పూర్వచరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్ములపై చెక్కిన జంతుచిత్రాలు

పూర్వచరిత్ర (Prehistory)[1] అంటే మానవ చరిత్రలో సుమారు 33 లక్షల సంవత్సరాల క్రితం హోమోనిన్లు రాతి పనిముట్లు కనిపెట్టిన కాలం నుంచి లిఖిత సాంప్రదాయం ప్రారంభమై చరిత్రను రికార్డు చేయడం మొదలు పెట్టిన మధ్యకాలం. మానవ చరిత్రలో గుర్తులు, మచ్చలు, బొమ్మల వాడకం ఎన్నో సంవత్సరాల నుంచీ అందుబాటులో ఉన్నా, లిపి ఆనవాళ్ళు మాత్రం సుమారు 5200 సంవత్సరాల క్రితమే కనిపిస్తున్నాయి. సుమారు 19 వ శతాబ్దంలో ఈ లిపులు అన్ని సంస్కృతులకు విస్తృతంగా చేరువ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ పూర్వచరిత్ర ముగింపు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంది.

కంచుయుగం ప్రారంభంలో మెసొపొటేమియాలో వర్ధిల్లిన సుమేరు నాగరికత, సింధు లోయ నాగరికత, పురాతన ఈజిప్టు చరిత్రను దాచడానికి తమకోసమే ప్రత్యేకమైన లేఖనాన్ని రూపొందించుకున్నారు. తర్వాత వారి చుట్టుపక్కల నాగరికతలు కూడా వాటిని అనుసరించాయి. తర్వాత వచ్చిన ఇనుపయుగం నాటికి చాలావరకు నాగరికతల్లో పూర్వచరిత్రకు ముగింపు పడింది.

తనకంటూ ప్రత్యేకమైన లేఖనా పద్ధతులను ఏర్పరుచుకోని సంస్కృతుల గురించి ఇతరులు రాసిన చరిత్రను ప్రోటోహిస్టరీ అని వ్యవహరిస్తారు. నిర్వచనం ప్రకారం[2] మానవజాతి పూర్వచరిత్ర గురించి మనకు లిఖిత ఆధారాలు ఏమీ ఉండవు. వారు వాడిన పురాతన వస్తువులు, మానవ శిథిలాల ఆనవాళ్ళ ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోగలము. ఇంకా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చే జానపద గాథల ద్వారా కొంతవరకు తెలుసుకోవచ్చు. పూర్వ చరిత్ర ఆధారాలను పరిశీలించడంలో కీలకమైనది కాలనిర్ణయం (డేటింగ్). 19వ శతాబ్దం నుంచి కాలనిర్ణయం చేసేందుకు వాడే పద్ధతులు క్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి.[3] ఈ పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతి రేడియోకార్బన్ డేటింగ్.[4] పురాతన భాషలను పునర్నిర్మించడం ద్వారా కూడా ఆధారాలు సంపాదించవచ్చు. ఇంకా ఇటీవలి పద్ధతుల్లో పురాతన వస్తువులను రసాయన పరీక్షలకు గురిచేసి వాటిన వాడిన విధానం తెలుసుకోవడం, ఎముకలను జన్యు పరీక్షలకు గురిచేసి పూర్వీకుల సంబంధ బాంధవ్యాలను పరిశీలించడం మొదలైనవి ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. McCall, Daniel F.; Struever, Stuart; Van Der Merwe, Nicolaas J.; Roe, Derek (1973). "Prehistory as a Kind of History". Journal of Interdisciplinary History. 3 (4): 733–739. doi:10.2307/202691. JSTOR 202691.
  2. "Dictionary Entry". Archived from the original on 8 August 2017. Retrieved 8 August 2017.
  3. Graslund, Bo. 1987. The birth of prehistoric chronology. Cambridge:Cambridge University Press.
  4. "What is Carbon Dating? | University of Chicago News". news.uchicago.edu (in ఇంగ్లీష్). Retrieved 2024-10-21.