చాంగి 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాంగ్ ఈ 3
మిషన్ రకంలాండర్, చంద్ర రోవర్
ఆపరేటర్CNSA
COSPAR ID2013-070A Edit this at Wikidata
SATCAT no.39458Edit this on Wikidata
మిషన్ వ్యవధి3 months[1]
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుషాంఘై ఏరోస్పేస్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్
ల్యాండింగ్ ద్రవ్యరాశి1200 కిలోలు
రోవర్: 120 కి.గ్రా. (260 పౌ.)[2][3]
కొలతలురోవర్: 1.5 మీ. (4.9 అ.) high
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ1 డిసెంబర్ 2013, 17:30 UTC[4]
రాకెట్చాంగ్ జెంగ్ 3B Y-23
లాంచ్ సైట్క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్-2
Lunar orbiter
Orbital insertion6 డిసెంబరు 2013, 2:30 UTC[5]
Lunar రోవర్
ల్యాండింగ్ తేదీ16 డిసెంబరు 2013[6]
ల్యాండింగ్ సైట్Sinus Iridum
 
ల్యాండింగ్ సైట్ సినస్ ఇరిడమ్

చాంగి 3 చైనా చేపట్టిన చంద్ర మండల శోధన యాత్ర. ఒక రోబోటిక్ లాండరు, ఒక రోవరు తో ఉన్న దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. చైనీస్ చంద్ర పరిశోధన కార్యక్రమపు రెండవ దశలో భాగంగా 2013 డిసెంబరు 1 న చాంగి 3 ను విజయవంతంగా ప్రయోగించారు. ఇది చైనా యొక్క మొదటి చంద్ర రోవరు అవుతుంది. 1976 లోని సోవియట్ లూనా 24 మిషన్ తరువాత 37 సంవత్సరాలలో చంద్రునిపై మృదువుగా దిగేందుకు చేయబడిన మొదటి అంతరిక్ష నౌక కూడా. దీనికి చాంగి అని చైనీస్ చంద్ర దేవత పేరు పెట్టారు. చాంగి 1, చాంగి 2 చంద్ర ఆర్బిటర్ల తరువాతిది చాంగి-3. ఈ చంద్ర ప్రోబ్ ను యుటు (కుందేలు) లేదా జాడే రాబిట్ అని కూడా అంటారు, ఈ పేరును ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఎంపిక చేశారు. ఈ పేరు చైనీస్ పురాణం ప్రకారం వచ్చింది, చైనీస్ పురాణం ప్రకారం ఒక తెల్ల కుందేలు చంద్రునిపై జీవిస్తుంటుంది.

యుటు రోవరు ఉన్న చాంగి 3 ప్రయోగంతో రోవర్లను పంపిన దేశాలలో అమెరికా, రష్యా తరువాత చైనా మూడవ దేశంగా నిలిచింది.

రోవర్

[మార్చు]

చాంగి 3 ఒక చంద్ర రోవరు కలిగి ఉంటుంది, ఈ రోవరు లాండరు నుండి విడివడి, స్వతంత్రంగా చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించగల సామర్థ్యంతో రూపొందించారు. ఈ ఆరు చక్రాల రోవరు అభివృద్ధి షాంఘై ఏరోస్పేస్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ లో 2002 లో మొదలై, 2010 మేలో పూర్తయింది. రోవరు నిలబడినపుడు ఎత్తు 1.5 మీటర్లు ఉంటుంది. బరువు సుమారు 120 కిలోలు ఉంటుంది. ఇది సుమారు 20 కిలోల పేలోడును మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రోవరు వాస్తవ సమయంలో వీడియో ప్రసారం చేస్తుంది. నేలను తవ్వగలుగుతుంది. మట్టి నమూనాలపై సాధారణ విశ్లేషణలు చేయగలుగుతుంది. దీనికి ఉన్న ఆటోమేటిక్ సెన్సార్ల వలన ఇది ఇతర వస్తువులతో ఢీ కొనకుండా చక్కగా నావిగేట్ చేసుకుంటూ ప్రయాణించగలదు. దీనికి కావలసిన శక్తి దీనికి అమర్చబడిన సోలారు ప్యానెల్ ద్వారా అందుతుంది. దాని 3 నెలల మిషన్ సమయంలో గరిష్ఠంగా 10 కిలోమీటర్లు (6.2 మైలు) ప్రయాణించి, 3 చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని అన్వేషించేలా రూపొందించారు.

మూలాలు

[మార్చు]
  1. Laxman, Srinivas (7 March 2012). "Chang'e-3: China To Launch First Moon Rover In 2013". Asian Scientist. Retrieved 5 April 2012.
  2. "Chinese Space Program – Chang'e 3". Dragon in Space. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 21 December 2012.
  3. "中国已造出国产核电池 将装上嫦娥三号月球车_新闻_腾讯网". News.qq.com. 2012-08-12. Archived from the original on 2013-12-03. Retrieved 2013-12-02.
  4. "China Starts Manufacturing Third Lunar Probe". English.cri.cn. Archived from the original on 2013-10-21. Retrieved 2013-12-02.
  5. "Chang'e 3 may launch December 1 with Yutu rover, will not harm LADEE mission | The Planetary Society". Planetary.org. Retrieved 2013-12-02.
  6. "Technological advancements and promotion roles of Chang'e-3 lunar probe mission". Sci China Tech Sci. 56 (11): 2702. 2013.