వాంకిడి మండలం
వాంకిడి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | వాంకిడి |
గ్రామాలు | 37 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,523 |
- పురుషులు | 17,724 |
- స్త్రీలు | 17,799 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.17% |
- పురుషులు | 49.38% |
- స్త్రీలు | 24.58% |
పిన్‌కోడ్ | 504295 |
వాంకిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో నిర్జన గ్రామాలు రెండు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 340 చ.కి.మీ. కాగా, జనాభా 35,523. జనాభాలో పురుషులు 17,724 కాగా, స్త్రీల సంఖ్య 17,799. మండలంలో 7,823 గృహాలున్నాయి.[3]
వ్యవసాయం, పంటలు
[మార్చు]మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]
మండల ప్రముఖులు
[మార్చు]- కొండా లక్ష్మణ్ బాపూజీ - ఈ మండలం వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.[5] 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు. తెలంగాణ ఉద్యమ నాయకుడు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ధాబా
- సావతి
- చిచ్‌పల్లి
- చౌపన్‌గూడ
- గుంజాడ
- సొనాపూర్
- మహాగావ్
- గోగావ్
- బంబర
- ఖేదేగావ్
- వెల్గి
- సర్కేపల్లి
- ఖమన
- జంబుల్‌ధారి
- కన్నెరగావ్
- కోమటిగూడ
- జైత్‌పూర్
- బంబార
- సామెల
- బోర్దా
- నార్లపూర్
- సరంది
- ఖిర్ది
- ఘాట్‌జనగావ్
- తేజాపూర్
- ఇంధని
- నావెగావ్
- చించోళి
- అర్లి
- లంజన్‌వీర
- వాంకిడి (ఖుర్ద్)
- నీంగావ్
- అకిని
- నుకెవాద (యుఐ)
- వాంకిడి (కలాన్)
గమనిక: నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137
- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40