స్టాన్ స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టాన్ స్వామి
జననం
స్టాన్సిస్ లౌర్దుస్వామి

(1937-04-26)1937 ఏప్రిల్ 26
మరణం2021 జూలై 5(2021-07-05) (వయసు 84)
క్రియాశీల సంవత్సరాలు1978–2021
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గిరిజన హక్కుల కార్యకర్త

స్టాన్సిస్ లౌర్దుస్వామి (1937 ఏప్రిల్ 26- 2021 జులై 5) స్టాన్ స్వామిగా జనాదరణ పొందిన ఇతను భారతదేశానికి చెందిన గిరిజన హక్కుల కార్యకర్త, రోమన్ కాథలిక్ పూజారి.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

స్వామి తమిళనాడు లోని తిరుచి జిల్లాలో 1937 ఏప్రిల్ 26న జన్మించాడు. 1970 లో ఫిలిపైన్స్ లో సమాజశాస్త్రం(sociology) చదివే సమయంలో ఇతను వేదాంత శాస్త్రం (theology) పై పట్టు సాధించాడు. తాను ఫిలిపైన్స్ లో చదువుకునే రోజుల్లో అక్కడ పరిపాలన పై జరిగే విప్లవాలను అవగాహన చేసుకున్నాడు.[2]

కార్యకలాపాలు

[మార్చు]

బెంగుళూరులో 1975 నుండి 1986 వరకు జెస్యూట్ నిర్వహిస్తున్న భారత సామాజిక సంస్థకు స్వామి డైరెక్టర్గా ఉన్నాడు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లోని నిబంధనలను అమలు చేయకపోవడాన్ని ఇతను గళమెత్తాడు, ఈ షెడ్యూల్ ప్రకారం దేశంలో గిరిజనుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం గిరిజన సభ్యులతో "గిరిజన సలహా కమిటీ" ఏర్పాటు చేయాలని తీర్మానించబడి ఉంది. 1996 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజన గ్రామ పంచాయితీ విస్తరణ చట్టం (PESA) ఎందుకు నిలిపివేయబడిందని కూడా ఇతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

అరెస్టు

[మార్చు]

2020అక్టోబరు 8న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) స్వామీ మావోయిస్టు కార్యకలాపాలకు సహకారాలు అందిస్తున్నాడన్న ఆరోపణతో అతన్ని అరెస్టు చేసింది. రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నాడని కేసు నమోదు చేసింది. స్వామీ అరెస్టు దేశంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. దేశంలోని చాల కాథలిక్ సంఘాలు, అయన అధ్యక్షత వహించిన జెస్యూట్ సంస్థకు చెందిన వారు నిరసనలు చేపట్టారు. 2020 అక్టోబరు 21న జాతీయ నాయకులైన శశి థరూర్, సీతారాం ఏచూరి, సుప్రియ సులే, డి.రాజా స్వామిని విడుదల చేయాలని పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అలాగే కేరళ ముఖ్యమంత్రి పినారయి విజయన్ స్వామీ అరెస్టు ఖండించారు.

2020 నవంబరు 6న స్వామీ పార్కిన్సన్స్ వ్యాధి కారంగా చూపుతూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయినా న్యాయస్థానం ఈయన బెయిల్ను పలు సార్లు నిరాకరించింది.[3]

మరణం

[మార్చు]

స్వామి పార్కిన్సన్స్ వ్యాధి ఇంకా ఇతర వయస్సు సంబంధిత అనారోగ్యాలతో బాధపడ్డాడు. జైలులో ఉన్నప్పుడు రెండు చెవులలో వినికిడి లోపంతో బాధపడ్డాడు, శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.

2021 మే 18న, బొంబాయి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో, జైలులో స్వామి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు లిఖించబడిఉంది. దీంతో స్వామిని పరీక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. 2021 మే 21న వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టుకు హాజరైనప్పుడు, స్వామి హాస్పిటల్ లేదా మరే ఇతర హాస్పిటల్‌లో అడ్మిట్ కావడానికి నిరాకరించారు. రాంచీలోని తన ఇంటికి వెళ్లడానికి తాత్కాలిక బెయిల్‌ని మాత్రమే అభ్యర్థించారు. 2021 మే 28న బాంబే హైకోర్టు స్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున, 15 రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతను ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ స్వామీకి కోవిడ్ సోకినట్టు ధ్రువీకరించారు.[4]

బొంబాయి హైకోర్టులో బెయిల్ విచారణకు ముందు 2021 జులై 5న మరణించాడు.[5][6][7]


మూలాలు

[మార్చు]
  1. "Petition for Fr Stanislaus Lourdusamy". Jesuits in Britain. Retrieved 11 October 2020.[permanent dead link]
  2. Thekaekara, Mari Marcel. "The Indomitable Spirit of Father Stan Swamy". The Wire. Retrieved 11 October 2020.
  3. Borges, Jane. "'He's a torchbearer of the Constitution' say father Stan Swamy's peers". Mid-Day. Retrieved 1 November 2020.
  4. Saigal, Sonam (30 May 2021). "Fr. Stan Swamy tests positive for COVID-19". The Hindu – via www.thehindu.com.
  5. "Fr. Stan Swamy passes away". The Hindu (in Indian English). Special Correspondent. 5 July 2021. ISSN 0971-751X. Retrieved 5 July 2021.{{cite news}}: CS1 maint: others (link)
  6. "Elgar Parishad Case: Activist Stan Swamy, 84, Passes Away Ahead of Hearing on Bail Plea". News18. 5 July 2021. Retrieved 5 July 2021.
  7. "Tribal activist Stan Swamy dies at 84". Scroll.in. 5 July 2021. Retrieved 5 July 2021.