సిరిమావో బండారనాయకే
సిరిమావో బండారు నాయకే | |||
| |||
పదవీ కాలం 14 నవంబరు 1994 – 10 ఆగస్టు 2000 | |||
రాష్ట్రపతి | చంద్రికా కుమారతుంగ | ||
---|---|---|---|
ముందు | చంద్రికా కుమారతుంగ | ||
తరువాత | రత్నగిరి విక్రమసింఘే | ||
పదవీ కాలం 22 మే1972 – 23 జూలై 1977 | |||
అధ్యక్షుడు | విలియం గోపాల్వ | ||
ముందు | Position established | ||
తరువాత | జూనియస్ జయవర్ధనే | ||
పదవీ కాలం 29 మే1970 – 22 మే1972 | |||
చక్రవర్తి | ఎలిజబెత్ II | ||
Governor General | విలియం గోపాల్వ | ||
ముందు | డుడ్లే సేనానాయకే | ||
తరువాత | Position abolished | ||
పదవీ కాలం 21 మే1960 – 27 మార్చి1965 | |||
చక్రవర్తి | ఎలిజబెత్ II | ||
Governor General | అలివర్ గూనేటిల్లికే విలియం గోపాల్వ | ||
ముందు | డుడ్లే సేనానాయకే | ||
తరువాత | డుడ్లే సేనానాయకే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | m:en:British Ceylon | 1916 ఏప్రిల్ 17||
మరణం | 2000 అక్టోబరు 10 కొలంబో, శ్రీలంక | (వయసు 84)||
రాజకీయ పార్టీ | శ్రీలంక ఫ్రీడం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సొలోమన్ బండారు నాయకే (1940–1959) | ||
సంతానం | సునేత్ర, చంద్రిక, అనుర | ||
మతం | తీరవాద బుద్దిజం |
సిరిమావో బండారు నాయకే (సింహళ భాషසිරිමාවෝ රත්වත්තේ ඩයස් බණ්ඩාරනායක, (తమిళం: சிறிமாவோ ரத்வத்த டயஸ் பண்டாரநாயக்க) ; (జ :1916 ఏప్రిల్ 17 – మ :10 అక్టొబరు 2000) శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. మూడుసార్లు 1960–65, 1970–77, 1994–2000 లలో శ్రీలంక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు.
నేపధ్యము
[మార్చు]1916 ఏప్రిల్ 17 న శ్రీలంక లోని రాడాల కుటుంబంలో ఆరవ సంతానంగా జన్మించింది. ఈవిడ అసలుపేరు సిరిమావో రత్వత్తే. తండ్రి రత్వత్తే డిసిల్వా, తల్లి రోజలిండ్ మహావేళట్టనే కుమారిహామి. ఈవిడకు నలుగురు సోదరులు మరియొ ఒక సోదరి. ఈవిడ బౌద్ధ మతారాధకురాలు. విద్యభ్యాసంమంతా కొలంబో లోని సెయింట్ బ్రిడ్‌జెట్స్ కాన్వెంట్ లో జరిగింది. 1940 లో ఈమె వివాహము శ్రీలంక రాజ్యసమితి సభ్యుడు, శ్రీలంక గవర్నరు ముఖ్య స్థానిక సలహాదారు సర్ సాలోమన్ డయస్ బండారు నాయకే కుమారుడు అయిన సాలోమన్ వెస్ట్ రిడ్జ్వే డయాస్ బండారు నాయకేతో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు చంద్రిక, సునేత్ర మరియుఅనుర.