ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | ఐక్యరాజ్య సమితి |
జరుపుకొనే రోజు | అక్టోబరు 24 |
సంబంధిత పండుగ | ఐక్యరాజ్యసమితి దినోత్సవం |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం (ఆంగ్లం: World Development Information Day) ప్రతి సంవత్సరం అక్టోబరు 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచదేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]
చరిత్ర
[మార్చు]1972, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించిన తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది.
1972, మే 17న ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సమావేశం సమాచార వ్యాప్తికి, వాణిజ్య, అభివృద్ధి సమస్యలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సమీకరించటానికి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని 3038 (XXVII) గా పిలుస్తారు, దీనిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972, డిసెంబరు 19న ఆమోదించింది. అభివృద్ధి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ప్రవేశపెట్టాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం మొట్టమొదటసారిగా 1973, అక్టోబరు 24న జరుపబడింది.
లక్ష్యం
[మార్చు]ప్రతి సంవత్సరం అభివృద్ధి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాటి పరిష్కరానికి అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందించడం
కార్యక్రమాలు
[మార్చు]- వివిధ రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కావలసిన అవకాశాలు, నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేయడం
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, మెదక్ (24 October 2019). "ప్రగతి సాధనకు కావాలో శిక్షణ". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 24 October 2019. Retrieved 24 October 2019.