తిరుచిరాపల్లి
Tiruchirappalli
Trichy, Tiruchi (shortened) Tiruchinopoly (colonial) | |
---|---|
Coordinates: 10°47′25″N 78°42′17″E / 10.79028°N 78.70472°E | |
Country | భారతదేశం |
State | Tamil Nadu |
District | Tiruchirapalli |
Zone | Central |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Tiruchirappalli City Municipal Corporation |
• Mayor[2] | Thiru. Mu. Anbalaagan |
• Deputy Mayor[3] | Tmt. G. Dhivya |
• Commissioner of Police[4] | Thiru G. Karthikeyan IPS |
• Member of Parliament | Su. Thirunavukkarasar |
విస్తీర్ణం | |
• Metropolis | 167.23 కి.మీ2 (64.57 చ. మై) |
• Metro | 211.51 కి.మీ2 (81.66 చ. మై) |
• Rank | 4 |
Elevation | 81 మీ (266 అ.) |
జనాభా (2011)[a] | |
• Metropolis | 9,16,857[1] |
• Rank | 52nd 4th in Tamil Nadu |
• Metro | 10,22,518 |
• Metro rank | 52nd |
Demonym | Tiruchiite |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 620 xxx |
Telephone code | 0431 |
Vehicle registration | TN-45, TN-48, TN-81, TN-81A |
తిరుచిరాపల్లి దీనిని తిరుచ్చి లేదా ట్రిచీ అని కూడా పిలుస్తారు. భారతదేశం, తమిళనాడు రాష్ట్టం, తిరుచిరాపల్లి జిల్లాలోని ఒక పెద్ద రెండవ టైర్ సిటి. ఇది తిరుచిరాపల్లి జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈనగరం ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఘనత పొందింది. [6]తమిళనాడు రాష్ట్రంలోపరిశుభ్రమైన నగరం, అలాగే భారతదేశంలో మహిళలకు సురక్షితమైన ఐదవ నగరంగా గుర్తింపు పొందింది.[7] పట్టణసముదాయంలో ఇది రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. తిరుచిరాపల్లి నగరం దాదాపు దక్షిణ చెన్నై ప్రాంతంలో 322 కిలోమీటర్లు (200 మై.) ఉత్తర కన్యాకుమారి ప్రాంతంలో374 కిలోమీటర్లు (232 మై.) తమిళనాడ రాష్ట్ర భౌగోళిక కేంద్రంలో విస్తరించి ఉంది .కావేరి నది రెండు భాగాలుగా విడిపోయి, కావేరీ డెల్టా ప్రారంభం 16 కిలోమీటర్లు (9.9 మై.) నగరం పశ్చిమ భాగం, శ్రీరంగం ద్వీపం ఏర్పాటుగాఉంది. దీని పరిపాలనా నిర్వహణ తిరుచిరాపల్లి నగర పాలకసంస్థ ద్వారా సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 9,16,857 మంది జనాభాతో 167.23 చదరపు కిలోమీటర్లు (64.57 చ. మై.) లో విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
భౌగోళికం, వాతావరణం
[మార్చు]తిరుచిరాపల్లి నగరం ఉత్తరాన షెవరాయ్ కొండలు, దక్షిణం, నైరుతి దిశలో పళని కొండల మధ్య మైదానాలలో ఉంది. [8] తిరుచిరాపల్లి పూర్తిగా వ్యవసాయ క్షేత్రాలతో చుట్టబడి ఉంది. [9] నగర ఉత్తర భాగంలో జనసాంద్రత కలిగిన పారిశ్రామిక, నివాస ప్రాంతాలు ఉంటాయి. దక్షిణ అంచులో కూడా నివాస ప్రాంతాలు ఉన్నాయి. [9] తిరుచిరాపల్లి పాత భాగం, రాక్‌ఫోర్ట్ లోపల, ప్రణాళిక లేకుండా, రద్దీగా ఉంటుంది. పక్కనే ఉన్న కొత్త ప్రాంతాలు మెరుగ్గా తీర్చిదిద్దబడ్డాయి.[10] శ్రీరంగంలోని చాలా పాత ఇళ్లు శిల్ప శాస్త్రాల ప్రకారం నిర్మించబడ్డాయి. కానానికల్ గ్రంథాల వాస్తుశిల్పం ప్రకారం హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. [11]
పట్టణ నిర్మాణం
[మార్చు]వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. [12] "ట్రిచీ" లేదా "తిరుచ్చి"అనే సంక్షిప్తరూపాలు రోజువారీవాడకంలో ఉపయోగిస్తారు. కానీ పూర్తిపేరు తిరుచిరాపల్లి. పాక్షికంగా ప్రభుత్వకార్యాలయాల అధికారికవాడకంలో తిరుచిరాపల్లి పేరు వాడకం కనిపిస్తుంది.కానీ సామాన్య తిరుచిరాపల్లి పేరును ప్రజలు చాలా అరుదుగాఉపయోగిస్తారు.[13] [14]
చరిత్ర
[మార్చు]సాశ.పూ. 3వ శతాబ్దంలో చోళుల పాలనలో ఉన్నప్పుడు తిరుచిరాపల్లి ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఈ నగరాన్ని పల్లవులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, నాయక్ రాజవంశం, కర్ణాటక రాజ్యం, బ్రిటిష్ వారు పాలించారు. తిరుచిరాపల్లి లోని అత్యంత ప్రముఖమైన చారిత్రక కట్టడాల్లో తెప్పకులం లోని రాతికోట, హిందూ దేవత విష్ణువు శయన రూపానికి అంకితం చేయబడిన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం, తిరువానైకావల్‌లోని జంబుకేశ్వర్ ఆలయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని హిందూదేవత శివునికి అంకితం చేసిన అతిపెద్ద దేవాలయాలలో ఇది ఒకటి. పురావస్తుపరంగా ముఖ్యమైన పట్టణం ఉరైయూర్, తొలి చోళుల రాజధాని. ఇప్పుడు తిరుచిరాపల్లిలో అది ఒక పొరుగుప్రాంతం. బ్రిటిష్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన కర్నాటక యుద్ధాలలో (1746–1763) ఈ నగరం చాలా కీలకపాత్ర పోషించింది.
తమిళనాడు రాష్ట్రంలో ఈ నగరంలో జాతీయంగా గుర్తింపు పొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (ఎన్.ఎల్.యు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటి) శ్రీరంగం, సంస్థలను కలిగి, ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఉంది. ఇంకా నగరంలో భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బి.ఎచ్.ఇ.ఎల్) వంటి పారిశ్రామిక సంస్థలు, గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి (ఒ.ఎఫ్.టి), హై ఎనర్జీ ప్రొజెక్టైల్ ఫ్యాక్టరీ (ఎచ్.ఇ.పి.పి) లాంటి సంస్థలు ఉన్నాయి. నగర చుట్టుపక్కల పెద్దసంఖ్యలో ఇంధన పరికరాల తయారీ పరిశ్రమలు ఉండటం వలన "భారతదేశంలోని ఇంధన సామగ్రి కల్పన రాజధాని" అనే బిరుదును పొందింది.తిరుచిరాపల్లి అంతర్జాతీయంగా ట్రిచినోపోలీ సిగరెట్టు అని పిలువబడే ''పొగ చుట్ట'' చెరూట్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది19వ శతాబ్దంలోయునైటెడ్ కింగ్‌డమ్‌కు పెద్ద మొత్తంలో ఎగుమతి చేయబడింది. రాష్ట్రంలోని ఒక ప్రధానరహదారి, రైల్వేహబ్, ఈనగరానికి తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం (టి.ఆర్.జెడ్) సేవలుఅందిస్తోంది,ఇది మధ్యప్రాచ్యం ఆగ్నేయాసియాకు విమానాలను నడుపుతోంది.
ప్రారంభ, మధ్యయుగ చరిత్ర
[మార్చు]తిరుచిరాపల్లి తమిళనాడులోని అతిపురాతనమైన జనావాసనగరాలలో ఒకటి. దానితొలి స్థావరాలు సంగంకాలం నాటివి.[15] సా. పూ.3వ శతాబ్దంనుండి 600 సంవత్సరాలపాటు ప్రారంభ చోళుల ఉరైయూర్ రాజధాని.[16]అది ప్రస్తుత తిరుచిరాపల్లిలో ఒక పొరుగు ప్రాంతం.[17] [18]చరిత్రకారుడు టోలెమీ తన 2వ శతాబ్దపు భూగోళశాస్త్రంలో ఈ నగరాన్ని ఆర్థౌరాగా పేర్కొన్నాడు.[19] ప్రపంచంలోనే అత్యంతపురాతనమైన ఆనకట్ట, కల్లనై (దిగువ ఆనకట్ట) దాదాపు18 కిలోమీటర్లు (11 మై.) పొడవుతో ఉరైయూర్ నుండి, కావేరీ నదికి అడ్డంగా సా.శ. 2వ శతాబ్దంలో కరికాల చోళుడు నిర్మించాడు. [20]
బ్రిటిష్ పాలన
[మార్చు]బ్రిటీష్ వారికి శత్రువు అయిన టిప్పుసుల్తాన్, వాలాజా నవాబు కుమారుడు ఉమ్‌దత్ ఉల్-ఉమ్రా మధ్య కుమ్మక్కు జరిగినట్లు కనుగొన్నపర్యవసానంగా 1801 జులైలో లో కర్ణాటక రాజ్యం నాల్గవ ఆంగ్ల-మైసూరుయుద్దం ప్రకారంబ్రిటిష్ వారిచే విలీనం చేయబడింది.[21] [22] ట్రిచినోపోలీ జిల్లా రాజధానిగా ట్రిచినోపోలీ (లేదా తిరుచిరాపల్లి) నగరం ఏర్పాటుచేయబడింది. [23]
తరువాత బ్రిటిష్ రాజ్ కాలంలో, తిరుచిరాపల్లి భారతదేశం లోని అత్యంత ముఖ్యమైన నగరాలలో ఒకటిగా ఉద్భవించింది.మొదటి 1871 భారత జనాభా లెక్కల ప్రకారం తిరుచిరాపల్లి జనాభా 76,530 ఉంది. మద్రాసు రాజధాని (ప్రస్తుతం చెన్నై) తర్వాత ప్రెసిడెన్సీలోఇది రెండవ అతిపెద్ద నగరంగా మారింది.[24]ఇది ట్రిచినోపోలీ సిగార్ అని పిలువబడే దాని ప్రత్యేకమైన పొగచుట్ట కోసం బ్రిటిష్ సామ్రాజ్యంఅంతటా ప్రసిద్ధి చెందింది.[25] 1874లో కొత్తగాఏర్పడిన దక్షిణభారత రైల్వే కంపెనీకి తిరుచిరాపల్లి మొదటి ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో మద్రాస్‌కు మార్చారు. [b] [27]
చిత్రమాలిక
[మార్చు]-
ట్రిచినోపోలీ పట్టణంలో సాశ.1840 నాటి కోట
-
సాశ.1860లో తెప్పకులం రాతికోట
సమకాలీన, ఆధునిక చరిత్ర
[మార్చు]స్వాతంత్ర్యానికి పూర్వం తిరుచిరాపల్లి క్రియాశీలక పాత్ర పోషించింది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అనేక సమ్మెలు, అహింసా నిరసనలు ఈనగరంలో జరిగాయి.,[28] ముఖ్యంగా 1928లో జరిగిన దక్షిణ భారత రైల్వే సమ్మె. [29] సి. రాజగోపాలాచారి ప్రారంభించిన వేదారణ్యం ఉప్పు యాత్రకు ఈ నగరం స్థావరంగా ఉంది. 1930లో దండి మార్చ్‌కు సమాంతరంగా [30]1938లో తమిళభాషా మద్దతుదారుల బృందం సమావేశమై నగరం నుండి మద్రాసు వరకు ర్యాలీ నిర్వహించినప్పుడు తిరుచిరాపల్లి తమిళనాడులోని హిందీ వ్యతిరేక ఆందోళనలకు కేంద్రంగాఉంది.[31] తరువాత 1965లో సి.రాజగోపాలాచారి నిర్వహించిన "మద్రాసు రాష్ట్ర హిందీ వ్యతిరేక సదస్సు"కు తిరుచిరాపల్లి స్థావరంగా మారింది.[32] [33] తిరుచిరాపల్లి జనాభా వేగంగా పెరిగి, 1941-51 కాలంలో 36.9% వృద్ధి రేటును సాధించింది. [34] 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తిరుచిరాపల్లి వృద్ధి పరంగా సేలం, కోయంబత్తూర్ వంటి ఇతరనగరాల కంటే వెనుకబడింది. [35] [9] [36] 1980ల ప్రారంభంలో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ రాష్ట్ర పరిపాలనా ప్రధాన కార్యాలయాన్నితిరుచిరాపల్లికి తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు.[37]దీనికోసం నగరశివార్లలో నవల్పట్టు సమీపంలో ఒక ఉపగ్రహ పట్టణం కూడా అభివృద్ధి చేసారు [37] కానీ ప్రతిపాదిత చర్యను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిలిపివేసాయి.[38]
జనాభా గణాంకాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 76,530 | — |
1881 | 84,449 | +10.3% |
1891 | 90,609 | +7.3% |
1901 | 1,04,721 | +15.6% |
1911 | 1,23,512 | +17.9% |
1921 | 1,20,422 | −2.5% |
1931 | 1,42,843 | +18.6% |
1941 | 1,59,566 | +11.7% |
1951 | 2,18,921 | +37.2% |
1961 | 2,49,862 | +14.1% |
1971 | 3,07,400 | +23.0% |
1981 | 3,62,045 | +17.8% |
1991 | 3,87,223 | +7.0% |
2001 | 7,52,066 | +94.2% |
2011 | 9,16,857 | +21.9% |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరుచిరాపల్లి నగర జనాభా 8,47,387 ఉంది, మొత్తం జనాభాలో 9.4% మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 2,14,529 కుటుంబాల నివాసగృహాలు ఉన్నాయి. జన సాంద్రత 5,768/చ.కి. (14,940/చ.మై.) ఉంది. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి 1,000 మంది స్త్రీలకు 975 మంది పురుషులు ఉన్నారు. తిరుచిరాపల్లి పట్టణ సమ్మేళనం 1,022,518 జనాభాను కలిగి ఉంది. 2011 నాటికి భారతదేశంలో జనాభా ప్రకారం 53వ స్థానంలో, తమిళనాడు రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరంగా ఉంది.
నగర సగటు అక్షరాస్యత రేటు 91.37%,ఇది జాతీయ సగటు 73.00% కంటే గణనీయంగా ఎక్కువ.[39] జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 10.48% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.27% మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 2,28,518 మంది ప్రజలు, దాదాపు 26.96% మంది నగరం లోని మురికివాడలో నివసిస్తున్నారు.[40]నగరానికి వివిధ కార్యకలాపాలకు రోజువారీ సందర్శించే జనాభా సుమారు 2,50,000 మందిగా అంచనా వేయబడింది. [41]
నగర జనాభాలో ప్రధానంగా హిందువులు ఉన్నారు. [42] ముస్లింలు దాదాపు ఇరవై శాతం మంది ఉన్నారు, [43] గణనీయమైన క్రైస్తవులు ఉన్నారు. సిక్కులు, జైనులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. [44] [45] తిరుచిరాపల్లిలోని రోమన్ కాథలిక్కులు తిరుచిరాపల్లి రోమన్ క్యాథలిక్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు. అయితే ప్రొటెస్టంట్లు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రిచీ-తంజోర్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు. [46] [47]
అత్యధికంగా మాట్లాడే భాష తమిళం, [48] అయితే గణనీయమైన సంఖ్యలో తెలుగు, [49] గుజరాతీ, [50] కన్నడ, [51] మలయాళం [52] హిందీ మాట్లాడేవారు ఉన్నారు. [53] సౌరాష్ట్రను కొన్ని ముఖ్యమైన మైనారిటీలు మాట్లాడతారు. [54] తమిళం మాట్లాడే ప్రామాణిక మాండలికం మధ్యమిళ మాండలికం . [55] [56] గణనీయమైన సంఖ్యలో ఆంగ్లో-ఇండియన్లు, [c] శ్రీలంక తమిళ వలసదారులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది నగర శివార్లలోని శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. [59] [60]
మూలాలు
[మార్చు]- ↑ "Tiruchirapalli population in 2011 - Census India 2011".
- ↑ "About City Municipal Corporation - Tiruchirappalli City Municipal Corporation - E-Services Portal". Trichycorporation.gov.in. 2022-09-22. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-08.
- ↑ "About City Municipal Corporation - Tiruchirappalli City Municipal Corporation - E-Services Portal". Trichycorporation.gov.in. 2022-09-22. Archived from the original on 2022-10-06. Retrieved 2022-10-08.
- ↑ "Who's Who | TIRUCHIRAPPALLI DISTRICT , Govt. Of Tamil Nadu | India".
- ↑ "Primary Census Abstract – Urban Agglomeration". Registrar General and Census Commissioner of India. Archived from the original (XLS) on 15 March 2016. Retrieved 13 October 2015.
- ↑ Karthik, Deepak (13 August 2018). "Trichy ranked 12th in liveable cities ranking, best in Tamil Nadu". Times of India. Archived from the original on 2 February 2019. Retrieved 21 December 2020.
- ↑ "Live Chennai: The safest cities for women in India: Chennai & Coimbatore,safest cities for women in India,Chennai,Coimbatore". www.livechennai.com. Archived from the original on 20 May 2021. Retrieved 21 December 2020.
- ↑ Abram 2003, p. 489.
- ↑ 9.0 9.1 9.2 Rajendran, Arumugam & Chandrasekaran 2002, p. 3.
- ↑ Superintendent Census Operations 1966, p. 215.
- ↑ Ayyar 1920, p. 453.
- ↑ Jaques 2007, p. 1025.
- ↑ Brayley-Hodgetts 2008, p. 216.
- ↑ Ludden 2004, p. 178.
- ↑ Thani Nayagam 1957, p. 324.
- ↑ Sastri 1935, p. 22.
- ↑ Sastri 1935, p. 19.
- ↑ Beck 2006, p. 40.
- ↑ Caldwell 1881, p. 25.
- ↑ Pujari, Kolhe & Kumar 2006, p. 102.
- ↑ Ingram 1995, pp. 5–27.
- ↑ Ramachandran 2008, p. 74.
- ↑ Moore 1878, p. 178.
- ↑ Burn & Cotton 1908, p. 43.
- ↑ Yule & Burnell 1903, p. 938.
- ↑ Ramakrishnan, Deepa H. (23 September 2006). "Destination Puducherry". The Hindu. Archived from the original on 31 December 2013. Retrieved 29 December 2013.
- ↑ Muthiah, S. (9 May 2010). "The railway of the Deep South". The Hindu. Archived from the original on 7 October 2013. Retrieved 16 August 2013.
- ↑ Zaidi 1973, p. 101.
- ↑ South Indian Railway Strike 1928.
- ↑ Rengarajan, La. Su. (10 April 2005). "Marathon march". The Hindu. Archived from the original on 7 October 2013. Retrieved 16 August 2013.
- ↑ "First anti-Hindi agitation remembered". The Hindu. 2 August 2012. Archived from the original on 2 December 2013. Retrieved 21 November 2013.
- ↑ Baliga 1999, p. 244.
- ↑ Rasam 1997, p. 98.
- ↑ Rao 1974, p. 193.
- ↑ Bala 1986, p. 148.
- ↑ Iyer, Aruna V.; Sridhar, Asha V. (9 April 2011). "City of choice". The Hindu. Archived from the original on 31 August 2011. Retrieved 11 May 2011.
- ↑ 37.0 37.1 Mayilvaganan, V. (11 May 2009). "Residents see development, price rise as major election issues". The Times of India. Archived from the original on 6 October 2013. Retrieved 16 August 2013.
- ↑ Muthiah, S. (22 May 2011). "Madras Miscellany". The Hindu. Archived from the original on 6 October 2013. Retrieved 16 August 2013.
- ↑ "Chapter–3 (Literates and Literacy Rate)" (PDF). Registrar General and Census Commissioner of India. Archived (PDF) from the original on 13 November 2013. Retrieved 25 January 2014.
- ↑ "Primary Census Abstract Data (Final Population)". Registrar General and Census Commissioner of India. Archived from the original on 8 February 2014. Retrieved 25 January 2014.
- ↑ "Waterless loos soon in major places in Trichy". The Times of India. 2 February 2012. Archived from the original on 4 October 2013. Retrieved 3 October 2013.
- ↑ Brill 1989, p. 144.
- ↑ "Hoping to add star power, BJP woos Rajinikanth ahead of Lok Sabha polls". The Times of India. 14 September 2013. Archived from the original on 4 October 2013. Retrieved 3 October 2013.
- ↑ "Lt. Governor felicitated". The Hindu. 29 December 2010. Archived from the original on 26 August 2011. Retrieved 11 May 2011.
- ↑ "Jain Sangh celebrates Mahaveer Jayanthi". The Hindu. 17 April 2011. Archived from the original on 23 April 2011. Retrieved 11 May 2011.
- ↑ "Diocese of Tiruchirapalli". Catholic-Hierarchy. Archived from the original on 7 February 2015. Retrieved 16 April 2015.
- ↑ "Provincial Directory: Trichy-Tanjore". Anglican Consultative Council. Archived from the original on 26 November 2011. Retrieved 11 May 2011.
- ↑ Sen 1991, p. 606.
- ↑ Ramappa & Singh 1984, p. 116.
- ↑ Sriram, V. (23 May 2012). "Gujaratis gave us this temple". The Hindu. Archived from the original on 29 October 2013. Retrieved 6 October 2013.
- ↑ Muthanna 1962, p. iii.
- ↑ "Trichy defers Onam to Oct". The Times of India. 29 August 2012. Archived from the original on 5 October 2013. Retrieved 3 October 2013.
- ↑ Paranjape 2009, p. 87.
- ↑ Thurston 1913, p. 123.
- ↑ Steever 2003, p. 101.
- ↑ "Language Variation in Tamil". Language Information Service. Archived from the original on 23 July 2011. Retrieved 12 May 2011.
- ↑ Deefholts & Acharya 2006, p. 205.
- ↑ Rajendran, Nuvena (16 December 2012). "Let them have cake!". The Times of India. Archived from the original on 4 October 2013. Retrieved 4 October 2013.
- ↑ "Narendra Modi to kick off PM campaign with Haryana rally today". Daily News and Analysis. 15 September 2013. Archived from the original on 2 December 2013. Retrieved 5 October 2013.
- ↑ "Sri Lankan Tamil refugees wish for Indian citizenship". The Hindu. 3 November 2009. Archived from the original on 5 October 2013. Retrieved 21 August 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;expansion
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Madras was renamed as Chennai in 1996.[26]
- ↑ The Anglo-Indians are present in significant numbers in and around all Southern Railway divisional headquarters where they are employed.[57][58]
వెలుపల లంకెలు
[మార్చు]