంతాలకూ ఇస్తూన్నారు ఆర్థికంగా లాభదాయకం కావటం, మిగిలిన చానల్స్ ను కూడా గుప్పిట్లో పెట్టుకోగలగటం, తన అనుచరగణానికి ఊళ్ళు పంచిపెట్టటం, లేదా ఆయా ఆపరేటర్లనే తన అనుచరులుగా మార్చుకోవటం లాంటి అవసరాలకోసం రాజకీయనాయకులు కేబుల్ రంగంలో ప్రవేశిస్తున్నారు. క్రమం తప్పకుండా వచ్చే అదాయం సంగతలా ఉంచితే ప్రత్ర్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా కేబుల్ టీవీని వాడుకుంటున్న సందర్భాలున్నాయి. ఎమ్ ఎస్ వో కొరకరాని కొయ్యలా తయారయ్యా డనుకున్నప్పుడు బినామీల చేత కొనిపించిన సందర్భాలూ ఉన్నాయి. రాజకీయ నాయకుల వత్తిడికి తట్టుకోలేని వారు హాత్ వే, డిజి కేబుల్ వంటి కార్పొరేట్ ఎమ్ ఎస్ వో లకు నెట్ వర్క్ అమ్ముకోవటమూ సాధారణమైపోయింది.

చెల్లింపు చానల్స్

[మార్చు]

ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కాక టీవీ చూసే వినియోగదారుల నుండి ఆదాయం కోసం ఒక టీవీకి 1 రూపాయి నుండి 60 రూపాయల వరుకు వసూలు చేసే చానళ్ళను "చెల్లింపు చానల్స్" అంటారు. కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కేబుల్ ఆపరేటర్ వద్ద డబ్బులు వసూలు చేయనివి "ఉచిత చానల్స్". పే చానల్స్ తరచూ ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వినియోగదారులు ఎక్కువమొత్తాలు చెల్లించేందుకు ఆసక్తి చూపకపోవటం, అయినప్పటికీ కేబుల్ ఆపరేటర్లు మాత్రం పూర్తి మొత్తాలు చెల్లించాల్సి రావటం అందుకు ప్రధాన కారణం. ఇలా ఉండగా 2002 లో కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (CAS) అమలయ్యేలా కేబుల్ చట్టాన్ని సవరించారు. కావాల్సినవాళ్ళు మాత్రమే పే చానల్స్ తీసుకునే వెసులుబాటుకు అప్పుడే శ్రీకారం చుట్టారు. అయితే, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటానికి ఎమ్మెస్వోలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమయ్యాయి. ఆ కంట్రోల్ రూమ్ చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా సెట్ టాప్ బాక్సులు, చందాదారు నిర్వహణా వ్యవస్థ (SMS), ఎయిర్ కండిషనింగ్ కోసం అదనపు విద్యుత్ సౌకర్యం, ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు భారంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఖర్చుల భారం తగ్గించటానికి ఆప్టికల్ ఫైబర్ ప్రవేశపెట్టారు. దీనివలన ప్రసారాలు అందించగలిగే వ్యాసార్థం బాగా పెరిగింది. అంటే ఇడిఎఫ్ఎ (Erbium Doped Fiber Amplifier) వాడకుండా 34 కిలోమీటర్ల వ్యాసార్థంలో, ఒక ఇడిఎఫ్ఎ వాడితే 67 కిలోమీటర్లమేర ప్రసారాలు పంపటానికి వీలయ్యింది. దీనివలన కంట్రోల్ రూమ్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా హైబ్రిడ్ కొయాక్సియల్ ఫైబర్ ( HFC) నెట్ వర్క్స్ అనే భావనకు బీజం పడింది. మొత్తానికి పట్టణప్రాంతాల్లో 10 – 12 హెడ్ ఎండ్స్ కలిసిపోవటానికి వీలు కలిగింది. ప్రభుత్వం సెట్ టాప్ బాక్సుల ప్రమాణాలను సైతం నిర్దేశించింది. IS 15244, 15245 ప్రమాణాలు ఉండాలని స్పష్టంగా పేర్కొంది.

అంత సదుద్దేశంతో ప్రవేశపెట్టిన విధానం సైతం నీరుగారిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి:

  1. చానల్ యజమానులు వాళ్ళ చానల్ కు ధర ఎలానిర్ణయించారో వెల్లడించలేదు.
  2. అమలును పర్యవేక్షించటానికి తగిన సిబ్బంది సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు లేరు
  3. ప్రసార రంగమనేది కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమే అయినప్పటికీ, స్థానికంగా పాలనావ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించారు.
  4. వినియోగదారునికి తగిన అవగాహన కల్పించలేకపోవటం
  5. కనెక్షన్ల సంఖ్య బయటపడితే, పాత తేదీలతో ఎంటర్టైన్మెంట్ టాక్స్ పడుతుందనే భయంతో కేబుల్ ఆపరేటర్లు సహకరించలేదు.
  6. ఢిల్లీ హైకోర్టు 2007 జూలైలో జోక్యం చేసుకునేదాకా దీని అమలు మీద రాజకీయంగా పట్టుదల లేదు. మొత్తానికి చెన్నై లోనూ ఢిల్లీ, ముంబై నగరాల్లోని కొన్ని ప్రదేశాలలోనూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది.
  7. అయితే చానల్ యాజమాన్యాలుగాని, ఆపరేటర్ గాని, వినియోగదారుడు గాని CAS అమలుమీద ఏ విధమైన ఆసక్తీ కనబరచకపోవటం వల్ల పెద్దగా సాధించినదేమీ లేదు.

బుల్లితెర దరహాసం

[మార్చు]

ఇండియాలో కేబుల్ టీవీ సుమారు 20 కోట్ల కనెక్షన్లుకు చేరింది. ఇది కేవలం ఇరవై ఏళ్ళలోనే సాద్యమైంది. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న భారతీయ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) భారతదేశంలో సమాచార మార్పిడులు భారతదేశ టెలిఫోన్ చరిత్ర 1882 జనవరి 28 నుండి ఇప్పటి వరకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నూట ముప్పై ఏళ్ళల్లోను ఈ రికార్డును చేరలేదు. కానీ ఇంతకంటే తొందరగా మోభైల్ పోన్లు ఇండియాలో 2000 నుండి 2015 వరకు కేవలం 15 సం||ల్లో హండ్ సేట్ల సంఖ్య 30 కోట్ల సంఖ్య దాటింది.అత్యంత వేగంగా విస్తరించి ఇప్పుడు 2018 అది 40 కోట్ల సంఖ్య చేరి మొదటి స్ధానంలో చేరింది. మొదటి స్ధానంలో ఉండగ కేబుల్ టీవీని వెనక్కి నెట్టింది.

డి.టి.ఎచ్.

[మార్చు]

డైరక్టటూ టూ హోం (చానల్ ప్రసారం ఉపగ్రహ నుండి వినియోగదారునికి కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండ) టీవీ చూసే విధానం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. కేబుల్ తో సంబంధం లేకుండా ప్రత్యేకమైన పరికరాల సాయంతో వినియోగదారులకు ప్రసారాలు అందించటం మొదలుపెట్టింది. దీనివలన కేబుల్ టీవీ కనెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అందుకూ కొన్ని కారణాలున్నాయి:

• కేబుల్ ఆపరేటర్ లాంటి మధ్యవర్తి మరొకరు లేకుండా నేరుగా ప్రసారాలు అందుకునే వెసులుబాటు • మెరుగైన నాణ్యతతో దృశ్యం, శబ్దం అందుకోగలగటం • ముందుగా చెల్లించే విధానంతో ( ప్రీ పెయిడ్ ) బాటు ప్యాకేజ్ ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం • బిల్లు చెల్లింపులు, సర్వీసింగ్ లాంటివిచాలా ప్రొఫెషనల్ గా నడుస్తూ రావటం • వ్యవస్థీకృతం కాని కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్ కు ప్రత్యామ్నాయంగా నిలవటం • గ్రామాల్లో కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్ వ్యతిరేకవర్గీయులు పంతంకోసం ఎంచుకోవటం

ఏమైనప్పటికీ కేబుల్ ఆపరేటర్ కి ఇది పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కాలేకపోయింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చూసినా డిటిహెచ్ 15 శాతం మించలేదు. ఇక్కడా దాదాపు అదే స్థాయిలో ఆగిపోయింది. ఈలోగా చానల్స్ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది, డిటిహెచ్ ఆపరేటర్లు ఆ చానల్స్ అన్నీ డౌన్ లింక్ చేసుకోవటానికి తగినన్ని ఉపగ్రహ ట్రాన్స్ పాండర్లు లేక కొరత ఏర్పడింది. కేబుల్ నెట్ వర్క్ ద్వారా వెయ్యి చానల్స్ వరకూ అందించగలిగే డిజిటల్ ప్రసారాలమీద పరిశ్రమ, ప్రభుత్వం దృష్టి సారించాయి.ఇతర దేశాల్లో 10%, 20% ఉపయోగిస్తూన్నారు, ఇండియాలోను డిష్ టీవీ, టాటాస్కై, డీడీ డైరక్టటూ, రిలయెన్స్, సన్ డైరక్టటూ, ఎయిర్ టెల్, వీడీయోకాన్, సంస్ధలు సేవలు అందిస్తూన్నవి. దేశంలో డీటీహెచ్ సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన 1996లోరాగా, జాతీయ భద్రత విషయంలో ఆందోళనలు వినిపించడంతో అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. 2003 అక్టోబరు 2న డిష్ టీవీ తొలిసారిగా డీటీహెచ్ ప్రసారాలను ప్రారంభించింది. దూరదర్శన్ డీడీ ఫ్రీ డిష్ సేవలు 2004 డిసెంబరు నుంచి మొదలయ్యాయి. ఇందూలో కేవలం డీడీ డైరక్టటూ సంస్ధ ఉచిత సేవలు ఇండియాలో వినియోగదారునికి అందిస్తూన్నది.

కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించటానికి

[మార్చు]

పరిశ్రమకు ప్రయోజనాలు

• సరైన గణాంకాలు లేకపోవటం వలన ఇప్పటివరకూ కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించటానికి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా చాలాచోట్ల బ్యాంకులు అప్పివ్వటానికి వెనుకాడుతున్నాయి. ఇకమీదట అలాంటి సమస్యలుండవు. పరిశ్రమ పరిమాణాన్ని, విలువను అంచనావేయటానికి సిఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలకు వెసులుబాటు కలుగుతుంది. పరిశ్రమ ఎదుగుదలకూ అది దోహదం చేస్తుంది. • పే చానల్స్ కు ఆదరణ ఉండటం వలన నాణ్యత పెంచుకొని పే చానల్స్ గా మారటానికి ప్రయత్నాలు మరింతగా పెరుగుతాయి. దీంతో పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. • సినిమాల ఉపగ్రహ హక్కుల ధరలూ బాగా పెరుగుతాయి. పే చానల్స్ మధ్య పోటీ వలన ఇది తప్పనిసరి అవుతుంది, ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల మీద ఆంక్షలు లేకపోవటం ఈ పరిస్థితులకు దోహదం చేస్తుంది. • పారదర్శకత వలన రేటింగ్స్ లెక్కించటానికి ఆధారపడదగిన శాంపిల్ తీయవచ్చు. కచ్చితమైన రేటింగ్స్ వస్తే ప్రకటనదారులు ఆ రేటింగ్స్ మీద ఆధారపడవచ్చు • ఎమ్మెస్వో కీలకం కావటం వలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేసి వాళ్ళ ద్వారా అమలు చేయటం సులభమవుతుంది

నియంత్రణ వ్వవస్థ

[మార్చు]

1995లో ప్రభుత్వం TRAI (టెలికాం రెగ్యులేటరీ అధారిటీ అఫ్ ఇండియా) భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ సంస్థలకే కేబుల్ టీవీ నియంత్రిణ కూడా అప్పగించబడింది.

ఈ సంస్థ 1995లో కేబుల్ టీవీ నియంత్రిణ చట్టంగా (నియమ నిబందనలు రూపొందించారు) చేశారు. ఆ చట్టాని 2000 ఆగస్టు 11, 2005, 2011 సం. రాల్లో సవరించబడింది.

సవరించిన కేబుల్ చట్టం, ట్రాయ్ నిర్దేశించిన నిబంధనల ముఖ్యాంశాలివి :

1.ఉచిత చానల్స్ అయినా, పే చానల్స్ అయినా అన్ని ప్రసారాలూ డిజిటల్ మాత్రమే అయి ఉండాలి. ఎమ్ క్రిప్ట్ చేసి ఉండాలి. చందాదారు యాజమాన్య వ్యవస్థ ( SMS ) చేత నియంత్రించబడాలి. అంటే, అంతా పద్ధతిప్రకారం, లెక్కప్రకారం జరగాలి. 2.కేబుల్ టీవీ ద్వారా అందించే ప్రసారాలు రెండు స్థాయిలలో ఉండాలి. మొదటిది బేసిక్ ప్యాకేజ్. ఇందులో ఉచిత చానల్స్ ఉంటాయి. రెండోది పే చానల్స్ ప్యాకేజ్. ఈ రెండూ కూడా కచ్చితంగా డిజిటల్ విధానంలో మాత్రమే అందించాలి. 3.ఎన్ కోడింగ్, ఎన్ క్రిప్షన్, మల్టిప్లెక్సింగ్, మాడ్యులేషన్, డిజిటల్ ప్రసారం కోసం చానల్స్ ను కలపటం లాంటి పనులన్నీ జరిపే డిజిటల్ హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) కోసం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. 4.చందాదారునికి ధరల పట్టిక అందజేసి, అందులోనుంచి ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. అదే విధంగా సెట్ టాప్ బాక్స్ సమకూర్చుకోవటానికి వీలున్న మార్గాలన్నీ అందుబాటులో ఉంచి స్వేచ్ఛనివ్వాలి. నేరుగా కొనుక్కోవటమా, అద్దెకు తీసుకోవటమా, వాయిదాల పద్ధతిలో కొనుక్కోవటమా అనేది చందాదారుడి ఇష్టం. 5.చందాదారుడు తనకు కావాల్సిన చానల్స్ ఎంచుకుంటూ సంబంధిత నియమనిబంధనలకు ఆమోదించి ఒప్పందం కుదుర్చుకునేలా చందాదారు దరఖాస్తు ( Subscriber Application Form – SAF ) అందజేసి నింపేట్టు చూడాలి. అది ఒక విధంగా హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ కూ చందాదారుకూ మధ్య ఒప్పందం లాంటిది. 6.చందాదారునికి ఇచ్చే బిల్లు అంశాలవారీగా ఉండాలి. అంటే, ఉచిత చానల్స్ కు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం, పే చానల్స్ కు ఆ చందాదారు ఎంచుకున్న చానల్స్ కు ఒక్కోదానికి వసూలు చేస్తున్న మొత్తం, ఇంటర్నెట్ లాంటి వాల్యూ యాడెడ్ సేవలుంటే వాటి విలువ, విధించిన పన్నులు చూపిస్తూ బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులో స్పష్టంగా హెడ్ ఎండ్ చిరునామా, మంత్రిత్వశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్టైన్మెంట్ టాక్స్, సర్వీస్ టాక్స్, రిజిస్ట్రేషన్ నెంబర్లు, కేబుల్ ఆపరేటర్ ఐడి నెంబర్, చందాదారు ఐడి నెంబర్, సెట్ టాప్ బాక్స్ సీరియల్ నెంబర్ ఉండాలి. 7.కేబుల్ టీవీ నెట్ వర్క్ లు కేబుల్ వేసుకోవటానికి దారి హక్కు కల్పించాలి. ఈ బాధ్యత రాష్ట్రప్రభుత్వాలమీద, అక్కడి స్థానిక సంస్థలమీద ఉంటుంది. 8.కేబుల్ టీవీ కార్యకలాపాలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అవసరం. అదేవిధంగా హెడ్ ఎండ్ (కంట్రోల్ రూమ్) నడపటానికి సర్వీస్ ప్రొవైడర్ గా మరో పోస్టల్ రిజిస్ట్రేషన్ కావాలి. ఎమ్మెస్వో అయితే పంపిణీకోసం ఒకటి, తన సొంత పాయింట్ల నిర్వహణకోసం మరొకటి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ హెడ్ ఎండ్ కోసం సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ లైసెన్స్ కావాలి. 9.కనీసం అందించాల్సిన ఉచిత చానల్స్ సంఖ్య 100 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వినోదం, సమాచారం అందించే చానల్స్ కలసి ఉండాలి. ఏ చానల్స్ ఎన్ని అనేది ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో నగరంలో, ఒక్కో పట్టణంలో భిన్నంగా ఉండవచ్చు. 10.కనీస చానల్స్ అందించినందుకు ఆపరేటర్లు వసూలు చేసుకోవాల్సిన చందా మీద గరిష్ఠ పరిమితి విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంటుంది. ప్రస్తుతం ట్రాయ్ నిబంధనల ప్రకారం నెలకు వంద రూపాయలుంది. 11.డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న ఎమ్మెస్వోలు చందారేట్లు విడివిడిగానూ, ప్యాకేజీల రూపంలోనూ ఒక నిర్దిష్టమైన నమూనాలో ప్రచారం చేయాలి. నిజానికి ప్రతి చందాదారునికీ చందాదారు దరఖాస్తు ( SAF ) నింపే సమయంలో ఒక రేట్ కార్డ్ అందించి అదే కార్డును తన వెబ్ సైట్ లో కూడా ప్రదర్శించాలి. 12.ప్రతి డిజిటల్ హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ తన పరిధిలో ఉన్న చందాదారుల జాబితా, చందా రేట్లు, ప్రాథమిక ప్యాకేజ్ కింద ఉచిత చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు, పే చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు తదితర వివరాలను నిర్దిష్టమైన ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికలో చానల్స్ కు జరిపే చెల్లింపుల వివరాలు కూడా ఉండాలి.

కేబుల్ టీవీ పరిశ్రమ మొదలై రెండు దశాబ్దాలు దాటిన తరువాత 2011 డిసెంబరులో లోక్ సభ ఒక బిల్లును ఆమోదించింది. భారతదేశంలో కేబుల్ టీవీని డిజిటైజ్ చేయటం దీని ప్రధానోద్దేశం. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ సవరణ చట్టం 2011, సవరణ నిబంధనలు ( 2012 ) తో బాటుగా దశలవారీ డిజిటైజేషన్ అమలుకోసం ట్రాయ్ నిబంధనలు నెం. 9, 12, 13 జారీచేసింది.

దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా 15 కోట్ల ఇళ్ళతో అనుసంధానమైన పరిశ్రమ కేబుల్ టీవీ నెట్ వర్క్. 106 అనలాగ్ చానల్స్ అందించగలిగేలా కంట్రోల్ రూమ్స్, కేబుల్స్ తదితర వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 2011 నాటికి ఈ వ్యవస్థలో పాతికవేల కోట్లకు పైబడి ప్రైవేట్ పెట్టుబడి చేరింది. దీనినుంచి ఏటా 12 నుంచి 13 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందుకే ఈ రంగం ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కనిపించింది.. ఆ క్రమంలోనే కేబుల్ ఆపరేటర్ మీద ఎంటర్టైన్మెంట్ టాక్స్, సర్వీస్ టాక్స్ పడ్డాయి. అయితే, ఆ పన్ను విధింపుదారులకు మనమేం చేస్తున్నామనే ధ్యాస లేకుండా పోవటం మాత్రం దారుణం.

పార్లమెంట్ ఈ చట్టం చేసిన తరువాత దీని అమలు సాఫీగా సాగిపోవటం ఎలాగన్నది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా తయారైంది. అందుకే దీనికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించే బాధ్యతను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి అప్పగించింది. మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియను విశ్లేషించిన ట్రాయ్ తన సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు అందజేసింది.[1]

దశల డిజిటైజేషన్

[మార్చు]

దశ ప్రాంతాలు గడువు తేదీ

మొదటి దశ నాలుగు మెట్రో నగరాలు ( ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై ) 2012 అక్టోబరు 31 రెండో దశ హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా 38 నగరాలు 2013 మార్చి 31 మూడో దశ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పట్టణాలు 2015 డిసెంబరు 31 నాలుగో దశ మిగిలిన గ్రామీణప్రాంతాలన్నీ 2016 డిసెంబరు 31

సెట్‌టాప్ పెట్టెలు

[మార్చు]

పార్లమెంటు ఆమోదించిన కేబుల్ టీవీ నెట్ వర్కు సవరణ బిల్లు 2011 . ప్రకారం దేశవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు తమ నెట్ వర్కును డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు సైతం అనలాగ్ సిగ్నల్ నుండి డిజిటల్ సిగ్నల్స్ కు మారాల్సి ఉంటుంది. ఇండియాలో కేబుల్ టీవీ ఇండ్లల్లోని టీవీ సెట్ కనెక్షన్ కు డిజిటల్ సిగ్నల్స్ స్వీకరించడానికి సెట్‌టాప్ పెట్టె (2) అవసరముంటుంది.

డిజిటైజేషన్ నాణ్యత విషయంలో వినియోగదారుని హక్కులు

1. రకరకాల స్కీముల వివరాలు, నిబంధనలు, షరతులు, చందా వివరాలు, సెట్ టాప్ బాక్స్ వివరాలు తెలుసుకోవచ్చు 2. చానల్స్ కు విడివిడిగా చందా కట్టే వెసులుబాటు వాడుకోవచ్చు 3. కేబుల్ ఆపరేటర్ కు చెల్లించే మొత్తానికి రశీదు పొందవచ్చు 4. ముందుగా చందా చెల్లించే విధానం ( ప్రీ పెయిడ్ చందా చెల్లింపు ) లోనూ బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు 5. నెల నుంచి మూడు నెలలవరకు విరామం కావాలంటే సేవలు ఆపమని అడగవచ్చు. అంటే, పిల్లల పరీక్షల సమయంలో టీవీ వద్దనుకుంటే వద్దని చెప్పవచ్చు. 15 రోజుల ముందుగా తెలియజేస్తే, వద్దనుకున్న కాలానికి చందా కట్టనక్కర్లేదు. అయితే, సెట్ టాప్ బాక్స్ ను అద్దె పద్ధతిలో తీసుకుంటే దాని అద్దె మాత్రం కట్టాలి. 6. చందాదారుడు ఎప్పుడైనా చెల్లింపు విధానాన్ని ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మార్చుకోవచ్చు. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు..

సెట్‌టాప్ పెట్టెల కలవరం

[మార్చు]

2011 లో దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2012 నవంబరు 1 తో ముగిసింది. అవి దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబాయీ, కోల్ క్తత,చెన్నైయ్ పట్టణ ప్రాంత కేబుల్ టీవీ వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్‌(ఎస్‌టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

పన్నుల వడ్డింపునకే కేబుల్‌టీవీ డిజిటైజేషన్

[మార్చు]

వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి.

డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 745 టీవీ చానెళ్లు, 245 ఎఫ్‌ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి.

ఎమ్ ఎస్ వో లకు ప్రయోజనాలు

• డిజిటైజేషన్ లో అత్యధికంగా లబ్ధి పొందేది ఎమ్ ఎస్ వోలు మాత్రమే • డిజిటైజేషన్ తరువాత వినియోగదారులనుంచి వసూలు చేసే చందా మొత్తాలు అనివార్యంగా పెరుగుతాయి. ముందుగా వాళ్ళు పే చానల్స్ తో టోకున ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాబట్టి నేరుగా ఆపరేటర్లు తీసుకునేదానికంటే తక్కువ ధరకు వస్తాయి. బేరమాడే శక్తి పెరుగుతుంది. • పెద్ద మొత్తంలో క్యారేజ్ ఫీజులు వస్తాయి. ముఖ్యంగా ఉచిత చానల్స్ పోటీపడి మరీ ఇస్తాయి. క్యారేజ్ ఫీజు తగ్గినట్టు చూపినా అది కేవలం పే చానల్స్ వారి గ్రూపుకు చెందినవే అయి ఉంటాయి. అందుకు బదులుగా తక్కువరేట్లకు వాళ్ళ పే చానల్స్ తీసుకుంటారు. • ఆపరేటర్లకు చెందాల్సిన ఆదాయపు వాటాని నిర్దిష్టంగా పేర్కొనటం వలన వివాదాలు తలెత్తే అవకాశం లేదు. డిటిహెచ్ ఆపరేటర్లకు ప్రయోజనాలు : • డిజిటైజేషన్ లో చందాలు పెరుగుతున్నట్టు తేలగానే వినియోగదారులు డిటిహెచ్ వైపు మొగ్గుచూపుతారు కాబట్టి డిటిహెచ్ కి డిజిటైజేషన్ పరోక్షంగా లాభం చేకూర్చుతుంది. • డిజిటైజేషన్ లోనూ సెట్ టాప్ బాక్స్ అవసరం ఉండటం వలన మరికొందరు డిటిహెచ్ పట్ల ఆసక్తి చూపే అవకాశముంది. • ప్రాంతీయంగా ప్యాకేజీలు తయారుచేసి పోటీపడటం ద్వారా ఎమ్ ఎస్ వో లతో పోటీపడి వ్యాపారం పెంచుకోవటానికి డిటిహెచ్ ఆపరేటర్లు పోటీపడతారు. • డిటిహెచ్ వినియోగదారులు తమ సర్వీస్ ప్రొవైడర్ ను మార్చుకునే అవకాశం కల్పించటం ద్వారా పోటీ తట్టుకునే ప్రయత్నం చేయవచ్చు.

వినియోగదారులకు ప్రయోజనాలు :

• ప్రసారాల వీడియో నాణ్యత మెరుగ్గా ఉంటుంది. • ఎక్కువ చానల్స్ నుంచి కావాల్సినవి ఎంచుకోవచ్చు • కోరుకున్న చానల్స్ కి మాత్రమే చెల్లించే అవకాశం ఉండటం వల్ల చందా బడ్జెట్ ని నియంత్రించుకోవచ్చు • బ్రాడ్ బాండ్ సహా అనేక వాల్యూ యాడెడ్ సర్వీసులు అందుకునే అవకాశం ఉంటుంది. •ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (EPG) వలన కార్యక్రమాల వివరాలు తెలుస్తాయి, చానల్స్ వేగంగా ఎంచుకోవచ్చు

కేబుల్ ఆపరేటర్ కి ప్రయోజనాలు :

• కచ్చితమైన లెక్కలతో పారదర్శకమైన సమాచారం ఉంటే సులభంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు • కనెక్షన్ల లెక్క తక్కువ చెబుతున్నారనే నిందనుంచి బయటపడవచ్చు. • చందావసూళ్ళ విషయంలో ఎమ్ ఎస్ వో నిర్మొహమాటంగా వ్యవహరించి కనెక్షన్లు కట్ చేసే పరిస్థితులుండటం వలన మొండిబాకీలుండవు. • పే చానల్స్ ను అడిగినవాళ్ళకు అడిగినట్టుగా ఇవ్వటం వలన అందరిమీదా భారం మోపనక్కర్లేదు • బ్రాడ్ బాండ్, వాయిస్ ఆన్ డిమాండ్, వీడియో గేమింగ్, వీడియో రికార్డింగ్ లాంటి అదనపు సౌకర్యాలు కల్పిచి వాటికి డబ్బు వసూలు చేసుకోవచ్చు.. • ఎమ్ ఎస్ వో లు, ఆపరేటర్లు ఆదాయాన్ని పంచుకోవటంలో నిర్దిష్టమైన నిష్పత్తి ఉండటం వలన వివాదాలకు తావుండదు.

బుల్లితెర కష్టాలు

[మార్చు]

సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదించిది . కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది దీన్ని పాటించాల్సిందే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నుంచి ఆదేశాలు ఉత్తర్వులను పాటించాల్సిందే. మరోపక్క బాక్సులకు దేశంలో తీవ్ర కొరత ఉంది. . సెట్ టాప్ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్ సంకేతాలు నిలిచిపోయాయి. లక్షల ఇళ్లలో టీవీలు బుల్లితెర వినోదానికి తెరపడింది బాక్స్‌లు బిగించని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతున్నాయి.

నిజానికి డిజిటైజేషన్ అమలులో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. చాలా వరకూ ముందుగా ఊహించని సమస్యలే. మరికొన్ని కోర్టు కేసులూ రావటంతో జాప్యం అనివార్యమైంది. డిజిటల్ లైసెన్స్ లు త్వరగా ఇవ్వాల్సి రావటంతో ముందు తాత్కాలిక పద్ధతిమీద ఇచ్చి ఆ తరువాత శాశ్వత లైసెన్సులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. కొంతమంది పెద్ద ఎమ్మెస్వోలకు లైసెన్స్ రద్దు చేసిన ఘటనలు కూడా తీవ్ర కలకలం రేపాయి. మొత్తమ్మీద డిజిటైజేషన్ అమలు చాలా వేగంగా, హడావిడిగా జరగాలనుకోవటం వలన అనేక సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో సెట్ టాప్ బాక్సుల అందుబాటు గురించి పట్టించుకోకపోవటం, విదేశీ సెట్ టాప్ బాక్సులమీదనే ఆధారపడాల్సి రావటం మరికొన్ని కారణాలు.

డిజిటైజేషన్ అమలు తీరు పర్యవేక్షించటానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. అయితే, ఎమ్మెస్వో గొడౌన్ నుంచి ఎన్ని సెట్ టాప్ బాక్సులు బయటికెళ్ళాయన్నదే విజయానికి సంకేతంగా మారింది తప్ప వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) పరికరాల నాణ్యత విషయంలోనూ అదే హడావిడి వలన నాణ్యత మీద దృష్టిపెట్టకపోవటం స్పష్టంగా కనిపించింది. మొదటి రెండు దశల్లోని చందాదారులకు అసలు డిజిటైజేషన్ పట్ల ఎంతమాత్రమూ అవగాహన ఏర్పడలేదు.

అందువల్లనే చందాదారుల దరఖాస్తులు నింపటం, కావాల్సిన చానల్స్ ఎంచుకోవటం లాంటి పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది. దీనివలన ఎమ్మెస్వోలు కూడా SMS అమలు చేయలేకపోయారు. ఫలితంగా చందాదారులకు కోరుకున్న చానల్స్ కు అనుగుణంగా బిల్లు అందుకునే అవకాశం లేకుండా పోయింది. చాలామంది అసలు రేట్ కార్డ్ చూడలేదని కూడా ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. అందమైన యాంకర్లు టీవీ తెరమీద ప్రత్యక్షమై చందాదారుల దరఖాస్తులు నింపాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా, ఇంకా ఆశించిన ప్రయోజనం కనబడ లేదు.

నిజానికి అధికారులకు క్షేత్రస్థాయి సమస్యలమీద అవగాహన లేకపోవటం వల్లనే ఆచరణ యోగ్యం కాని విషయం స్పష్టమైంది.

గడువు తేదీ లోగా పూర్తి చేయాలనే లక్ష్యం మీద మాత్రమే దృష్టిపెట్టటం వలన చౌక రకం హార్డ్ వేర్ రంగప్రవేశం చేసింది. ఇది ప్రైవేట్ పట్టుబడులకు సంబంధించినది కావటంతో ప్రభుత్వం పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నత్త నడక నడిచింది. మొత్తం దాదాపు 6 వేల హడ్ ఎండ్స్ ఉంటాయని అంచనావేయగా నాలుగు వందలు కూడా రిజిస్టర్ కాలేదు. ఇటీవలే వేగంగా లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రతి నెలా రెండేసి సార్లు సమావేశాలు జరుపుతూ దరఖాస్తు దారుల సమస్యలు పరిష్కరిస్తూ జాప్యానికి కారణాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు.

రెండో దశలో డిజిటైజేషన్ 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ ఉన్నాయి

[మార్చు]

రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి డిజిటైజేషన్‌లో భాగంగా 2013 సెప్టెంబరు 18 తో ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సెట్‌టాప్ బాక్సుల పాట్లు తప్పడంలేదు. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో జనం బేజారవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యతను పరిగణలోకి తీసుకోకుండామార్చి 31ని తుదిగడువుగా విధించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువు పెంచాలని కోరుతూ కొందరు ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు విశాఖలో పది శాతం మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్‌టీబీలు అమర్చుకున్నారు.

హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే.. నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారా హిల్స్, ఖైరతాబాదు, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీ హిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.

జంటనగరాల్లో కేబుల్ లెక్కలివే..

మొత్తం కేబుల్ కనెక్షన్లు: సుమారు 30 లక్షలు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు: సుమారు 6 లక్షలు సెట్‌టాప్‌బాక్స్‌ల అవసరం: సుమారు 24 లక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవి: ఏడు లక్షలు, కొరత: సుమారు 17 లక్షలు సెట్‌టాప్ బాక్స్ ధర: కంపెనీని బట్టి రూ.1250 నుంచి రూ.1500

మూడవ దశ పిబ్రవరి 31 2017 వరకు గడువిచ్చింది

[మార్చు]

కేబుల్‌ టీవీ వ్యవస్థను డిజిటలైజ్‌ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్‌ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్‌ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్‌ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్‌ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి ఇందుకు సంబంధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్‌ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ సాధ్యం కాలేదు. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్‌ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్‌ కనెక్షన్లు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకున్నాయి.

ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు . మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్‌ కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్‌ బాక్సులకు తీవ్రమైన డిమాండ్‌ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం కష్టమే.

నాలుగో దశ తేదీ 2017 మార్చి 31

[మార్చు]

దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబరు 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్‌ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ తేదీ పెంపు వారికి ఇంకా డిజిటల్‌లోకి మారకపోతే వారికి పిబ్రవరి 31వరకు గడువిచ్చింది.ఇక ఈ నెల రోజుల్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం ఎలా సాద్యమో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పాలి. విదేశాల నుంచి సెట్‌టాప్‌బాక్స్‌ల దిగుమతి నిలిచిపోవడంతో వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. గడువును ఆరు నెలలపాటు పెంచాలని కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు.

నాలుగో దశకు గడువు కేవలం ఒక నెల రోజులు

[మార్చు]

నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది.

తల తోక లేని ట్రాయ్ నిర్ణయం

[మార్చు]

డిజిటలైజేషన్‌పై గతంలో ప్రభుత్వం ఎంఎస్‌వోలు భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, 68.84% భారతీయులు (833.1 మిలియన్ల మంది) 6,49,481 వివిధ గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామాల పరిమాణం గణనీయంగా మారుతుంది. 236,004 భారత గ్రామాల్లో 500 కన్నా తక్కువ జనాభా ఉండగా, 3,976 గ్రామాలలో 10,000+ జనాభా ఉంది. నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు 6,49,481 ఫలితంగా గ్రామాలలో అనలాగ్ పద్ధతిలో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి ప్రసారాలు నిలిచిపోయాయి. కేవలం ఒక నెల రోజులలో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు[ప్రతి టి.వికి ] సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

డిజిటైజేషన్

1. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2010 - 2012 నవంబరు 1 వరకు [సుమారు 2 సంవత్సరాలకు పైగా] దేశం ఆర్థిక నగరాలకు గడువు 2. రెండో దశలో 2012 నవంబరు 1 - 2013 సెప్టెంబరు 18 వరకు[సుమారు 2 సంవత్సరాలకు పైగా] 2 వ శ్రేణీ దేశ ఆర్థిక నగరంలకు గడువు 3. మూడోదశలో దేశం లోని 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సెప్టెంబరు 2013 - పిబ్రవరి 31, 2017 వరకు[సుమారు 4 సంవత్సరాలకు పైగా]పట్టణంలకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 4. నాలుగో దశ తేదీ పిబ్రవరి 31, 2017 - 2017 మార్చి 31 ఆర్థికంగా వెనుకబడి, విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు.అలాటి గ్రామాలు,చిన్న గ్రామా పంచాయతీలకు కేవలం ఒక నెల రోజుల గడువు.1.డిజిటైజేషన్ గడువు లోగా పరిశ్రమ వ్యవస్థీకృతం మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ గడువును పెంచటం వలన పరిశ్రమ వ్యవస్థీకృతం కావటానికి కొంత అదనపు సమయం దొరికినట్టయింది. ఈ సమయంలో మార్కెట్లు కొంత పరిణతి చెందటానికి వీలుంటుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. బలవంతంగా పే చానల్స్ పేరుతో వసూలు చేసే లోపు వినియోగదారుడు కూడా పే చానల్స్ కు అలవాటు పడతాడు. ఆ విధంగా బొకే విధానం మీద కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. లేకపోతే అయోమయమే కొనసాగుతుంది. నిజానికి మొదటి రెండు దశల్లో అదే జరిగింది. మూడేళ్ళ తరువాత కూడా ప్రేక్షకులు తాము కోరుకున్న చానల్స్ చూడలేకపోతున్నారు. అంతేకాదు కంప్యూటరైజ్డ్ బిల్లులు పొందలేకపోతున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అతిపెద్ద దశల్లో అంతకంటే ఘోర వైఫల్యాలు చవిచూడబోతున్నారు.

2. పే చానల్స్ ప్రసారాలకు నాణ్యతాప్రమాణాలు సేవలలో నాణ్యత గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లగురించి మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చిన ట్రాయ్ అసలు ఆ ప్రసారాల తయారీదారులను నాణ్యత గురించి ప్రశ్నించకపోవటం దారుణం. తక్కువ బాండ్ విడ్త్ లో ఎక్కువ చానల్స్ పట్టేలా కంప్రెస్ చేసి నాణ్యతను బేఖాతరు చేస్తున్న చానల్స్ మీద ట్రాయ్ ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. అంటే, అంతిమంగా నాణ్యత కరవైన ప్రసారాలతోనే వినియోగదారుడు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే విధంగా పే చానల్స్ ఒకవైపు పెద్ద మొత్తాల్లో వినియోగదారుడి నుంచి చందా మొత్తాలు గుంజుతూనే ప్రకటనలతో విసిగిస్తున్నాయి. అనేక దేశాల్లో పే చానల్స్ ప్రకటనలు ప్రసారం చేయటం నిషిద్ధం. ఇటీవలే రష్యా కూడా నిషేధం విధించింది. మనదేశంలో నిషేధం విధిమ్చకపోయినా కనీసం ఒక పరిమితి విధించటానికీ వెనకాడే పరిస్థితి. అంతెందుకు, గంటకు 12 నిమిషాలు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదని కేబుల్ టీవీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ నిబంధనను అమలు చేసే పట్టుదలగాని, అంకితభావం గాని ప్రభుత్వానికి లేవు. ఇది కూడా ప్రేక్షకులపట్ల ఉన్న చులకన భావనకూ, చానల్స్ మీద ఉన్న ప్రేమకూ నిదర్శనం. ప్రకటనల ప్రసారం మొదలుకాగానే ఒక్క సారిగా వాల్యూమ్ పెరిగి టీవీ దద్దరిల్లుతుంది. దీనిమీద కూడా ప్రభుత్వం ఎలాంటి కట్టడీ చేయలేకపోయింది. ఒకవైపు డిజిటైజేషన్ తో ప్రసారాల నాణ్యత పెరుగుతుందంటూ ఊదరగొడుతున్న ట్రాయ్, నాణ్యత పెరగటానికి వీలుగా చానల్స్ ఎంత బాండ్ విడ్త్ పెంచుకుంటున్నాయో పరిశీలించలేకపోతోంది. నాణ్యతానిబంధన చానల్స్ కు కూడా వర్తించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. చానల్స్ ఇచ్చే ప్రసారాలు నాణ్యంగా లేనప్పుడు కేవలం సెట్ టాప్ బాక్స్ పెట్టుకోగానే వినియోగదారుడికి. నాణ్యమైన ప్రసారాలు అందటం భ్రమ మాత్రమే.

3. చందాల టోకు ధర నిర్ణయం పే చానల్స్ వసూలు చేసే చందా రేట్ల విషయంలో ట్రాయ్ అపరిమిత స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే పే చానల్ యాజమాన్యాలు తాము నిర్ణయించుకున్న చిల్లర ధరలను వచ్చే ఐదేళ్ళకూ ప్రకటించాల్సి ఉంటుంది. టారిఫ్ ఆర్డర్ లో ఇచ్చిన మూడు స్లాబ్స్ గమనిస్తే సగటున ఒక్కో చానల్ కు నెలకు 5 రూపాయలుంటుంది. నిజానికి CAS లో కూడా ఇదే విధమైన లెక్కింపు జరిగింది. పెద్దగా వ్యతిరేకత లేకుండా అందరూ దీన్ని ఆమోదించారు కూడా. కానీ డిజిటైజేషన్ లో ట్రాయ్ ఏ విధంగానూ నియంత్రించలేకపోతోంది. ఇప్పుడు చూస్తుంటే సగటు ధర 10 రూపాయలకు ఏ మాత్రమూ తగ్గేలా లేదు. అంటే, ట్రాయ్ చెప్పిన ధరకు రెట్టింపు. స్పోర్ట్స్ చానల్స్ అయితే ఒక్కొక్కటి 30 రూపాయలకు తక్కువ లేవు. ఈ ధరలతో 12 కోట్ల ఇళ్ళకు ప్రసారాలు అందుతాయా? అసలు డిజిటైజేషన్ అంటేనే జనం మీద సెట్ టాప్ బాక్స్ భారమని అనుకుంటున్న సమయంలో ఇలా పే చానల్ ధరలకూ అడ్దూ అదుపూ లేకుండా పోతుంటే ట్రాయ్ అలా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎలా ? వినియోగదారులకు ఇది పెనుభారంగా తయారవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వకపోవటంతో స్వయంగా సెట్ టాప్ బాక్స్ భారం మోస్తున్న వినియోగదారుడిమీద ఇలా నెలనెలా పడే భారాన్ని రెట్టింపు చేయటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. అందుకే మొదటి ఐదేళ్ళ డిజిటైజేషన్ కాలంలో ఒక్కో పే చానల్ చిల్లర ధర 5 రూపాయలకు మించకుండా ట్రాయ్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొత్తం మార్కెట్ ను నిర్ణయిస్తున్నది పే చానల్ నిర్వాహకులు, డిటిహెచ్ ఆపరేటర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలు మాత్రమే. ఈ వ్యవహారంలో నష్టపోతున్నది వినియీగదారులే. అందుబాటు ధరలో వినోదం అందే అవకాశమే కనబడటం లేదు. డిటిహెచ్ తీసుకున్నా, కేబుల్ కనెక్షన్ తీసుకున్నా, పే చానల్స్ బాదుడు పెనుసమస్యగా తయారైంది. పైగా, ఉచిత చానల్స్ విషయంలో ట్రాయ్ అనుసరించిన విధానం కూడా సమంజసంగాలేదు. డిజిటైజేషన్ పేరుతో పే చానల్స్ తో బాటు ఉచిత ( ఫ్రీ టూ ఎయిర్ – ఎఫ్ టి ఎ ) చానల్స్ ను కూడా బలవంతంగా ఎన్ క్రిప్ట్ చేయించటం వలన కోట్లాది ప్రేక్షకులకు ఈ చానల్స్ ను సులభంగా చూసే అవకాశం పోతోంది. అందులో దూరదర్శన్ చానల్స్ కూడా ఉన్నాయి. మరో వైపు చానల్స్ నడుపుతున్న పెద్ద పెద్ద గ్రూపులు తమ పే చానల్స్ కు బొకే పద్ధతిలో చందా ధరలు నిర్ణయించి ఒంటరి చానల్స్ ను అణగదొక్కు తున్నారు.

డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో పే చానల్ యజమానులు అదే పనిగా దబ్బు గుంజే పనిలో పడ్డారు. ఎమ్మెస్వోలమీద వత్తిడి తెచ్చి కనెక్టివిటీ పెంచమంటారు. లేని కనెక్టివిటీ ఎక్కడ తేవాలని మొత్తుకుంటూనే ఎమ్మెస్వో ఈ భారాన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్ మీద రుద్దుతాడు. ఫలితంగా ఆపరేటర్ నష్టపోతాడు. లేదంటే వినియోగదారుడిమీద నెలవారీ చందా భారాన్ని పెంచుతాడు. అలాంటి పే చానల్స్ చూడకపోయినా వినియోగదారుడు ఆ భారం భరించాల్సి వస్తుంది. అలా వసూలు చేయటం ఆపరేటర్ కు చాలా ఇబ్బందికరమైన పని. మరో వైపు అన్ని పే చానల్స్ కూ ఒకే విధమైన వ్యూయర్ షిప్ ఉండదు. అందువలన ఫలానా చానల్ కు ఇన్ని కనెక్షన్ల లెక్కన వసూలు చేసి ఇస్తున్నారు కాబట్టి మా చానల్ కూ అలాగే ఇవ్వాలంటూ పే చానల్ యజమానులు పట్టుబట్టటమూ సమంజసం కాదు. అందువలన క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో వ్యూయర్ షిప్ లెక్కించటానికి ట్రాయ్ ఒక ఫార్ములా రూపొందించాల్సిన ఆవసరముంది.

4. వినియోగదారుల బిల్లింగ్ డిజిటజేషన్ పూర్తయితే అంతా పారదర్శకంగా ఉంటుందని పదే పదే చెప్పారు. అందులో ప్రధానంగా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ ద్వారా కనెక్షన్ల సంఖ్య, వసూళ్ళు అన్నీ పారదర్శకంగా ఉంటాయని, పే చానల్ యజమానులకు కచ్చితమైన ఆదాయం వస్తుందని, ప్రభుత్వానికి పన్ను వసూళ్ళూ బాగా జరుగుతాయని ట్రాయ్ అదే పనిగా ఊదారగొడుతోంది. కానీ అసలు సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. క్షేత్ర స్థాయిలో ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్యన వ్యాపార సంబంధమైన అవగాహనకు అవసరమైన ప్రాతిపదిక లేకపోవటం వలన బిల్లింగ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందుకే మొదటి రెండు దశల్లో పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ అమలు కావటం లేదు. ట్రాయ్ ఈ సమస్యను పరిష్కరించకుండా ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లే తేల్చుకోవాలంటూ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆదాయ పంపిణీ విషయం ఇంకా తేలలేదు. పే చానల్స్ బొకే రూపంలోనూ, విడివిడిగానూ అందుబాటులో ఉండే విషయం ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళ ఎమ్మెస్వో ఏదైనా కారణం వల్ల అకస్మాత్తుగా పే చానల్స్ ప్రసారాలు ఉపసంహరించుకుంటే పరిస్థితి ఏంటి అనే విషయాలమీద స్పష్టత లేదు. అటు ఎమ్మెస్వోకి, ఇటు ఆపరేటర్ కి ప్రత్యేకమైన కార్యక్షేత్రాలున్నప్పుడే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడే ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కాగలుగుతారు. కానీ వాస్తవానికి చాలాచోట్ల ఎమ్మెస్వోలే తన ప్రాంతంలో ఆపరేటర్ గా కూడా ఉండటం వల్ల అది సాధ్యం కావటం లేదు. ఇలాంటి మౌలిక సమస్యలు పరిష్కరించేదాకా బిల్లింగ్ సమస్య కొనసాగుతూనే ఉంటుంది, దీనివలన డిజిటైజేషన్ ప్రయోజనం నెరవేరదు.

5. ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఆదాయపంపిణీ కేబుల్ ఆపరేటర్ కి అయ్యే కనీస నిర్వహణ ఖర్చును ట్రాయ్ పరిగణనలోకి తీసుకోకపోవటం వలన న్యాయబద్ధమైన అదాయపంపిణీకి ఒక విధానాన్ని రూపొందించటంలో విఫలమైంది. ఆపరేటర్ తన వ్యాపారాన్ని కొనసాగించటానికైనా ఇది కనీస అవసరం. అదే విధంగా చందారేట్ల విషయంలోనూ ఒక పద్ధతి అనుసరించతం ద్వారా ఆపరేటర్ కు రావాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా ఉంటుంది. నిజానికి ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యాపారనమూనాను రూపొందించటంలో ట్రాయ్ విజయం సాధించలేకపోయింది.

నిజానికి డిజిటైజేషన్ క్రమంలో పరిశ్రమను పునర్నిర్మిస్తున్న సమయంలో ట్రాయ్ దృష్టిపెట్టాల్సిన విషయమిది. ఎవరూ తమ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్న అనుమానాలకు గురికాకుండా హామీ ఇవ్వాల్సిన ట్రాయ్ ఆ దిశలో కృషి చేయలేదు. పరస్పరం ఆమోదయోగ్యంగా బేరసారాలు జరుపుకోమని చెప్పటం వలన ఆచరణలో అది ముందడుగు వేయటం లేదు. 1994 లో మొదటిసారిగా ఎమ్మెస్వోలు మార్కెట్లో ప్రవేశించినప్పటినుంచి ఈ తరహా చర్చల మార్గ విఫలవుతూనే ఉంది. ప్రస్తుత తరుణంలో కేబుల్ ఆపరేటర్ తన పెట్టుబడికి, శ్రమకు భద్రత లేదనే అభిప్రాయంలో ఉన్నాడు. చిన్న చిన్న కారణాలు చూపించి కూడా పోస్టాఫీస్ రిజిస్ట్రేషన్, ఎమ్ ఐ బి రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశాలుండటం కూడా అందుకు కారణం. కనీసం వచ్చే ఐదేళ్ళకాలానికైనా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితి కల్పించటం ట్రాయ్ బాధ్యత.

ఏ కేబుల్ ఆపరేటర్ అయినా, స్వతంత్ర ఎమ్మెస్వో అయినా సొంతగా డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటానికి ముందుకొస్తే ట్రాయ్ నుంచి, ఎమ్ ఐ బి నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉండాలి. రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పే చానల్స్ తో ఒప్పందాల విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి. మొదటి రెండు దశల్లో ఆపరేటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు. దీనివల్లనే ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోల సంఖ్యతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య నామమాత్రం. పరోక్షంగానైనా ట్రాయ్ దీన్ని కేవలం పెద్దపెద్ద ఎమ్మెస్వోలకు మాత్రమే వీలయ్యే ప్రక్రియగా చెప్పే ప్రయత్నం చేసింది.

6 కోర్టు కెక్కుతున్న ట్రాయ్ నిర్ణయాలు

ట్రాయ్ చేసిన ప్రతి నిబంధననూ కోర్టులో సవాలుచేయటం ఒక ఆనవాయితీగా మారింది. పైగా నిబంధనలు రూపొందించటమే తప్ప క్షేత్ర స్థాయిలో వాటి అమలును పర్యవేక్షించటానికి అవసరమైన యంత్రాంగం ట్రాయ్ కి లేదు. పైగా ఉల్లంఘించే సంస్థ పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అయినప్పుడు ఆ వ్యవహారాన్బ్ని కోర్టుకు తీసుకెళుతున్నారు. ఎలాగూ ఖరీదైన లాయర్లను నియోగించుకుంటారు కాబట్టి చట్టంలో లొసుగులు వాడుకుంటూ స్టే తెచ్చుకొని ఒకపక్క నిబంధనల ఉల్లంఘన కొనసాగిస్తూ మరోవైపు కేసును సుదీర్ఘంగా సాగదీస్తారు. ఒక మాజీ న్యాయమంత్రిని, ఒక మాజీ సమాచార, ప్రసారాల శాఖామంత్రిని లాయర్లుగా పెట్టుకొని ట్రాయ్ నిబంధనలను అడ్డుకునే ప్రయత్నం చేసిన కార్పొరేట్ సంస్థలనూ చూశాం. ఇదే అవకాశంగా తీసుకొని మార్కెట్లో గుత్తాధిపత్యాలను మరింతగా పెంచుకున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో గందరగోళవాతావరణం కొనసాగుతూనే ఉంది.

డిజిటైజేషన్ మన దేశానికి 2020 విజన్

[మార్చు]

డిజిటైజేషన్ అన్ని శాఖలల్లో భారతదేశానికి 2020 విజన్ గడువు. అన్ని శాఖలల్లో లేని తొందర కేవలం ఒక “‘కేబుల్ టీవీ నెట్ వర్కులపైన“‘ ఎందుకో ...

ఉదాహరణకు స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రభుత్వం ఇప్పటికి 70 ఏళ్ళు, డిసెంబరు 2016 లో నివేదిక ప్రకారం 6,522 గ్రామాలు విద్యుత్ లేనివి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. డాక్టర్లు లేని గ్రామాలు కోకొల్లలు.

ఎంఎస్‌వోలు అతి ఉత్సాహంతో

[మార్చు]

ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రకటన లేదు ఇదే అదనుగా లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లును మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు) అతి ఉత్సాహంతో సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి చిన్న కేబుల్‌ ఆపరేటర్లును చాలా ఇబ్బంది పెడుచున్నారు.

గడువును పెంచాలని ఆపరేటర్లు

[మార్చు]

సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ బాక్స్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ధరలను గణనీయంగా తగ్గించడం, వాటిని విక్రయించేందుకు మరిన్ని కంపెనీలకు అనుమతించడమే సమస్యకు పరిష్కారం ఇప్పుడు బాక్స్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, బాక్స్‌ల కొరత కూడా ఏర్పడుతోంది.అందుకే సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

కార్పోరేట్ సంస్థల ఆశ

[మార్చు]

కేబుల్ టీవీ నెట్ వర్కులపైన పెట్టుబడి ఎవరికి వారుగా కేబుల్ ఆపరేటర్ వారి ఏరియాల్లో పెట్టారు వీరికి ప్రభుత్వం నుండి కూడా రక్షణ లేదు. ఇండియాలో సుమారు 1 కోటి కుటుంబాలు దీనిపై బ్రతుకు చున్నారు. ఇంత మంది వెళ్లు ఆదాయాన్ని ఏదో ఒక కొత్త టెక్నాలాజీ కనిపెట్టీ ఆ ఆదాయాని తమకే రావాలని కార్పోరేటు సంస్ధలు కోట్లూ ఖర్చూపెడుతున్నవి.

గడువును పెంచకపోవడానికి కారణం

[మార్చు]

సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏళ్లతరబడి పట్టణ ప్రాంతం మందకొడిగా సాగి చిన్నపంచాయతీలకు కేవలం ఒక నెల రోజులు మాత్రమేఇచ్చి గడువును పెంచకపోవడానికి కారణం కార్పోరేట్ సంస్థల హస్తం ఉందని అర్ధం అవుతోంది. డిటిహెచ్ సంస్ధలకు లాభాలు సమకూర్చడానికీ కేబుల్ ఆపరేటర్ల జీవితాలతో ఆడుకునేవిదమైన తల తోక లేని ట్రాయ్ నిర్ణయం అని గడువు పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.అదనపు భారం పడుతుందని అటు ఎమ్మెస్వోలు, ఇటు వినియోగదారులు భయపడుతుంటే ఆదాయం తగ్గుతుందేమోనన్నది కేబుల్ ఆపరేటర్ల భయం. కానీ ప్రభుత్వం మాత్రం ప్రసారాల నాణ్యత పెరుగుతుందని వినియోగదారులకు, లాభాల్లో వాటా పెరుగుతుందని ఆపరేటర్లకు, పే చానల్స్ చందా రాబడి పెరుగుతుందని చానల్ యాజమాన్యాలకూ నచ్చజెబుతోంది. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎమ్మెస్వోలు ఆందోళన చెందుతుంటే కార్పొరేట్ ఎమ్మెస్వోలు దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రంగంలో దిగారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా నేనున్నానంటూ హిట్స్ వ్యవస్థ ముందుకొచ్చింది. మొదటి రెండు దశల డిజిటైజేషన్ అమలులో ఎదురైన అనుభవాలను పాఠాలుగా మార్చుకొని మిగిలిన రెండు దశలూ సమర్థంగా పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా, ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆగాథం పెంచేలా అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తిచేయటంలో ఇప్పటికీ ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది.

చానల్స్ కి ప్రయోజనాలు

[మార్చు]

• పే చానల్స్ కి కచ్చితమైన చందాదారుల సంఖ్య తెలియటం వలన ఆదాయం నష్టపోయే అవకాశం లేదు. ఆపరేటర్లు/ఎమ్ ఎస్ వోలు తగ్గించి చెబుతున్నారనే అనుమానాలకు తావుండదు • ఇప్పటికంటే ఆదాయం కనీసం యాభై శాతం పెరుగుతుందని నమ్మకం • ఆదాయం పెరగటం వలన కార్యక్రమాల నాణ్యత పెరిగే అవకాశముంది. ప్రకటనలమీద ఆధారపడటం తగ్గుతుంది. • మరిన్ని చానల్స్ పే చానల్స్ గా మారే అవకాశం • డిజిటైజేషన్ తరువాత ఎక్కువ చానల్స్ ప్రసారం చేయటానికి అవకాశం ఉండటం వలన క్యారేజ్ ఫీజు తగ్గటానికి అవకాశముంటుంది, ముఖ్యంగా ఉచిత చానల్స్ బాగా లాభపడతాయి. ప్రభుత్వానికి ప్రయోజనాలు • ఇప్పటిదాకా కేబుల్ రంగానికి సంబంధించిన సమాచారం కేవలం అంచనాలే తప్ప సరైన అంకెలు లేవు. ఇప్పుడు అన్నీ కచ్చితంగా తెలుస్తాయి. తగిన నిర్ణయాలు తీసుకోవటం సాధ్యమవుతుంది. • ఇప్పటిదాకా కనెక్షన్ల సంఖ్య తక్కువగా లెక్కించటం వలన తక్కువగా వస్తున్న ఆదాయం ఇకమీదట గణనీయంగా పెరుగుతుందని అంచనా

డిజిటైజేషన్ తో క్యారేజ్ ఫీజు తగ్గుతుందా

[మార్చు]

డిజిటైజేషన్ పూర్తయ్యాక క్యారేజ్ ఫీజు తగ్గుతుందనేది కొన్ని చానల్స్ వాదన. ఎక్కువ చానల్స్ ఇవ్వటానికి అవకాశముంటుంది కాబట్టి ఎమ్మెస్వోలు అనివార్యంగా అన్ని చానల్స్ ఇస్తారనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఆదాయం తగ్గిపోతుందని ఎమ్మెస్వోలు ఎంతమాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. డిజిటైజేషన్ లక్ష్యాలలో ఒకటిగా కారేజ్ ఫీజు తగ్గటం గురించి ప్రస్తావించినప్పటికీ ఆచరణలో పూర్తిగా అలా జరిగే అవకాశం లేదు.

గతంలో అనలాగ్ వ్యవస్థలో Must Carry Rules పేరుతో తప్పకుండా ప్రసారం చేయాల్సిన చానల్స్ లో దూరదర్శన్ చానల్స్ ను పేర్కొన్న సంగతి తెలిసిందే. డిజిటైజేషన్ తరువాత ప్రాంతీయ చానల్స్ ప్రసారం చేయాలని చెబుతునప్పటికీ కారేజ్ ఫీజు విషయంలో వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చుననేది కనెక్షన్ల సంఖ్యను బట్టి నిర్థారించాలని ట్రాయ్ భావిస్తున్నప్పటికీ ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. ఒక కనెక్షన్ కు ఏడాదికి ఒక రూపాయి చొప్పున తీసుకోవటం సమంజసంగా భావిస్తున్నట్టు ట్రాయ్ తన అభిప్రాయం చెప్పింది. నిజానికి ఇది ట్రాయ్ అభిప్రాయం అనటం కంటే ఉచిత చానల్స్ యాజమాన్యాలు ట్రాయ్ కి చేసిన విజ్ఞప్తి అనే చెప్పాలి. ఎమ్మెస్వోల సంఘాలు మాత్రం కనీసం కనెక్షన్ కు ఆరు రూపాయలుండాలని కోరాయి. డిజిటైజేషన్ పూర్తయ్యేలోగీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.

ఒకవేళ ఎమ్మెస్వోలకు కారేజ్ ఫీజు ఆదాయం తగ్గినా, ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రాయ్ ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. ఇది పూర్తిగా సప్లై – డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చానల్ ను ఫలానా క్రమంలో పెట్టాలని ఆ చానల్ యజమాని కోరుకున్న పక్షంలో దానికి గాను కొంత మొత్తం చెల్లించాలని ఎమ్మెస్వో కోరవచ్చు. అదే ప్లేస్ మెంట్ ఫీజు. రెండు బాగా పేరుమోసిన చానల్స్ మధ్య పెట్టటం ద్వారా ప్రేక్షకులు ఆ చానల్స్ మార్చుతున్నప్పుడు ఇది వాళ్ళ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేస్ మెంట్ కోసం పోటీపడి చెల్లించే చానల్స్ ఉంటాయి. దీన్ని ఎమ్మెస్వోలు అదనపు ఆదాయ వనరుగా మార్చుకుంటారు.

మొత్తం మీద డిజిటైజేషన్ లో Must Carry Rules కింద స్థానిక చానల్స్ అన్నీ ప్రసారం చేయాల్సి వచ్చినా ఉచిత చానల్స్ ప్రసారానికి సైతం ఖర్చవుతుందికాబట్టి కారేజ్ ఫీజును నియంత్రించటం సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ కారేజ్ ఫీజు ఒప్పందాలను కూడా ట్రాయ్ కి సమర్పించాలనే నిబంధన ఉంది. ఇతర చానల్స్ తో పోటీ పడే క్రమంలో ఏ చానల్ కూడా క్యారేజ్ ఫీజు చెల్లింపును వ్యాపార వ్యూహంలో భాగంగా పరిగణిస్తుందే తప్ప భారంగా భావించదు. అందువలన క్యారేజ్ ఫీజు తగ్గుతుందన్న వాదనలో పసలేదు. పైగా, రేటింగ్స్ విధానంలో మార్పు వలన రేటింగ్స్ మీటర్ల సంఖ్య పెరగటంతోబాటే విస్తృతి కూడా పెరుగుతుంది. అందువలన మీటర్లున్న పట్టణాలకే క్యారేజ్ ఫీజు చెల్లించటం ద్వారా రేటింగ్స్ పెంచుకోవాలనే ఆలోచించేవాళ్ళ ధోరణికీ అడ్డుకట్ట పడుతుంది. ఇది కూడా ఎమ్మెస్వోలకు అనుకూలించే అంశమే.

ఎన్నో తప్పటడుగులు

[మార్చు]

ఇప్పటివరకు డిజిటైజేషన్ విఫలమైందనే చెప్పాలి. ఇప్పటికే పూర్తయిందంటున్న మొదటి రెండు దశల కిందికి వచ్చిన 42 నగరాలలో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలూ కనబడటం లేదు. మొదలు పెట్టి మూడేళ్ళయినా ఏ చానల్ నిర్వాహకుడూ ఇప్పటి వరకూ వినియోగదారులను కూడా కూర్చోబెట్టి డిజిటైజేషన్ మీద చర్చ జరపలేదు. వ్యతిరేకత వెల్లువెత్తుతుందన్న భయంతోనే ఇలాంటి చర్చ జరపటానికి వెనుకాడుతున్నారు. నిజానికి యుపిఏ ప్రభుత్వం సైతం పత్రికలలో డిజిటైజేషన్ కు వ్యతిరేకమైన వార్తలు రాకుండా చాలా జాగ్రత్త పడిన విషయం రహస్యమేమీ కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అది సాఫీగా ముందుకు సాగటం కోసం మీడియాను నియంత్రించింది. ఎలా నియంత్రించాలన్నది సమాచార శాఖకు ఎవరూ కొత్తగా నేర్పాల్సిన పనేమీ లేదు.

20 కోట్ల కేబుల్ కనెక్షన్లున్న దేశంలో దాదాపు 70 శాతం మంది పేద, నిరుపేద ప్రజలున్న చోట కేవలం రెండేళ్ళలో డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. పైగా ప్రజలమీద పెనుభారం మోపుతూ కార్పొరేట్ ఎమ్మెస్వోలకు, పే చానల్ యజమానులకూ లాభం చేకూర్చటానికి, పనిలో పనిగా పన్నుల ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్య ఇది. నిజంగా నాణ్యమైన ప్రసారాలు ప్రజలు కోరుకుంటున్నారనుకుంటే ఆ ప్రజలు తప్పనిసరిగా ధనవంతులే అయి ఉంటారు. అలాంటప్పుడు ఏకకాలంలో డిజిటల్, అనలాగ్ ప్రసారాలు ఇచ్చి ఉంటే ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమ వెసులుబాటును బట్టి డిజిటల్ ప్రసారాలు అందుకోవటానికి మొగ్గు చూపేవారు. కొంత ఎక్కువ సమయం పట్టినా ఈ మార్పు స్వచ్ఛందంగా జరిగేది. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా హడావిడి డెడ్ లైన్లు పెట్టి మళ్ళీ పొడిగిస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది.

డిజిటైజేషన్ గడువు ప్రకటించేటప్పుడు ప్రభుత్వం కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు అవసరమవుతాయి. కానీ భారతదేశంలో వాటిని తయారుచేయటం అప్పటికింకా మొదలుకాలేదు. అంటే, అనివార్యంగా విదేశాలమీద ఆధారపడాలి. నిర్దిష్టమైన గడువుతేదీలాగా అవసరానికి తగినన్ని సెట్ టాప్ బాక్సులు తెప్పించుకోవటం సాధ్యం కాదని అప్పటికే తేలిపోయింది. దిగుమతి చేసుకున్నా, వాటి నాణ్యతాప్రమాణాలు తనిఖీ చేసే వ్యవస్థ ఏదీ లేదు. కనీసం వాటి మరమ్మతుల సంగతి కూడా పట్టించుకోలేదు.

మొత్తంగా చూస్తే, ఇప్పటివరకూ పూర్తయిందంటున్న మొదటి రెండు దశల డిజిటైజేషన్ వల్ల ఒరిగిందేమైనా ఉందా అంటే మొదటిది వినియోగదారులమీద భారం పెరగటం, రెండోది మరిన్ని గుత్తాధిపత్యాలు ఏర్పడటం. నిజానికి డిజిటైజేషన్ కు ముందే కార్పొరేట్ ఎమ్మెస్వోల గుత్తాధిపత్యాలు పెరిగిపోవటం పట్ల స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా గుత్తాధిపత్యాలు వేగం పుంజుకొని విస్తరించాయి. ఇలాంటి గుత్తాధిపత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రాయ్ సిఫార్సు చేసినా ఆ సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇంకా ఆమోదించలేదు. ప్రభుత్వం ఇప్పటికీ మేలుకోలేదు.

దశల డిజిటైజేషన్ పూర్తయిందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది కాబట్టి నిజమనే నమ్ముదాం. ఇక మూడు, నాలుగు దశల గడువును 2015 డిసెంబరు, 2016 డిసెంబరు వరకూ పొడిగించారు. ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణమేంటంటే స్వదేశీ సెట్ టాప్ బాక్సులను ప్రోత్సహించాలంటే మరికొంత సమయం అవసరమని. చిత్రమేమిటంటే ఇప్పటివరకూ అటు ట్రాయ్ గాని ఇటు మంత్రిత్వశాఖ గాని నిస్సహాయులైన వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న పాపాన పోలేదు. కనీసం మొదటి రెండు దశల్లో వినియీగదారుల అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా మూడు, నాలుగు దశల్లో సరిదిద్దు కోవటానికి ప్రయత్నించకపోవటం మరీ దారుణం. ప్రజలకోసం కాకపోయినా కనీసం ఆత్మవిమర్శచేసుకునే ప్రయత్నమూ జరగలేదు.

వినియోగదారులకు అసలు ఉచిత చానల్స్ అంటే ఏమిటో, పే చానల్స్ అంటే ఏమిటో, బొకే పద్ధతి అంటే ఏమిటో, అ లా కార్టే విధానమేమిటో తెలియదు. విసుగుపుట్టించే ప్రకటనలు, నాణ్యత కరవైన ప్రసారాలు, నాసిరకం సెట్ టాప్ బాక్సులు, మరమ్మతులకు దిక్కులేని సెట్ టాప్ బాక్సులు, ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్ కు సెట్ టాప్ బాక్స్ మార్చుకోలేని నిస్సహాయత, బహిరంగ మార్కెట్ లో సెట్ టాప్ బాక్సులు దొరక్కపోవటం లాంటి సమస్యలు సతమతం చేస్తున్నాయి. చట్టవ్యతిరేకమని ట్రాయ్ చెప్పినా సరే, యాక్టివేషన్ ఫీజు వసూలు చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అసలు డిటిహెచ్ సమయంలోనే ఆపరేటర్ నుంచి మారే సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉండగా కొత్తగా డిజిటైజేషన్ మొదలుపెడుతున్నప్పుడు ఆ సౌకర్యం కల్పించకపోవటం ట్రాయ్ కీ, మంత్రిత్వశాఖకూ ప్రేక్షకుల మీద ఉన్న అత్యంత చులకన భావనకు నిదర్శనం.

చందాదారులకు కేబుల్ టీవీ సర్వీసుల అందుబాటు, వాళ్ళు భరించగలిగే శక్తి తదితర అంశాలను అంచనా వేయటంలో ట్రాయ్ విఫలమైంది. పైగా, కొత్త డిజిటైజేషన్ వ్యవస్థ గురించి, పే చానల్స్ గురించి, అ లా కార్టే విధానం గురించి ప్రేక్షకులకు తెలియజెప్పటంలో కూడా దారుణంగా విఫలమైంది. కేవలం కొన్ని పే చానల్స్ లో ఒకటీ అరా ప్రకటనలు ప్రసారం చేయగానే మొత్తం డిజిటైజేషన్ గురించి ప్రేక్షకులకు అర్థమైందని అనుకోవటం దురదృష్టకరం. పైగా ఈ ప్రకటనలు కూడా హెచ్చరిక ధోరణిలో సాగుతాయి. సెట్ టాప్ బాక్స్ తీసుకోకపోతే ప్రసారాలు ఆగిపోతాయంటూ హిందీ సీరియల్స్ నటీమణుల చేత బెదిరించే భాషలో చెప్పటం తప్ప ఈ ప్రక్రియను వివరించే ప్రయత్నం జరగటం లేదు. ఇంత సువిశాల దేశంలో ప్రజలకు అర్థమయ్యేభాషలో సమాచారం అందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడే కొత్త విధానాన్ని ప్రజలు అర్థం చేసుకొని అమలు చేయటానికి ముందుకొస్తారు.

మొత్తంగా చూస్తే డిజిటైజేషన్ అమలులో ఎన్నో తప్పటడుగులు, తప్పుటడుగులూ కనిపిస్తాయి.

డిజిటైజేషన్ అమలును సమీక్షించి అనేక నిర్ణయాలు

బాగా ఉన్నట్లు కనిపించినా

వినియోగదారులకు ప్రసారాలు ప్రయోజనాలు ఉన్నట్లుగా కనిపించిన లోపలికి వెళ్ళిన తరువాత అంత పెద్ద మొత్తంలో కేబుల్‌ చందాదారును కేబుల్‌ టీవీ డిజిటైజేషన్‌ వలన చందాదారుకు ఎంతో మేలు జరు గుతుందంటూ కేబుల్‌ టీవీ నియం త్రణ చట్టాన్ని సవరించే సంద ర్భంలో కేంద్ర ప్రభుత్వం  నమ్మబలి కింది. పారదర్శకత, ప్రసారాల నాణ్యత, కోరుకున్న చానల్స్‌కే చెల్లించే అవకాశం లాంటి మాయ మాటలు చెప్పింది. కానీ సామాన్య ప్రేక్షకులను బుట్టలో వేయటానికే ఈ అబద్ధాలు చెప్పిందన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న  నిజం.  సగటున 15 నుంచి 20 చానల్స్‌ మాత్రమే చూసే ప్రేక్షకులకు వంద చానల్స్‌  అందుతున్న సమయంలో ఈ సంఖ్యను 500కు తీసుకుపోతా మంటూ చెప్పింది. అలా చానల్స్‌ పెరిగే కొద్దీ బిల్లు తడిసి మోపెడవుతుందని మాత్రం చెప్పలేదు. 

అనలాగ్‌ ప్రసారాల వలన కేబుల్‌ టీవీలు వంద చానల్స్‌ మించి ఇవ్వలేకపోతున్నాయని, అందువలన చందాదారు ఎంచుకునే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ప్రభుత్వానికి డిజిటైజేషన్‌ మీద చేసిన సిఫార్సులలో ట్రాయ్‌ చెప్పింది. డిజి టైజేషన్‌లో 500 చానల్స్‌ సైతం ఇవ్వగలిగే వీలుంటుందని చెప్పినా పంపిణీ సంస్థలకు మాత్రం 500 చానల్స్‌ ఇవ్వాలనే నిబంధన పెట్టలేదు. ఉచిత చానల్స్‌ ఎంచుకునే స్వేచ్ఛ చందాదారుడిదే అనేది మరో మోసం. స్వేచ్ఛ అంటున్నప్పుడు కనీసం 200 ఇవ్వ కుండా 100 ఎంచుకోమంటే దాన్ని స్వేచ్ఛ అనాలా? అలా 200 చానల్స్‌ ఎంతమంది ఎమ్‌ఎస్‌ఓలు ఇవ్వగలుగుతు న్నారు? పైగా ఆ 100 లోనే 26 దూరదర్శన్‌ చానల్స్‌ కచ్చి తంగా తీసుకోవాలి. మిగిలిన 74 చానల్స్‌ లో ఉచిత చానల్స్‌ తోబాటు మనం ఎంచుకునే పే చానల్స్‌ కూడా కలిసే ఉంటాయి. కాకపోతే పే చానల్స్‌కు అదనంగా చందా కడతాం.  

అంటే, ఈ 74 లో మనం కనీసం నాలుగు తెలుగు బొకేలు ఎంచుకున్నా 33 అయిపోతాయి. మిగిలేది 41. తెలు గులో ఉచిత చానల్స్‌ సంఖ్య దాదాపు 45.  ఆ విధంగా చూస్తే మనం కోరుకునే చానల్స్‌ సంఖ్య 100 దాటిపోతుంది. అది దాటాక ప్రతి 25 చానల్స్‌ కు రూ.20 వసూలు చేస్తారు. ఇదీ ట్రాయ్‌ చెప్పే రూ. 130 – వంద చానల్స్‌ వెనుక అసలు కథ.  పైగా ఇప్పుడున్న రూ.130  మరో ఆరు నెలల తరువాత పెంచుకోవటానికి పంపిణీ సంస్థలకు ట్రాయ్‌ అవకాశ మిచ్చింది. 

డిజిటైజేషన్‌ అనేది  సెట్‌ టాప్‌ బాక్స్‌ తోనే సాధ్యం. ఇది టీవీ యజమాని సమకూర్చుకోవాలని ప్రచారం చేశారు. కానీ, ఆ సెట్‌ టాప్‌ బాక్స్‌ ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కో వాల్సిన అవసరం లేదని, అద్దెకు కూడా తీసుకోవచ్చునని, వాయిదాల పద్ధతిలో ఇమ్మని కూడా మీ ఎమ్మెస్వో/ ఆపరేటర్‌ను అడగవచ్చునని ఆ ప్రచారంలో ఎక్కడా చెప్ప లేదు. చందాదారుల ప్రయోజనం ముఖ్యమైతే ఈ వెసులు బాటు గురించి కదా ప్రచారం చేయించాల్సింది? 

ఎవరైనా ఆ ఎమ్‌ఎస్‌ఓ సేవలు నచ్చక ఇంకొకరి పరి ధిలోకి వెళ్ళాలంటే ఆ బాక్స్‌ పనికి రాదు. ఇంటర్‌ ఆపరేటర్ బిలిటీ లక్షణం వాటికి లేదు. అంటే, చందాదారుడు కొను క్కున్న బాక్స్‌ మీద పరోక్షంగా యాజమాన్యం మాత్రం ఎమ్‌ ఎస్‌ఓదే. అతడి పరిధిలో మాత్రమే అది పనికొస్తుంది. ఎవ రైనా మరో ఊరికి మారితే మళ్ళీ అక్కడ సెట్‌ టాప్‌ బాక్స్‌ కొనుక్కోవాల్సిందే. అప్పట్లో స్వదేశీ సెట్‌ టాప్‌ బాక్సులు తగినన్ని లేక దిగుమతి చేసుకోవటం వలన ఈ ఫీచర్‌ లేక పోయినా తీసు కోవాల్సి వచ్చిందనేది ట్రాయ్‌ వివరణ. హడా వుడిగా డిజిటైజేషన్‌ అమలు చేసిన ఫలితమిది.

డిజిటైజేషన్‌ వలన కేబుల్‌ బిల్లు తగ్గుతుందని ట్రాయ్‌ చెప్పటం అతిపెద్ద అబద్ధం. ఇప్పటికీ అదే అబద్ధం చెబు తోంది తప్ప వివరణ ఇవ్వటం లేదు. తగ్గటం, పెరగటం అనేది ఇప్పటి బిల్లుతోనే జనం పోల్చుకుంటారు. 200 చానల్స్‌ ఇచ్చే ఆపరేటర్‌ ప్రస్తుతం రూ. 200 వసూలు చేస్తున్నాడనుకుంటే ఇప్పుడు అవే చానల్స్‌కు బిల్లు లెక్కగడితే రూ.750కి తగ్గటం లేదు. ట్రాయ్‌ ఇప్పుడు చెబుతున్నదేం టంటే, ఆపరేటర్‌ ఇచ్చే చానల్స్‌ కాకుండా నిజంగా మీరు చూడాలనుకునే చానల్స్‌ కే లెక్కగట్టండి అంటోంది. అలా చూసినా రూ. 400 కి తగ్గేట్టు లేదు.

టారిఫ్‌ ఆర్డర్‌ 36 వ పేజీ 52వ పాయింట్‌ ఇలా ఉంది: ‘‘ట్రాయ్‌ అందరి అభిప్రాయాలూ లెక్కలోకి తీసుకున్న మీదట చానల్స్‌కు పూర్తి స్వేచ్ఛ, వ్యాపారంలో వెసులుబాటు ఇవ్వటం ద్వారా అవి సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించింది. అందుకే పే చానల్స్‌ కు వాటి కంటెంట్‌ తరహా ఆధారంగా ధర పరిమితి విధించకూడదని నిర్ణయించింది. అయితే తన పే చానల్స్‌ ధర నిర్ణయించేటప్పుడు  బ్రాడ్‌ కాస్టర్‌ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్ష చూపకుండా, చందాదారుల ప్రయోజనాలు కాపాడతాడని ఆశిస్తున్నాం. అర్థవంతంగా ధర నిర్ణయించటం ద్వారా అధికాదాయం సంపాదించుకుంటాడని కూడా అంచనావేస్తున్నాం ’’. ఇది ట్రాయ్‌ చేసిన పెద్ద తప్పుడు అంచనా. బ్రాడ్‌కాస్టర్‌కు అవ కాశమిచ్చిన తరువాత తక్కువధర నిర్ణయించవచ్చునని ఆశించటమేంటి?.

ప్రేక్షకులు ఆసక్తి చూపని చానల్స్‌ను కూడా అంటగట్టే  బొకేల విధానాన్ని అదుపులో ఉంచటానికి ఒక నిబంధన పెట్టింది. బొకేలోని చానల్స్‌ విడివిడి ధరల మొత్తంలో డిస్కౌంట్‌ 15% మించకుండా బొకే ధర నిర్ణయించాలని చెప్పింది. ఇది కచ్చితంగా ధరలను అదుపు చేయటానికి వీలుండే అంశమే. అయితే మద్రాసు హైకోర్టు ఈ నిబం ధనను కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న కనీస జ్ఞానం ట్రాయ్‌కి లేకపోయింది. నెలలతరబడి ఆలస్యంగా  మేలుకొని వెళితే, మీరు ఇన్నాళ్ళూ నిద్రపోయారా అని సుప్రీంకోర్టు అడగ్గానే  పిటిషన్‌ వెనక్కు తీసుకుని ‘‘బ్రాడ్‌ కాస్టర్లు తగ్గిస్తే తగ్గవచ్చునేమో వేచి చూద్దాం’’ అని చెప్పటం ఎంత సిగ్గు చేటు? 

డిజిటైజేషన్‌ గురించి స్పష్టత ఇవ్వకుండా, సెట్‌ టాప్‌ బాక్స్‌ కొనకపోతే ప్రసారాలు ఆగిపోతాయని భయపెట్టటాన్నే అవగాహనగా చెప్పుకుంది. ఇప్పుడు కూడా ‘‘మేం అవకాశ మిచ్చినట్టుగా చానల్స్‌ నిర్ణయించుకున్న ధరలకు మీరు ఆమోదముద్ర వెయ్యకపోతే ఫిబ్రవరి 1 తరువాత మీకు టీవీ ప్రసారాలు ఆగిపోతాయి’’ అనే ప్రచారం మొదలైంది. 

నియంత్రణా సంస్థ అయిన ట్రాయ్‌కి చాలా విషయాల్లో నియంత్రణ లేదు. కేబుల్‌ నెట్‌వర్క్స్‌ను ఎమ్‌ఎస్‌ఓలు అమ్ము కుంటున్నప్పుడు వాటి పరిధిలో ఉన్న ఆపరేటర్లు, చందా దారుల ప్రయోజనాల సంగతేంటని పట్టించుకోదు. ఈ మధ్య కాలంలో రిలయెన్స్‌ జియో లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కార్పొరేట్‌ ఎమ్‌ఎస్‌ఓలను సైతం కొంటూ ఉంటే ఎలాంటి సమాచారమూ లేకుండానే స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు, చందా దారులు గొర్రెల్లా కొత్త యజమాని అధీనంలోకి వెళ్ళిపోతు న్నారు. ఇది కచ్చితంగా గుత్తాధిపత్యానికి దారి తీసి చందా దారుల మీద పెనుభారం మోపే ప్రమాదం ఉంది. అయినా ట్రాయ్‌ జోక్యం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. చందా దారుల ప్రయోజనాలు గాని, కేబుల్‌ ఆపరేటర్ల ప్రయోజ నాలుగాని కాపాడలేని నియంత్రణా సంస్థ ఎవరికి మేలు చేస్తు న్నదో ఆత్మ విమర్శ చేసుకోవాలి.

1 ఫిబ్రవరి 2019 నుండి టారిఫ్ ఆడర్ అమలు

[మార్చు]

'టారిఫ్ ఆడర్' :- భారతదేశం యొక్క టెలికమ్యూనికేషన్స్ TRAI ఫిబ్రవరి 1, 2019 నుండి ట్రాయ్ ప్రభావంతో TV వీక్షకులకు కొత్త యుగంలో ప్రవేశించింది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నియంత్రణ ప్రణాళిక ప్రకటించింది బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, టారిఫ్ ఆడర్ అమలవుతున్నది. ఇండియాలో మొదటి నాలుగు న్యూఢిల్లీ, ముంబాయీ, కోల్ క్తత,చెన్నైయ్ మెట్రోనగరాల్లో రెండో దశ నగరాల్లో రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు , గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ , డైరక్టటూ టూ హోం లోను ఇతర ప్రసారా మాద్యమాలకు చందాదారునికి నిబంధనలు, షరతులు, చందా వివరాలు ఒకేవిదమైన దరల నియంత్రణ కోసం వినియోగదారులకు ప్రసారాలు అందించటం కోసం * ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అధారిటీ అఫ్ ఇండియా *చానల్ యజమానుల అన్ని సంఘలు * ఎమ్ ఎస్ వో సర్వీస్ ప్రొవైడర్లు అన్ని సంఘలు * డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు అన్ని సంఘలు * వినియోగదారుల అన్ని సంఘలు సమావేశమై సెప్టెంబర్ 2, 2018 నుండి ఒక ప్రాంతంలో అన్ని ప్రసారా మాద్యమాలకు ఒకే దరను ఉండాలని నిర్ణయించారు. కేబుల్ టీవీలో ఉదా : గుజరాత్ లో ఒక ప్రాంతంలో రు. 600 చందా ఉంటే మారుమూల గ్రామంల్లో రు. 50 చందా గా ఉంది. అలాగే డైరక్టటూ టూ హోం [డిటిహెచ్] ల్లో కూడ ఒకే విదమైన రేట్లు లేవు.

'కాస్ సిస్టం' వినియోగదారులకు 100 ఫ్రీ [ఉచిత] చానళ్లు ఇవ్వాలి, అలాగే పే [చెల్లింపు] చానళ్లు ఏది కావాలో నిర్ణయించుకునే స్వేచా విదానం.గంపగుత్తగా అంటగట్టే బోకే విదానం విడనాడి కంప్యూటర్ రషీదు బిల్లింగ్ చెల్లింపు విదానం. దేనిపైన విదివిదానాలు రూపొందిస్తూన్నారు . కానీ అతీ ఉత్సాహంగా దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, పేదలను నిరక్షరాసులకు గుర్తించి వారికి కొంత అవగాహనా కలిగించే విషయమే పట్టించు కాకుండా ట్రాయ్ కాస్ సిస్టమ్ అమలు చేయాలని 29 డిసెంబర్ 2018 గబుక్కున గడువు నిర్ణయం తీసుకున్నారు ఇంకాస్త అడుగు ముందుకు వేసి ఎవరో అడిగిన విదంగ ప్రతి ఒక్క ఛానల్ దర 19 రూపాయల వరకూ మాత్రమే తీసుకోవాలి అని కుహూం జారవిడిచారూ.దాంతో ప్రతి ఛానల్ గతంలో రెండు రూపాయల నుండి పన్నెండు రూపాయల చొప్పున నెలకు వినియోగదారుల నుండి వసూళ్లు కేబుల్ ఆపరేటర్ల ద్వారా చేస్తున్న ఛానల్ యాజమాన్యాలు ట్రాయ్ ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రకటన చేయగానే టారిఫ్ ఆర్డర్ అమలు చేస్తున్న 2019 నుండి(ఎక్కువ సంఖ్యలో ఎంటర్ టైమేంట్ అన్ని ప్రాంతీయ భాషల్లోనీ ప్రతి ఛానల్ దర 19 రూపాయలు అని ప్రకటించారూ) నూటయాభై నుంచి నాలుగువందల శాతానికి పైగా పెరిగినధరల పట్టికలను చానళ్ల వారి వెబ్ సైట్ లలో చానళ్లు ప్రసారాల మాద్యమాల ద్వారా ప్రకటనలు చేస్తూనారూ.ఉ. తెలుగులో ముఖ్యంగా మాటీవి, ఈటీవి , జెమినీ టీవీ, జీ తెలుగు లాంటివి. ఇప్పటి వరకు కేబుల్ టీవీ ఆపరేటర్లు వంద రూపాయలకు నెలకు అన్ని భాషల్లో మూడు వందల చానళ్లు ఇస్తున్నారు. ఇదే టారిఫ్ ఆర్డర్ తర్వాత ఇదే చానల్స్ కు చిన్న చిన్న గ్రామాల్లో సైతం మూడు వందల రూపాయలు నుండి నాలుగు వందల రూపాయలు ప్రతి ఒక్క వినియోగదారుల దగ్గర వసూలు చేయాల్సి ఉంటుంది అది సాధ్యమని ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ప్రజల నెత్తిన రుద్దితే మద్యలో కేబుల్ ఆపరేటర్లు నలిగిపోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ..ఇప్పుడు టారిఫ్ ఆర్డర్ కు మన దేశంలో అనుకూలంగా పరిస్థితి ఉందని టారిఫ్ ఆర్డర్ అమలు చేస్తామని అంటున్నా ట్రాయ్ నిబంధనలు ఇక నుంచి వీక్షకుడు కోరుకున్న చానెళ్లకు మాత్రమే డబ్బులు వసూలు చేసేలా డీటీహెచ్‌ , కేబుల్‌‌ టీవీ ఆపరేటర్ల కోసం ట్రాయ్‌‌ కొత్త రూల్స్‌‌ తెచ్చింది . ఇవి ఫిబ్రవరి ఒకటి నుంచి అమలవుతాయి. అయితే వీటి వల్ల కేబుల్‌‌ బిల్లు పెరుగుతుందనీ, గతంలో కంటే రూ.100–రూ.200 వరకు పెరిగాయి. నిజానికి నూతన విధానం వల్ల కేబుల్‌‌ బిల్లును తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక మీదట మనకు నచ్చిన చానెల్స్‌‌కు మాత్రమే డబ్బు చెల్లిస్తే చాలు. ఇష్టమున్న చానెల్స్‌‌ను ఎంచుకునేందుకు జనవరి 2019 నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి నుంచి 100 నాన్‌ హెచ్‌డీ చానెళ్ల బేస్‌ ప్యాక్‌‌కు రూ.130 మాత్రమే ఆపరేటర్లు వసూలు చేయాలి. దీనికి జీఎస్టీ అదనం. ఇవిగాక ఇంకా చానెల్స్ కావాలనుకుంటే మాత్రమే ఎక్కువ డబ్బు కట్టాలి. ట్రాయ్‌‌ ఆదేశాల మేరకు సోనీ, జీ, స్టార్‌, డిస్కవరీ, సన్‌, టర్నర్‌, వయాకామ్‌ తమ ఫ్రీ చానెళ్లు, పే చానెళ్ల వివరాలను ప్రకటించాయి.

జాగ్రత్తగా ఎంచుకుంటే చాలా మేలు

వీక్షకుడు జాగ్రత్తగా చానెల్స్‌ ను ఎంచుకుంటే గతం కంటే తక్కువ బిల్లుతోనే ఎక్కువ చానెల్స్‌ ను చూడొచ్చని ట్రాయ్‌ చెబుతోంది. రూ.130 బేస్‌‌ప్యాక్‌ తోనే కుటుంబానికి కావాల్సిన అన్ని చానెల్సూ వస్తాయని అంటోంది. ఉదాహరణకు స్టార్‌ గ్రూపు చానెల్స్‌ ను అలా కార్టే విధానంలో కొంటే(విడి విడిగా) రూ.100 దాటు తుంది. బొకే కొంటే(అన్ని కలిపి) రూ.60 వరకు మాత్రమే వసూలు చేస్తారు . అంతేగాక చానెల్‌ ఎమ్మార్పీ కంటే ఆపరేటర్‌ తక్కువ ధరకే ఇచ్చే అవకాశాలూ ఉంటాయి.

టారిఫ్ ఆర్డర్ అమలు చానల్స్ యాజమాన్యాల పాలిట

టారిఫ్ ఆర్డర్ అమలు చానల్స్ యాజమాన్యాల పాలిట శాపంగా మారనున్నవి,1.కంటెంట్ ఉన్న(అందరికీ నచ్చే విధంగా ప్రసిద్ధి చెందిన పోగ్రామ్) 2.కంటెంట్ లేని రెండు రకాలుగా చానల్ ఉన్నాయి. ఇద్దరు కూడా సదరు చానల్ కంపెనీలు 19 రూపాయల చొప్పున నెల బిల్లు అని ప్రముఖ చానెళ్లు కాకుండా చెత్త కంటెంట్ ఉన్న చానల్స్ కూడా ప్రకటించినై కానీ బోకే రూపంలో చాలా తగ్గించారు.ఉదా.జీ తెలుగు 19 రూపాయలు అని ప్రకటించారూ జీ సీనీమా తో సహా మరో ఆరు చెత్త చానెళ్ల బోకే(గంపగుత్తగా) కేవలము 20 రూపాయలు అంటున్నారు.అలాగే మరోటి జెమినీ చానెళ్ల టీఆర్ పీ రేటింగ్ 2008 నుండి తమిళ భాష డబ్బింగ్ సీరియల్స్ తెలుగు వినియోగదారులకు దూరమైనగానీ ఆ చానెళ్ల రేట్ల విషయం జీ తెలుగు నే లాగానే 24 రూపాయలు అంటున్నాయి జెమినీ చానెళ్ల యాజమానాలు. వినియోగదారులు టీవీ ప్రసారాలు చూడకుండా రోజు కూడా గడవదు అనే అంశంపై ఆయా చానల్స్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపింనారు ప్రకటించిన ధరలో సంగం దర వినియోగదారుల నుండి వచ్చిన చానల్స్ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నట్లే చానల్స్ వారు. గతంలో ఏ చానల్స్ మూడు,నాలుగు రూపాయలు మాత్రమే కేబుల్ టీవీ ఆపరేటర్లు ద్వారా తీసుకుని అదే సమయంలో డీటీఎచ్ ప్రొవైడర్ల నుండి కేవలం ఒక్క రూపాయి రెండు రూపాయల చొప్పున ప్రతి ఛానల్కు వినియోగదారుల చొప్పున తీసుకున్నారు (లక్షల మంది వినియోగదారులు వీరికి ఉంటారు కాబట్టి) ఇప్పుడు టారిఫ్ ఆర్డర్ అడ్డు పెట్టుకొని అన్ని చానెల్సూ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో వినియోగదారులు టీవీ చానెల్ అన్ని రకాల ప్యాకేజీలను వేసుకుని ఆదరించినచో చానళ్లు యాజమాన్యాలు బ్రతికి మన గలుగుతాయా లేదా పే చానల్స్ కాస్త ఉచిత చానల్స్ గా ఇరవై యేండ్ల కింద ఉన్న చరిత్ర లా కేవలం ఆడ్స్ మీద వచ్చే ఆదాయం బ్రతుకుగా మారన్నుదా కేబుల్ పరిశ్రమ వర్గాలు, యంఎస్ఓ లు, ఆపరేటర్లు, ట్రాయ్ వారు, అవును అంటున్నారు.ఇన్నాళ్లూ చానల్స్ యాజమాన్యాలు కొంత ఏరియాకూ ఒక ప్రాంతంలో జిల్లాకు ఒకరు ఇద్దరు పంపిణీ ప్రతినిధులను పెట్టి యంఎస్ఓ లను కేబుల్ ఆపరేటర్ల ను నూటికి ఎనభై తొంభై మంది వినియోగదారుల కేబుల్ చందా ముక్కు పిండి వసూలు చేసారు,లేకుంటే సదరు చానల్స్ కేబుల్ వారి వద్ద ఉన్న ఒక్క సెట్టాప్ బాక్స్ సిగ్నల్ ఆపితే అతని నెట్‌వర్క్ కింద ఉన్న ఆపరేటర్ల లేదా వందల, వెయ్యిల మంది వినియోగదారులకు ప్రసారాలు నిలిచిపోయేది అలా కొన్ని చోట్ల వారి ప్రతినిధుల వేధింపులకు తాళలేక వందల సంఖ్యలో కేబుల్ నెట్వర్క్ వదిలి వెళ్లినవారు ఉన్నారు. అయితే చానళ్లు వారు అప్పుడు అటు ఇటుగా సిర్థమైన ఆదాయాన్ని పొందినారు. టారిఫ్ ఆర్డర్ అమలు చేస్తే యంఎస్ఓ లకు కేబుల్ ఆపరేటర్లంతా ఈ సమస్య నుంచి బయట పడ్డారు. ఇన్నాళ్లూ ఆపరేటర్ల ను జుట్టు పట్టుకుని వసూలు చేసిన చానల్స్ యాజమాన్యాలు ఇక నుంచి ఆపరేటర్ల ద్వారా వినియోగదారుల దయాబిక్ష మీద ఆధారపడి ఉంటుంది ఇక వారి ఆదాయం ఇంతకు ముందులా కర్ర పెత్తనం కుదరదు.

కొత్త ప్లాన్ ఎలా ఎంచుకోవాలి

కార్ట్ (చానెల్స్‌‌ను ఎమ్మార్పీ లెక్కన కొనడం) రేట్లతోపాటు అన్ని ప్రధాన చానెళ్ల యాజమాన్యా లు భాష, విభాగాల ఆధారంగా చానెల్స్ బొకేలను ప్రకటించాయి. చానెల్‌‌ ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) ఎంత ఉన్నప్పటికీ ఆపరేటర్‌ బేస్‌ ప్యాక్‌‌ల ధరలు రూ.130 కంటే కూడా వినియోగదారులకు ఎదురుగా ఉన్న పోటీల మద్య తక్కువ ధరకు ఇస్తున్నారు పలు రకాల సంస్థలు.

ఎయిర్‌ టెల్‌‌ డీటీహెచ్‌ టీవీ, టాటా స్కైలు రూ.99లకే బేస్‌ ప్యాక్‌‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిలో కొన్నే ఎస్‌ డీ చానల్స్ కేబుల్‌ ఛార్జీలుతెలుగు చానళ్ల ధరలు ఇలా ఉండ‌బోతున్నాయి .. ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్‌ (7 తెలుగు చానళ్లు) రూ.24, జెమినీ (7 తెలుగు చానళ్లు) రూ.30, స్టార్‌ మా (7తెలుగు, 3 ఇతర భాషా చానళ్లు) రూ.39, జీ తెలుగు (2 తెలుగు, 7 ఇతర భాషా చానళ్లు) రూ.20, మొత్తం రూ.113+రూ.20, 34 జీఎస్టీ ఉంది. ఇక ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ అంటే ఉచితంగా లభించే తెలుగు, ఆంగ్ల న్యూస్‌ ఛానల్స్‌, డీడీ, ఇతర ఉచిత ఛానల్స్‌ ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130లో లభిస్తాయి.

దీనికి 18శాతం జీఎస్టీ ఉంటుంది. రూ.130 బేసిక్‌ ప్యాకేజీ ట్యాక్స్‌తో కలిపి రూ.155 అవుతుంది. ఇతర ఛానల్స్‌, బొకేలు కావలసినవి ఎంపిక చేసుకోవచ్చు వీటిలో మరిన్ని ఎస్‌ డీ చానెల్స్‌‌ను చేర్చుకోవచ్చు కాబట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ముఖ్యం గా పేచానెల్‌‌ కావాలనుకుంటే మాత్రం బిల్లు పెరుగుతుంది. అలాకార్ట్‌ (రెండు వేర్వేరు చానల్స్‌ ఒకే ప్యాక్‌) విధానంలో మాటీవీ హెచ్‌డి ఒక్కటే 19 రూపాయలు. సాధారణమైతే ఎస్‌డి 10 చానల్స్‌ బొకే రూ.39 ధరకు లభిస్తాయి. మొత్తం మీద పేఛానల్స్‌, ప్రీమియం ఛానల్స్‌ కలిపి రూ.285, 300 వరకు నెలవారీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

బేసిక్ పాక్ ధర 130 రూపాయలు ఇందులో వార్తల వంద ఉచిత చానెల్స్‌‌ కంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్లు రూ.20 చెల్లిస్తే అదనంగా మరో ఉచిత 25 చానెల్స్‌‌ ఇస్తారు.వీటిలో మరిన్ని ఎస్‌ డీ చానెల్స్‌‌ను చేర్చుకోవచ్చు కాబట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ముఖ్యం గా పేచానెల్‌‌ కావాలనుకుంటే మాత్రం బిల్లు పెరుగుతుంది. 100 కంటే ఎక్కువ చానెల్స్‌‌ చూసే వారి సంఖ్య 15 శాతానికి మించదని ట్రాయ్‌‌ భావిస్తోంది. బార్క్‌‌ లెక్కల ప్రకారం 80 శాతం మంది వీక్షకులకు 40 కంటే ఎక్కువ చానెల్స్‌‌ చూడటం లేదు.

ట్రాయ్‌‌ లెక్కల ప్రకారం మనదేశంలో 40 మంది బ్రాడ్‌ కాస్టర్లు 330 పేచానెల్స్‌‌ను ప్రసారం చేస్తున్నారు. వీటిలో హెచ్‌ డీ చానెల్సూ ఉన్నా యి. ఫ్రీచానెల్స్‌‌ 535 వరకు ఉన్నాయి. 40 మందిలో 17 మంది బ్రాడ్‌ కాస్టర్లు తమ చానెల్స్‌‌ను గంపగుత్తగా అమ్మడానికి బొకేలను విడుదల చేశారు.

బొకేలతో ఫ్రీచానెల్స్‌‌ను కలపడం సాధ్యం కాదు. హెచ్‌ డీ చానెల్స్‌‌ను ఎస్‌ డీ చానెల్స్‌‌ను కలపలేం . ఈ విషయంలో వీక్షకుడికి స్పష్టత ఉండటం అవసరం. సెట్‌ టాప్‌ బాక్స్‌‌ మాత్రం నచ్చిన కంపెనీది కొనుక్కోవచ్చు. అయితే ఇది సాంకేతికంగా ఆపరేటర్‌ సిస్టమ్‌కు అనుగుణంగా ఉండాలి.

నెలలో మొదటి వారంలో తరువాత కూడా చానెల్స్‌‌ ప్యాక్‌‌ను ఎంచుకోకున్నా ప్రసారాలు ఆగిపోవు. ఇలాంటి వారికి బేసిక్‌‌ ప్యాక్‌‌ చానెల్స్‌‌ వస్తాయి. వీటిలో పే-చానెల్స్‌‌ ఉండవు. అందుకే ప్రతి నెల ఆకరు లోపు కొత్త ప్లాన్‌ ఎంచుకోవటం(లేదా)ఒక్క సారి ఏన్నుకున్న ప్లాన్ ప్రతి నెలా కొనసాగించూకోనువచ్చు కావాలనుకున్న వాళ్లు మార్పు చేసుకోవచ్చు రూల్స్ ప్రకారం డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్లుకు ముందస్తుగా చెల్లింపు లాగా కేబుల్స్ వారికి కూడా ముందుగా నెల రోజుల బిల్లు చెల్లించాలి ప్రతి ఒక్కరూ.మీ కేబుల్ ఆపరేటర్ దగ్గరకెళ్లండి. డిటిహెచ్ అయితే  ఏలాగూ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. వెంటనే సెలెక్ట్ చేసుకోవాలి ఇష్టమైన ప్యాక్ లు లేదా ఒక్కో చానెల్ ను ఎంపిక చేసుకోవాలి. డిటిహెచ్, కేబుల్ ఆపరేటర్లంతా ఈ కొత్త రూల్స్ ప్రకారమే ఇకపై సర్వీస్ ఇస్తారు. దీనిపై టెలికాం రెగ్యులేట రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. డిటిహెచ్ , కేబుల్ ఆపరేటర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఫిర్యాదు చేసేందుకు నంబర్ కూడా ఇచ్చింది. మీకిష్టమైన చానెళ్లు కాకుండా వారికి నచ్చిన చానెళ్ల ప్యాకేజీలను బలవంతంగా రుద్దాలని చూసినా,  ప్యాక్ లో ఫ్రీ చానెళ్లను చేర్చినా ట్రాయ్ కాల్ సెంటర్ 0120–6898689కు ఫోన్ చేయొచ్చని ప్రకటనలో తెలిపింది. లేదా das@trai.gov. inకు మెయిల్ చేయాలని సూచించింది. ఒకవేళ  చానెళ్లను ఎంపిక చేసుకోకపోతే ఆలస్యం చెయకుండా వెంటనే కేబుల్ ఆపరేటర్ ను సంప్రదిం చాలని సూచించింది. సెలెక్ట్ చేసుకున్న చానెళ్లను నెలలోపు ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. నెల తర్వాత మాత్రం ఎంపిక చేసుకున్నప్యాకే కొనసాగుతుంది. ప్రతి ఆపరేటర్‌ 999 నంబరు చానెల్‌‌పై కొత్త రూల్స్‌‌కు వివరాలను ఇవ్వాలని ట్రాయ్‌‌ ఆదేశించింది. చానెల్స్‌‌ ధరలనూ చూపించాలని నిర్దేశించింది. ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ నిర్వహణ తీరుతెన్నులు తెలియజెప్పే షెడ్యూల్ 3 టారిఫ్ ఆర్డర్ లో కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ప్రాధాన్యం ఉందనుకుంటే పొరపాటే. అడ్రెసిబుల్ సిస్టమ్ కు ఉండాల్సిన అర్హతలేమిటో ఇది చర్చిస్తుంది. అదేవిధంగాఅమలు చేయటంలో పాటించాల్సిన నియమాలు, సాంకేతిక వ్యవహారాలు, పాటించాల్సిన ప్రమాణాలు ఇందులో స్పష్టంగా నిర్దేశించారు. సెట్ టాప్ బాక్స్, కండి షనల్ యాక్సెస్ సిస్టమ్, సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఎలాంటి నియమనిబంధనలకు లోబడి ఉండాలో, టారిఫ్ ఆర్డర్ లోని మూడవ షెడ్యూల్ నిర్దేశించింది. ఆ అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. అడ్రెసిబుల్ సిస్టమ్ లో మూడు కీలకమైన అంశాలుంటాయి. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) ద్వారా కోరుకున్న చానల్స్ మాత్రమే ఆ చందాదారుకు చేరే అవకాశం ఉంటుంది. చానల్స్ పంపిణీదారుడైన ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ / హిట్స్ / ఐపిటీవీ ఆపరేటర్ వాడుతున్న కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్) సబ్ స్క్రయిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమెస్ ) లో యాక్టివేషన్, డీ యాక్టివేషన్ సహా ఒక్కో సెట్ టాప్ బాక్స్ కీ పంపిన సూచనలు, ఇతర సమాచారం, చందా వివరాల లాంటివి గ్రహించి దాన్ని సందేశం రూపంలో పంపాల్సిన సెట్ టాప్ బాక్స్ కి పంపటంతోబాటు అందులో కనీసం రెండేళ్ళ పాటు రికార్డు చేసుకోలిగే సామర్థ్యం ఉండాలి. ఒక సెట్ టాప్ బాక్స్ ను డీ యాక్టివేట్ చెయ్యాలంటే ఒకేసారి రెండు సిస్టమ్స్ లోనూ అది జరగాలి. దీనర్థం ఏంటంటే ఒక సెట్ టాప్ బాక్స్ ను యాక్టివేట్ చేసినా, డీయాక్టివేట్ చేసినా ఆ విషయం కాస్ లోనూ ఎస్ ఎమ్ ఎస్ లోనూ నమోదై వాటి రిపోర్ట్స్ లో కనబడాలి. కాస్ సామర్థ్యం ఎలా ఉండాలంటే డిజిటల్ హెడ్ ఎండ్ నుంచే సెట్ టాప్ బాక్స్ ను అప్ గ్రేడ్ చెయ్యగలగాలి. చందాదారుకు సంబంధించిన ఈ దిగువ సమాచారం అందులో పొందుపరచగలగాలి. i. విశిష్టమైన చందాదారు గుర్తింపు సంఖ్య ( ఐడి) ii. చందా సంప్రదింపు సంఖ్య iii. చందాదారు పేరు iv. బిల్లింగ్ చిరునామా v. కనెక్షన్ ఉన్న చిరునామా vi. లాండ్ లైన్ ఫోన్ నెంబర్ vii. మొబైల్ ఫోన్ నెంబర్ viii. ఈ –మెయిల్ అడ్రెస్ ix. చందా కట్టిన చానల్స్, బొకేలు, సేవలు x. విశిష్ట సెట్ టాప్ బాక్స్ నెంబర్ xi. విశిష్ట వ్యూయింగ్ కార్డ్ (విసి) నెంబర్ ఎస్ ఎమ్ ఎస్ ఈ కింది అంశాలలో సామర్థ్యం కలిగినదై ఉండాలి i. సెట్ టాప్ బాక్సుల యాక్టివేషన్ , డీయాక్టివేషన్ కు సంబంధించిన పూర్వ చరిత్రను చూడగలగటం, ముద్రించగలగటం ii. అమర్చిన ప్రతి సెట్ టాప్ బాక్సును, వ్యూయింగ్ కార్డునూ ఎక్కడున్నదీ గుర్తించటం iii. ప్రతి చందారుడూ తన చందాలో చేసుకున్న మార్పుల పూర్వ చరిత్ర, అందుకు సంబంధించి అతడు చేసుకున్న వినతినీ గుర్తించి అందజేయగలగటం. ఏ సమయానికి సమాచారం కావాలన్నా ఎస్ ఎమ్ ఎస్ ఈ రిపోర్టులు అందించగలగాలి. i. సెట్ టాప్ బాక్సునూ, వ్యూయింగ్ కార్డునూ జతచేయటం, విడగొట్టటం ii. సెట్ టాప్ బాక్స్ యాక్టివేషన్, డీయాక్టివేషన్ iii. సెట్ టాప్ బాక్సులు చానల్ కేటాయింపు అన్ని సెట్ టాప్ బాక్సులకూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఉండాలి హెడ్ ఎండ్ దగ్గర పెట్టిన కండిషనల్ యాక్సెస్ సందేశాలను డీక్రిప్ట్ చేసుకోగలిగే సామర్థ్యం సెట్ టాప్ బాక్సుకు ఉండాలి. భారత ప్రభుత్వం నిర్దేశించిన బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా సెట్ టాప్ బాక్స్ ఉండాలి. ఇంకా ఈ పరిస్థితి మనదేశం చాలా దూరంలో ఉంది మరి ఏందుకు ట్రాయ్ నుంచి టారిఫ్ ఆర్డర్ అమలు చేయాలని అతి పెద్ద నిర్ణయాన్ని కొద్ది సమయంలోనే కేవలము నెల రోజుల వ్యవధిలోనే ప్రకటన,గడువు రెండు ముగించారు ఆరు డిటిహెచ్ కార్పొరేట్ కంపెనీలకు లొంగి దేశంలో ఉన్న ఎనిమిది లక్షల మంది కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉపాధి అవకాశాలను కాలరాసే నిర్ణయం టారిఫ్ ఆర్డర్ అమలు. ..ఇంకా కొంత కాలం ఆగి అమలు చేసిన దేశంలో ఉన్న ముప్ఫై రెండుకోట్ల మంది టీవీ వినియోగదారులకు ప్రజలకు కేబుల్ టీవీ ఆపరేటర్ల కు కూడా మంచిది ఆర్థిక స్థోమతకు,టెక్నాలజీ పరంగా మరి కొంతకాలం ఆగి ఉంటే బాఉండు బలవంతంగ అలవికానీ వేళలో అమలు చేశారు...

కొంత దరల అదుపుకు సవరణలు

[మార్చు]

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సుంకం పాలనకు సవరణలను విడుదల చేసింది. ప్రసార రంగంలో ట్రాయ్ యొక్క కొత్త టారిఫ్ పాలన ఏప్రిల్ 1, 2019 నుండి అమలులోకి వచ్చింది, కాని టీవీ ప్రేక్షకులకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైనది నెలవారీ బిల్లులు పెరగడం. ట్రాయ్ టారిఫ్ పాలనతో సమస్యలను పరిష్కరించడానికి, ఆగస్టు 16, 2019, సెప్టెంబర్ 15, 2019 న ట్రాయ్ రెండు సంప్రదింపు పత్రాలను విడుదల చేసింది. డిపిఓలు అందించే పుష్పగుచ్ఛాలు, నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) తగ్గింపు, మల్టీ టివి కోసం ఎన్‌సిఎఫ్ వంటి వివిధ సమస్యలను ట్రాయ్ పరిష్కరించారు. ఛార్జీలు, మరిన్ని సవరణలు. అంతేకాకుండా, డిపిఓలు భారీ క్యారేజ్ ఫీజు వసూలు చేయడం గురించి ప్రసారకుల ఆందోళనను కూడా ట్రాయ్ పరిగణించారు. 2020 జనవరి 15 లోగా ప్రసారకర్తలు సవరించిన ఛానెల్ ధరలను ప్రచురించడాన్ని రెగ్యులేటర్ తప్పనిసరి చేసింది, 2020 జనవరి 30 నాటికి డిపిఓ కూడా దీన్ని జోడించాలి. కొత్త మార్పులు 2020 మార్చి 1 నాటికి వినియోగదారులకు ప్రభావవంతంగా ఉంటాయి. చర్చించిన తరువాత వాటాదారులతో, ప్రజలతో చాలా, ట్రాయ్ ఈ కొత్త మార్పులతో ముందుకు వచ్చారు. మొదట, ప్రసారకర్తలచే పుష్పగుచ్ఛాలు ఏర్పడటంలో భారీ తగ్గింపు సమస్యను ట్రే పరిష్కరించారు. ఎ-లా-కార్టే ఛానెళ్ల ధర భ్రమగా మారకుండా చూసేందుకు అథారిటీ రెండు షరతులతో ముందుకు వచ్చింది; మొదటి కేసు ఒక గుత్తిలో భాగమైన పే ఛానల్స్ (MRP) యొక్క ఎ-లా-కార్టే రేట్ల మొత్తం, అటువంటి సందర్భాలలో అటువంటి పే ఛానెల్స్ ఒక భాగం అయిన గుత్తి రేటు కంటే ఒకటిన్నర రెట్లు మించకూడదు. రెండవ సందర్భంలో, గుత్తిలో భాగమైన ప్రతి పే ఛానల్ (MRP) యొక్క ఎ-లా-కార్టే రేట్లు, ఏ సందర్భంలోనైనా అటువంటి పే ఛానల్ అయిన గుత్తి యొక్క పే ఛానల్ యొక్క సగటు రేటు కంటే మూడు రెట్లు మించకూడదు. పార్ట్. అంతేకాకుండా, రూ .12 లేదా అంతకంటే తక్కువ ధర కలిగిన ఎ-లా-కార్టే ఛానెల్‌లను ప్రసారకర్తలు అందించే గుత్తిలో భాగంగా అనుమతించమని కూడా ట్రాయ్ ఖరారు చేశారు. ప్రతి టీవీ వీక్షకుడు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఎన్‌సిఎఫ్ ఛార్జీలు. వివిధ నిబంధనలను వివరంగా పరిశీలించామని, తదనుగుణంగా 200 ఛానెళ్లను గరిష్టంగా ఎన్‌సిఎఫ్‌లో రూ .130 (పన్నులు మినహాయించి) ఏర్పాటు చేయాలని ట్రాయ్ చెప్పారు. దానికి తోడు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తప్పనిసరి అని ప్రకటించిన ఛానెళ్లను ఎన్‌సిఎఫ్‌లోని ఛానెళ్ల సంఖ్యలో లెక్కించవద్దని నిర్ణయించారు. ట్రాయ్ కూడా డిపిఓలను నెలకు 160 రూపాయలకు మించి వసూలు చేయవద్దని ఆదేశించింది అన్ని FTA ఛానెల్‌లను వారి ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచడం. ప్రస్తుతం, డిపిఓలు మొదటి 100 ఛానెళ్లకు రూ .153 ఎన్‌సిఎఫ్ ఛార్జీలు, ప్రతి 25 అదనపు ఛానెళ్లకు రూ .20 (పన్నులు మినహాయించి) వసూలు చేస్తున్నారు. డిపిఓలు తీసుకుంటున్న అధిక మల్టీ టివి ఛార్జీలను కూడా ట్రాయ్ పరిష్కరించారు. అంతకుముందు 2019 లో, మల్టీ టీవీ వినియోగదారులకు ఎన్‌సిఎఫ్‌పై డిస్కౌంట్ అందించే పూర్తి స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉందని ట్రాయ్ చెప్పారు. ఇది టాటా స్కై ప్రతి మల్టీ టీవీ యూజర్ నుండి 153 రూపాయల పూర్తి ఎన్‌సిఎఫ్ వసూలు చేసింది. మల్టీ టివి హోమ్ కోసం ఎన్‌సిఎఫ్ రూపంలో డిపిఓలు తీసుకున్న భారీ ఛార్జీలను ఇది వినియోగదారులు హైలైట్ చేసింది. కొత్త సవరణలలో భాగంగా, రెండవ, అదనపు టివి కనెక్షన్ల కోసం ఆపరేటర్లు ప్రకటించిన ఎన్‌సిఎఫ్‌లో గరిష్టంగా 40% వసూలు చేయాలని ట్రాయ్ నిర్ణయించారు. ఆరు నెలల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న దీర్ఘకాలిక సభ్యత్వాలపై డిస్కౌంట్లను ఇవ్వడానికి అథారిటీ DPO లను అనుమతించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2020 జనవరి 15 లోగా ప్రసారకులు తమ ఎ-లా-కార్టే ఛానెళ్ల ధరలను సవరించాలని ధృవీకరించారు. డిటిహెచ్, కేబుల్ టివి ఆపరేటర్లు సవరించిన ఎ-లా-కార్టేను ప్రచురించాల్సిన అవసరం ఉంది జనవరి 30, 2020 నాటికి వారి వెబ్‌సైట్‌లో పుష్పగుచ్ఛాలు. మార్చి 1, 2020 నుండి సవరణల ప్రకారం వినియోగదారులు ప్రయోజనం పొందగలరు.

మార్చి 1 2020 నుంచి అమలులోకి కొత్త టారిఫ్ రోజు నుండి వర్తిస్తాయి అమలు చేయాలని ట్రాయ్ కఠినంగా కోరినందున : 1. బొకేలో పెట్టిన చానల్ గరిష్ఠ ధర 19 నుంచి 12కు తగ్గింపు 2. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజ్ రూ. 130 కి 100 కి బదులు 200 ఫ్రీ టు ఎయిర్ చానల్స్ 3.200 కు మించి ఎన్ని ఉచిత చానల్స్ కావాల్సిన రూ.160 కి మించి చెల్లించనక్కర్లేదు. 4. 26 డిడి చానల్స్ వీటికి అదనం 5. బొకేలో ఉన్న చానల్స్ మొత్తం ధరలో మూడో వంతు మించి డిస్కౌంట్ ఇవ్వకూడదు. దీనివలన 6. ఇంట్లో రెండో టీవీ ఉంటే దానికి నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు 40 శాతం చెల్లిస్తే చాలు...

మొదట ట్రాయ్ యొక్క మార్గదర్శకాలను అనుసరించి, డిటిహెచ్ ఆపరేటర్లు టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టివి నేషనల్ టారిఫ్ ఆర్డర్ 2.0 ను అమలు చేశాయి. రెండు కంపెనీలు కొత్త నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్), మల్టీ టివి ధరలను ప్రకటించాయి,ప్రసారకులు, ట్రాయ్‌ల మధ్య సమస్య కొనసాగుతుండగా ట్రాయ్‌కు అవసరమైన మార్పుల ఆధారంగా డిటిహెచ్ ఆపరేటర్లు మార్పులు చేస్తున్నారు, కాబట్టి అన్ని కొత్త మెరుగుదలలు పరిశ్రమలో సాధారణం. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, టాటా స్కై మొదటి 200 ఎఫ్‌టిఎ ఛానెల్‌లకు ఎన్‌సిఎఫ్‌గా రూ.153.4 వసూలు చేస్తాయి 100 ఛానెల్‌లకు బదులుగా 200 కంటే ఎక్కువ ఎస్‌డి ఛానెళ్ల చందా కోసం రూ 188.80 (పన్నుతో మొత్తం ధర) తెలిపారు.

మల్టీ టీవీ ఎన్‌సీఎఫ్ ప్రతి నెలా రూ .61.36 కు తగ్గించబడింది .ఒకే ఇంటిలో ఒకే ఖాతా కింద యాక్టివేట్ కావడానికి అన్ని మల్టీ టీవీ కనెక్షన్ల కోసం 200 కె ఎస్డి ఛానెళ్లకు రూ. 52 (పన్నులతో సహా రూ .61.36) నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు వర్తిస్తుంది. 200 ఎస్‌డి ఛానెల్‌లకు పైన, అంతకంటే ఎక్కువ ఛానెల్‌లకు చందా కోసం రూ .30 అదనపు ఎన్‌సిఎఫ్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తెలిపింది. అయితే, టాటా స్కై 200 కంటే ఎక్కువ ఎస్‌డి ఛానెళ్లకు నెలకు రూ .75.52 (పన్నులతో సహా) స్థిర ఎన్‌సిఎఫ్ వసూలు చేయనుంది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సవరణలు ప్రకటించినప్పటి నుండి, ప్రసారకులు ఎన్‌టిఓ 1.0 నుండి ఇంకా కోలుకోనందున ఉపశమనం కోరుతూ రెగ్యులేటర్‌తో పోరాడుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. http://telugutv.info/digitisation-a-summary/[permanent dead link]

దూరదర్శన్(టీవి ఛానల్)