ఈ పుట ఆమోదించబడ్డది
విరాబాయి.
సంగ్రామే సుభటేంద్రాణాం కవీనాం కవిమండలే
దీప్తిర్వా దీప్తిహానిర్వా ముహుర్తాదేవ జాయతే. [1]
విరాబాయి చితూరు సంస్థానాధీశ్వరునిభార్య. ఈమె అక్బరుబాదుషాకాలమునం దుండిన ట్లితిహాసమువలనఁ దెలియుచున్నది. కాని యీమె జన్మమరణ సంవత్సరములును, జననీ జనకుల నామములును దెలియు మార్గ మెందును గానరాదు.
విరాబాయి స్వశౌర్యమువలన అక్బరు నోడించి తనభర్తను విడిపించెను. అక్బరుబాదుషా చితూరిపై రెండుపర్యాయములు దండెత్తినను ఫేరిస్తాయను ఇతిహాసకారుఁడు వ్రాసిన గ్రంథమునం దొకసారి దండువెడలుటయే వర్ణింపఁబడి యున్నది. స్వజాతీయుఁ డగు బాదుషాయొక్క పరాభవము నాతఁ డెట్లు వ్రాయఁ గలఁడు? ఒకానొకరజపూతస్త్రీచే నోడింపఁబడి పలాయితుఁ డైనందున బాదుషాకీర్తికి సంభవించిన కలంక మగుపడకుండుటకయి తురుష్కులైన యితిహాసకారు లెవ్వరును చరిత్రములలో నీసంగతి వ్రాయనేలేదు. కాని యాసమయ
- ↑ యుద్ధమునందు వీరుల శౌర్యాశౌర్యములును, కవి సంఘమునందు కవులయొక్క చాతుర్యా చతుర్యములును ఒకక్షణమాత్రములో వెల్లడి యగును.