తూర్పు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎనిమిది దిక్కుల సూచిక.

తూర్పు (East) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించేసూర్యుడుకి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు కుడి వైపున ఉంటుంది. తూర్పు దిశను "పూర్వ దిశ" అని కూడా అంటారు. పడమర దిక్కు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.

భౌగోళిక విషయాలు

[మార్చు]

తూర్పుకు సంబంధించిన మరికొన్ని విషయాలు

[మార్చు]

తూర్పు పేరుతో ప్రసిద్ధి చెందినవి

[మార్చు]

పురాణాలలో/వాస్తు శాస్త్రంలో

[మార్చు]

అష్టదిక్పాలకులలో ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. ఇది సూర్యభగవానుడు ఉదయించే దిక్కు. తూర్పు వైపు శుభ్రంగా ఉంచి, తేలికైన వస్తువులు పెట్టడం తప్పనిసరి అని వాస్తు నియమం.

  • చదువుకొనే విద్యార్థులకు తూర్పు మంచి దిశ.
  • తూర్పు వైపు పూజగది కడితే చాలా శుభం.
  • నీటి కోసం బోర్ తూర్పు దిక్కులో వేస్తే అధిక ఫలం కలుగుతుంది. గౌరవాలు పెరుగుతాయి.
  • భవనం వాలు తూర్పుదిశగా ఉంటే సంపద, సమృద్ధి.
  • నీటి టాంకు భవనం పైన తూర్పు దిశగా కడితే పిల్లల చదువుపై చెడు ప్రభావం పడుతుంది.
  • వంట వండేటప్పుడు గృహిణి ముఖం తూర్పువైపు ఉన్నట్లయితే అరోగ్యప్రదం.
  • తూర్పు దిశలో గదిని పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది. మానసిక వికాసం కలుగుతుంది.
  • తూర్పువైపు స్టోర్ రూం., మెట్లు, శౌచాలయాలు కట్టరాదు.
  • తూర్పు దిక్కులో బరువైన సామాన్లు పెడితే దోషం పెరుగుతుంది. రకరకాల కష్టాలు వస్తాయి.