కోరాపుట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరాపుట్
—  పట్టణం  —
దేవమాలి పర్వత శ్రేణి
దేవమాలి పర్వత శ్రేణి
Nickname(s): Aero Engine Capital of India[1]
కోరాపుట్ is located in Odisha
కోరాపుట్
కోరాపుట్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా కోరాపుట్
జనాభా (2011)
 - మొత్తం 47,468
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
Vehicle registration OD 10

కోరాపుట్ ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది కోరాపుట్ జిల్లాకు కేంద్రం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

కోరాపుట్ జిల్లా దాని ప్రధాన కార్యాలయం ప్రస్తుత కోరాపుట్ పట్టణం నుండి వచ్చింది. పురాతన కాలంలో నలలు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు, ఆధునిక ఉమర్‌కోట్ సమీపంలోని పుష్కరి, వారి రాజధాని నగరంగా ఉండేది. సిలవంశీ రాజుల క్రింద ఒక చిన్న రాజ్యంగా అభివృద్ధి చెందిన నందపూర్‌ను, 13వ శతాబ్దంలో కాశ్మీర్ నుండి ఈ ప్రాంతానికి వచ్చిన సూర్యవంశీ రాజులు విస్తరించారు. ఆ తరువాత, మహారాజా వీర్ విక్రమ్ దేవ్ తన రాజధానిని జైపూర్‌కు మార్చాడు. 17వ శతాబ్దం మధ్యలో ఈ పట్టణం బ్రిటిష్ పరిపాలనలో అభివృద్ధి చెందింది. మెరుగైన ఆరోగ్య అవకాశాల కోసం 1870లో కోరాపుట్‌ను బ్రిటిష్ వారు ఎంచుకున్నారు. కోరాపుట్ పేరు యొక్క మూలం అస్పష్టంగా ఉంది. అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.

ఆర్.సి.ఎస్. బెల్ ప్రకారం, పట్టణం పేరు 'కోరా-పుట్టి' అంటే ముషిడి గ్రామం అని అర్థం. ఒకప్పుడు ఇక్కడికి సమీపంలో ఉండే ముషిడీ చెట్టు నుండి ఆ పేరు వచ్చింది. కానీ నేడు కోరాపుట్ పట్టణానికి సమీపంలో ఒక్క ముషిడీ చెట్టు కూడా లేదు. అంచేత ఈ నిర్వచనం ప్రశ్నార్థకంగా ఉంది.

రెండవ సిద్ధాంతం ప్రకారం, కోరాపుట్ అనేది 'కరకా పెంతో' నుండి వచ్చిన రూపం. కరక అంటే 'వడగళ్ళు' అని అర్థం. నందపూర్ రాజుల కాలంలో 'ఖోరా నైకో' అనే అతను ఈ గ్రామానికి పునాది వేసినట్లు కూడా భావిస్తున్నారు. అతను బహుశా రాణ్‌పూర్‌కు చెందినవాడు. నందాపూర్ రాజుల క్రింద పనిచేశాడు. అతని విశ్వాసపాత్రమైన సేవకు గాను ఈ గ్రామాన్ని స్థాపించడానికి అతను అనుమతి పొందాడు. ఇది అతని పేరు మీద ఖోరా పుటు అయి, ఆ తరువాత క్రమేణా 'కోరాపుట్' అయింది.

కోరాపుట్ ఒక పర్యాటక ప్రదేశం. పట్టణం చుట్టూ పర్వతాలు, దట్టమైన అడవులు, జలపాతాలు ఉన్నాయి. ఈ పట్టణంలో అనేక పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]
కోరాపుట్‌లోని కెచల సరస్సు

కోరాపుట్ 18°49′N 82°43′E / 18.82°N 82.72°E / 18.82; 82.72 వద్ద [2] సముద్రమట్టం నుండి 870 మీ. ఎత్తున ఉంది.

ఒడిషాలోని కొన్ని ప్రధాన నదులు మాచ్‌కండ్, వంశధార, కోలాబ్ వంటివి కోరాపుట్ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో డుడుమా, బాగ్రా, ఖండహతి వంటి జలపాతాలు కూడా ఉన్నాయి. కోరాపుట్ జిల్లా జైపూర్, డుడుమ, బాగ్రా, సునబేడ మిగ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది.

హిల్ స్టేషన్లు

[మార్చు]

దక్షిణ ఒడిశాలోని గిరిజన బెల్ట్ నడిబొడ్డున ఉన్నందున, ఇది భారతదేశంలోని ఇతర హిల్ స్టేషన్ల వలె ప్రసిద్ధి చెందనప్పటికీ ఇక్కడ అనేక హిల్ స్టేషన్లున్నాయి. మాచ్‌కుండ్, ఒనుకడిల్లి, జోలాపుట్, చింద్రీ, హతిపత్తర్, (దేవమాలి) పోతంగి మొదలైనవి ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు.

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Koraput, Odisha
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 25.3
(77.5)
28.4
(83.1)
31.7
(89.1)
33.6
(92.5)
34.3
(93.7)
30.6
(87.1)
25.9
(78.6)
25.6
(78.1)
26.6
(79.9)
27.0
(80.6)
25.7
(78.3)
24.7
(76.5)
28.3
(82.9)
సగటు అల్ప °C (°F) 4.0
(39.2)
6.4
(43.5)
15.7
(60.3)
20.9
(69.6)
22.9
(73.2)
22.5
(72.5)
20.7
(69.3)
20.4
(68.7)
20.3
(68.5)
18.7
(65.7)
14.1
(57.4)
3.5
(38.3)
15.8
(60.5)
సగటు వర్షపాతం mm (inches) 8
(0.3)
3
(0.1)
19
(0.7)
53
(2.1)
84
(3.3)
213
(8.4)
437
(17.2)
391
(15.4)
247
(9.7)
116
(4.6)
27
(1.1)
8
(0.3)
1,606
(63.2)
Source: en.climate-data.org

రవాణా

[మార్చు]

కోరాపుట్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి. జాతీయ రహదారి నంబర్ 26 (43), పట్టణం గుండా వెళుతుంది. ఇది పట్టణాన్ని రాయ్‌పూర్, విశాఖపట్నంతో కలుపుతుంది. విశాఖపట్నం. విజయనగరం నుండి కోరాపుట్ కు బస్సులు పుష్కలంగా ఉన్నాయి. జైపూర్, జగదల్‌పూర్, ఉమర్‌కోట్ మొదలైన ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా కోరాపుట్ మీదుగా వెళ్తాయి.

కోరాపుట్ రైల్వే స్టేషను నుండి కోరాపుట్‌ను రాయగడ, విశాఖపట్నం, బెర్హంపూర్, జగదల్పూర్, హౌరా, భువనేశ్వర్, రూర్కెలా, రాయ్పూర్ లకు రైలు సౌకర్యం ఉంది.

ప్రతిపాదిత బిజు ఎక్స్‌ప్రెస్ వే ఈ నగరాన్ని రూర్కెలాతో కలుపుతుంది.

పరిపాలన

[మార్చు]

కోరాపుట్ జిల్లాను కోరాపుట్, జైపూర్ అనే 2 సబ్ డివిజన్లు గాను, 14 బ్లాకులు గానూ విభజించారు.

కోరాపుట్ సబ్-డివిజను లోని బ్లాక్‌లు. కోరాపుట్ 2. సెమిలిగూడ 3. నందాపూర్ 4. పొట్టంగి 5. దస్మంత్‌పూర్ 6. లామ్టాపుట్ 7. లక్ష్మీపూర్ 8. నారాయణపట్నం 9. బందుగావ్

జైపూర్ సబ్-డివిజను లోని బ్లాక్‌లు. బరిగుమ 2. జైపూర్ 3. కోటపడా 4. బోయిపరిగూడ 5. కుందుర [3]

విద్య

[మార్చు]

కొరాపుట్‌లో SLN వైద్య కళాశాల, ఆసుపత్రి ఉన్నాయి.

2009లో, కోరాపుట్‌లో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒరిస్సాను ఏర్పాటు చేసారు. ఇది ఇంగ్లీష్, ఒరియా, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, ఆంత్రోపాలజీ, సోషియాలజీపై కోర్సులను అందిస్తూ 2009 ఆగస్టు నుండి పని చేయడం ప్రారంభించింది. ప్రొఫెసర్ సురభి బెనర్జీ యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.[4]

2017 సెప్టెంబరు 4 న, ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా కోరాపుట్‌లో స్థాపించారు. ఆ ప్రాంతానికి చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సహీద్ లక్ష్మణ్ నాయక్ పేరు ఈ సంస్థకు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. PTI (6 December 2014). "Koraput to be nurtured as Aero Engine Capital of India: Raha". OdishaTV. Archived from the original on 1 ఆగస్టు 2018. Retrieved 31 July 2018.
  2. Falling Rain Genomics, Inc.
  3. "Jeypore subdivision".
  4. Central University Archived 2009-07-26 at the Wayback Machine.