అక్షాంశ రేఖాంశాలు: 22°34′58″N 88°20′34″E / 22.5828709°N 88.3428112°E / 22.5828709; 88.3428112

హౌరా జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హౌరా జంక్షన్ రైల్వే స్టేషను
Regional rail and Commuter rail station
హూగ్లీ నదినుంచి హౌరా స్టేషన్ విక్షణ
సాధారణ సమాచారం
Locationలొవర్ ఫర్‌షొర్ రొడ్డు, హౌరా - 711101 పశ్చిమ బెంగాల్
భారతదేశం
Coordinates22°34′58″N 88°20′34″E / 22.5828709°N 88.3428112°E / 22.5828709; 88.3428112
Elevation12 మీటర్లు (39 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుతూర్పు రైల్వే, ఆగ్నేయ రైల్వే
లైన్లుహౌరా-న్యూఢిల్లీ రైలు మార్గము
హౌరా-నాగ్పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు23
పట్టాలు25
ConnectionsBus interchange ferry/water interchange
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికము ( భూమి మీద స్టేషను )
పార్కింగ్కలదు
ఇతర సమాచారం
Statusవాడుకలో కలదు
స్టేషను కోడుHWH
డివిజన్లు హౌరా (ER)
History
Openedమూస:ప్రారంభం
విద్యుత్ లైను1954; 70 సంవత్సరాల క్రితం (1954)[1]
Previous namesEast Indian Railway Company
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా, కోల్‌కాతా ప్రజలకు  రైల్వే సేవలు అందిస్తోంది. హౌరా రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో ఉంది. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా, కోల్‌కాతా ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి, అవి సీయాల్దా, సంత్రగచ్చి, షాలిమార్, కోల్‌కాతా రైల్వే స్టేషన్లు.

చరిత్ర

[మార్చు]

1851 జూన్ లో ఈస్టు ఇండియా రైల్వే కంపెనికి  చీఫ్ ఇంజనీర్  జార్జ్ టర్న్ బుల్ హౌరా రైల్వే స్టేషనుకు సంబందించిన ఒక ప్లాన్ ను సమర్పించాడు.అయితే 1852 అక్టోబరు లో మొదలయిన ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం1854  నాటికి పూర్తయింది. 1901 లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలతో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసారు.అప్పటి బ్రిటీష్ వాస్తుశిల్పి హల్సీ రికార్డో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి రూపకల్పన చేసాడు. కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని 1905 డిసెంబరు 1 న ప్రారంభించారు. అప్పటి హౌరా రైల్వే స్టేషన్ 15 ప్లాట్‌ఫారములు కలిగివుండేది. 1980ల్లో హౌరా రైల్వే స్టేషన్ ను విస్తరిస్తూ మరొక 8 నూతన ప్లాట్‌ఫారములు నిర్మించారు.అదే సమయంలో పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలు తీర్చడానికి 'యాత్రి నివాశ్' నిర్మించారు. హౌరా రైల్వే స్టేషన్ ఉత్తరభాగం లో  రైల్వే మ్యూజియం ఉంది. అందులో తూర్పు  రైల్వే మండలానికి సంబందించిన అనేక చారిత్రిక వస్తువులు (కళాఖండాలు) కలవు. 

సేవలు

[మార్చు]

 తూర్పు రైల్వే హౌరా రైల్వే స్టేషన్  నుండి బేలూర్ మఠం, గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు, ఆగ్నేయ రైల్వే మేచెద, మిడ్నాపూర్, హల్దియా, తమ్లుక్, పస్కురా  ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే  మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు . 

మౌలిక సదుపాయాలు

[మార్చు]

హౌరా రైల్వే స్టేషన్లో తూర్పు రైల్వేజోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మొత్తం 23 కలిగిన ఈ హౌరా రైల్వే స్టేషన్లో '1'వ ప్లాట్‌ఫారముల నుండి '15'ప్లాట్‌ఫారములు టెర్మినల్ 1 లోను, టెర్మినల్ 2 లో 16 వ ప్లాట్‌ఫారముల నుండి 23 ప్లాట్‌ఫారములు కలవు . ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), రైలు విచారణ కౌంటర్లు, స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు కలవు .మొదటి తరగతి ప్రయాణికుల కొరకు శీతలికరణ గదులు ఉన్నాయి. టెర్మినల్ 2 లో ప్రయాణికుల వసతి కొరకు 'యాత్రి నివాశ్' ను నిర్మించారు. నాలుగు ప్రధాన మార్గాలు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను వద్ద అంతమవుతాయి. అవి

హౌరా రైల్వే స్టేషన్ లో డీజిల్ లోకో షెడ్ కలదు .ఇందులో మొత్తం 84 డీజిల్ లోకోమోటివ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో 96 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు ఉన్నాయి. హౌరా రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ ట్రిప్ షెడ్ కూడా కలదు .ఇందులో దాదాపుగా 20 విద్యుత్ లోకోమోటివ్లను వుంచవచ్చు. తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్, లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం-4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్లో 100 WAP-4 తరగతికి చెందిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లను నిర్వహించగలదు. ఈ రైల్వే స్టేషన్ లో మెమో రైళ్ళను నిలిపివుంచడానికి 15 విభాగాలు ఉన్నాయి.

హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు

[మార్చు]
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12703/04 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను హౌరా ప్రతిరోజూ
12839/40 హౌరా చెన్నై మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12841/42 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12863/64 హౌరా -యశ్వంతపూర్ జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
18645/46 ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్ ప్రతిరోజూ
12277/78 హౌరా - పూరీ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్|జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ హౌరా పూరీ ప్రతిరోజూ
12073/74 హౌరా - భుబనేశ్వర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్|జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ హౌరా భుబనేశ్వర్ ప్రతిరోజూ
12859/60 గీతాంజలి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ హౌరా ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై ప్రతిరోజూ
12809/10 హౌరా - ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై మెయిల్ / నాగ్పూర్ మీదుగా మెయిల్/సూపర్‌ఫాస్ట్ హౌరా ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై ప్రతిరోజూ
12321/22 హౌరా - ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై మెయిల్ / గయ మీదుగా సూపర్‌ఫాస్ట్ / మెయిల్ హౌరా ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై ప్రతిరోజూ
12261/62 హౌరా - ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ దురంతో ఎక్స్‌ప్రెస్ హౌరా ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం
12301/02 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా న్యూఢిల్లీ ఆదివారం తప్ప
12313/14 సీయాల్దా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సీయాల్దా న్యూఢిల్లీ ప్రతిరోజూ

మూలాలు

[మార్చు]
  1. "[IRFCA] Indian Railways FAQ: Electric Traction - I". Irfca.org. Retrieved 2012-06-13.