ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు
27
ఆసక్తిఉన్న దేశీయులందరూ గౌరవ పురస్సరంగా ఆహ్వానించబడుతున్నారు.
మీ క్షేమాన్ని కాంక్షించే దేశీయుడు
సి.వి. రంగనాథశాస్త్రి
రెండో లేఖ
ఈ లేఖ 1865 ఆగష్టు 3వ తారీకు మద్రాస్ టైమ్స్‌లో వెంకన్నశాస్త్రి పేరు మీద ప్రచురించబడింది. మొదటి లేఖకు సమాధానంగా ఈ లేఖ రాయబడింది. పీఠాధిపతి సముఖంలో అనంతరామశాస్త్రి బాల్యవివాహాలకు శాస్త్రాల ఆమోదంలేదని, తనవాదం వినిపించినట్లుంది. ఆయన రచించిన 'వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్' అంతకు ముందుగానే ప్రచురించబడి పండితులకు అందుబాటులోకి వచ్చినట్లుంది. ఈ లేఖలో కొన్ని ముఖ్యమైన భాగాలను మాత్రం, అనువదించి వివరించడం జరుగుతూంది..
“పూజ్యులు శంకరాచార్యుల వద్ద అనంతరామశాస్త్రి ఈ కరపత్రాన్ని చదివినపుడు నేనక్కడే ఉన్నాను.20 అందులో వ్యక్తంచేయబడ్డ కొన్ని అభిప్రాయాలకు నేను అక్కడికక్కడే అభ్యంతరం చెప్పాను. ఆయన పట్టుపట్టడంవల్ల, ఆయన కోరినట్లుగానే, ఈ కరపత్రానికి సమాధానంగా మరొక కరపత్రం తయారు చేశాను. త్వరలో దీన్ని ప్రచురించి, స్వామివారి సన్నిధిలో పఠిస్తాను..
ముందుగా మీ దృష్టి ఈ క్రింది విషయాల మీద నిలిపి, శ్రద్దగా పరిశీలించమని అర్థిస్తున్నాను. అనంతరామశాస్త్రి వాదం పూర్తిగా మనుస్మృతి 9వ ప్రకరణంలో 28వ శ్లోకం, 10వ ప్రకరణంలో 3వ శ్లోకం - ఈ రెండు శ్లోకాల మీదే ఆధారపడి ఉంది. వీటికి అపార్ధంచెప్పి, లేదంటే, తన వాదానికి పనికివచ్చే అర్ధాన్ని బలవంతంగా రాబట్టి, ఆయన తన స్వరూపాన్ని, తన మిత్రుడు రంగనాథశాస్త్రి స్వరూపాన్ని బహిర్గతం చేశాడు. రంగనాథశాస్త్రి అపఖ్యాతిపాలయ్యే ఇటువంటి విషయాల జోలికి ఇంతకు ముందెప్పుడూ పోలేదు. ఇప్పుడు మాత్రం తనకు సహజ గుణమయిన వివేచనను కోల్పోయి, అనంతరామశాస్త్రితో కలిసి నిరర్ధకమైన సాహసానికి పూనుకొని అపహాస్యం పాలయ్యాడు.”
అనంతరామశాస్త్రి ఉదాహరించిన మనుస్మృతిలోని శ్లోకాలకు విలియం జోన్స్ (William Jones) అనువాదాన్నిచ్చి, అనంతరామశాస్త్రి మనువు అభిప్రాయానికి ఏ విధంగా అపార్ధాన్ని సృష్టించాడో వెంకన్నశాస్త్రి వివరించాడు. “ప్రస్తుతానికి మనుస్మృతికి పరిమితమయి మాట్లాడుతున్నాము. ఆనిషేధం లేకపోతే, బాల్యవివాహాలను సమర్ధించే రుషిప్రోక్తాలు, ఇతర ప్రమాణాలు చాలా ఉన్నాయి” అంటూ, తన వాదాన్ని, ప్రత్యర్థులవాదాన్ని చక్కగా బోధపరచుకొన్నారు కనుక నిర్ణయాన్ని సహృదయ పాఠకులకు విడిచిపెడుతున్నట్లు లేఖ ముగించాడు.
మూడో లేఖ