సామాజిక శాస్త్రం
సామాజిక శాస్త్రం (సోషియాలజీ) అంటే మానవ సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఇందులో సమాజం, సమాజంలో మానవుల ప్రవర్తన, సామాజిక సంబంధాల సరళి, దైనందిన జీవితానికి సంబంధించిన సంస్కృతిని గురించి అధ్యయనం చేస్తారు.[1][2][3] ఇది సాంఘిక శాస్త్రం, మానవీయ శాస్త్రంలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. ఈ శాస్త్రం సామాజిక క్రమం, సామాజిక మార్పు గురించి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి అనుభవపూర్వకమైన పరిశోధన, విమర్శనాత్మక విశ్లేషణలోని వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది.
సామాజిక శాస్త్ర విషయాలలో పరస్పర వ్యక్తిగత చర్య లాంటి సూక్ష్మ-స్థాయి విశ్లేషణల నుండి సామాజిక వ్యవస్థలు, సామాజిక నిర్మాణం యొక్క స్థూల-స్థాయి విశ్లేషణల వరకు ఉంటుంది. అనువర్తిత సామాజిక పరిశోధన నేరుగా సామాజిక విధానం, సంక్షేమానికి వర్తింపజేయవచ్చు. అయితే సైద్ధాంతిక విధానాలు సామాజిక ప్రక్రియలు, దృగ్విషయ పద్ధతిని అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "sociology". Retrieved 20 April 2020.
- ↑ Dictionary of the Social Sciences (2008) [2002]. Calhoun, Craig (ed.). "Sociology". New York: Oxford University Press – via American Sociological Association.
- ↑ "Sociology: A 21st Century Major" (PDF). Colgate University. American Sociological Association. Archived from the original (PDF) on 18 October 2017. Retrieved 19 July 2017.