విశాల్ భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాల్ భరద్వాజ్
2016లో విశాల్ భరద్వాజ్
జననం (1965-08-04) 1965 ఆగస్టు 4 (వయసు 59)
చాంద్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
వృత్తిచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిరేఖా భరద్వాజ్

విశాల్ భరద్వాజ్ (జననం 1965 ఆగస్టు 4)[1] ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. ఆయన హిందీ సినిమాల్లో స్క్రీన్ రైటర్, నిర్మాత, సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు కూడా. ఆయన ఏడు జాతీయ చలనచిత్ర అవార్డులను నాలుగు విభాగాలలో అందుకోవడం విశేషం.

1994లో బాలల చిత్రం అభయ్ (ది ఫియర్‌లెస్) తో సంగీత స్వరకర్తగా విశాల్ భరద్వాజ్ అరంగేట్రం చేశాడు. గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన మాచిస్ (1996)లోని అతని కంపోజిషన్‌లతో విస్తృత గుర్తింపు పొందాడు. ఆయనలోని సంగీత ప్రతిభకు ఫిల్మ్‌ఫేర్ ఆర్.డి బర్మన్ అవార్డును అందుకున్నాడు. సత్య (1998), గాడ్ మదర్ (1999) చిత్రాలకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందించాడు. దీంతో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును విశాల్ భరద్వాజ్ పొందాడు.

దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ మొదటి బాలల చిత్రం మక్డీ (2002). దీనికి అతను సంగీతం కూడా అందించాడు. విలియం షేక్స్పియర్ మూడు విషాదాల అనుసరణలను విశాల్ భరద్వాజ్ రాసి, దర్శకత్వం వహించినందుకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. అవి మక్‌బెత్ నుండి మక్బూల్ (2003), ఒథెల్లో నుండి ఓంకార (2006), హామ్లెట్ నుండి హైదర్ (2014). ఆయన యాక్షన్ చిత్రం కమీనీ, బ్లాక్ కామెడీ 7 ఖూన్ మాఫ్ (2011), వ్యంగ్య చిత్రం మాతృ కి బిజిలీ కా మండోలా (2013)కి కూడా దర్శకత్వం వహించాడు. తన విబి పిక్చర్స్ బ్యానర్‌పై ఇష్కియా (2010), దాని సీక్వెల్ దేద్ ఇష్కియా (2014), క్రైమ్ డ్రామా తల్వార్ (2015) చిత్రాలను నిర్మించాడు. ఈ చిత్రాలకు సహ-రచయిత కూడా. తన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు సంగీతం సమకూర్చడం, తరచూ గీత రచయిత గుల్జార్‌తో కలిసి పని చేయడం ఆవవాయితీ. అతను నేపథ్య గాయని రేఖా భరద్వాజ్‌ని వివాహం చేసుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విశాల్ భరద్వాజ్ 1965 ఆగస్టు 4న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ లో జన్మించాడు. అతని తల్లి సత్య భరద్వాజ్ గృహిణి, తండ్రి రామ్ భరద్వాజ్ ప్రభుత్వ ఉద్యోగి. అంతేకాకుండా రామ్ భరద్వాజ్ హిందీ చిత్రాలకు కవిత్వం, సాహిత్యం కూడా రాశాడు.

నజీబాబాద్‌లోని పాఠశాలలో విశాల్ భరద్వాజ్ ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత వారి కుటుంబం మీరట్‌కు మారింది. అక్కడ అతను రాష్ట్ర అండర్-19 జట్టు కోసం క్రికెట్ ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. Sonar, Mamta (4 August 2017). "Vishal Bhardwaj birthday special: His films, views and upcoming projects". The Free Press Journal. Retrieved 7 August 2018.