కోడి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కోడి | |
---|---|
కోడి పుంజు | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | Galliformes
|
Family: | Phasianidae
|
Genus: | Gallus
|
Species: | G. gallus, Gallus gallus domesticus
|
కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు', ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి
- నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
- ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.
- బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.
కోడిపెట్టలు విశేషాలు
[మార్చు]- ఇవి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి.
కోడిపుంజులు విశేషాలు
[మార్చు]- వీటిని అధికంగా పందాలలో వాడుతుంటారు.
- వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి మొదలుకొని అనేక రకాల ఆహారం ప్రత్యేకంగా తినిపిస్తుంటారు.
- వీటిని ఆంధ్ర ప్రాంతంలో నెమలి, డేగ, కోయిల, పరగ ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.
ఉపయోగాలు
[మార్చు]- వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.
- వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్థం
కోడి ముందా? గుడ్డు ముందా?
[మార్చు]కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది. 24 గంటల్లోపే మరో గుడ్డును తయారు చేసే పనిలో పడుతుంది. 'గుడ్డు ఏర్పడటానికి అత్యంత కీలకమైన ఈ ప్రొటీన్ కోడిలోనే ఉంటుంది తప్ప, గుడ్డులో కనిపించదు' .గుడ్డు ఏర్పడాలంటే ఈ ప్రొటీన్ ఉండాలి. అంటే గుడ్డుకన్నా ముందు ఈ ప్రొటీన్ ఉత్పత్తి జరిగింది కాబట్టి ప్రొటీన్ ఉత్పత్తి జరగాలంటే కోడి ఉండాలి కనుక, గుడ్డు కన్నా కోడే ముందు పుట్టిందట.
కుక్కుట శాస్త్రం
[మార్చు]కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.
ఇవి కూడా చూడండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
కోడిపెట్ట, పుంజు
-
కోడిపెట్ట
-
వేయించిన కోడి మాంసం ముక్కలు - జపనీస్ వంటకం
-
చికెన్ టిక్కా
-
కోడి పుంజు
-
కోడి కూర వేపుడు
-
కోడిగుడ్లు