ఆర్టీసీ క్రాస్ రోడ్
ఆర్టీసీ క్రాస్ రోడ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°24′12″N 78°29′55″E / 17.403247°N 78.498641°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 020 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఆర్టీసీ క్రాస్ రోడ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఇదీ ఒకటి .
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో ముషీరాబాద్, చిక్కడపల్లి, అశోక్ నగర్, దోమల్ గూడ, వి.ఎస్.టి, వివేక్ నగర్, జవహర్ నగర్, శ్వేతా ఎన్క్లేవ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతం ప్రధానంగా సినిమా థియేటర్లకు పేరొందింది. తెలుగు సినిమాలు ఇక్కడి థియేటర్లలోనే విడుదలవుతాయి. సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం, శ్రీ మయూరి 70ఎంఎం, సుదర్శన్ 35ఎంఎం, దేవి 70ఎంఎం, సప్తగిరి 70ఎంఎం, ఉషా మయూరి 70 ఎంఎం, శ్రీ సాయిరాజా 70ఎంఎం, ఇతర సినిమా థియేటర్లు ఉన్నాయి.[2]
బావార్చి, ఆస్టోరియా వంటి హైదరాబాదీ రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ ను చార్మినార్ చౌరాస్తా అని కూడా అంటారు. ఇక్కడికి సమీపంలో వి.ఎస్.టి (వజీర్ సుల్తాన్ ఇండస్ట్రీస్) లో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ కంపెనీ ఉండడంవల్ల ఈ పేరు వచ్చింది.
ప్రార్థనా స్థలాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలోని సాయిబాబా దేవాలయం, పోచమ్మ దేవాలయం, దుర్గాదేవి దేవాలయం, మసీదు-ఎ-దావూద్ మియా దైరా, మసీదు ఇ అజామాబాద్ మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]ఇక్కడికి సమీపంలోని కరుణ పిజి కళాశాల, ఫెర్గూసన్ కళాశాల, సరోజిని నాయుడు జూనియర్ డిగ్రీ, & పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్యాటకం & మేనేజ్‌మెంట్, శ్రీ చైతన్య స్కూల్, మార్టినెట్ హైస్కూల్, పీపుల్స్ హైస్కూల్ మొదలైన విద్యాసంస్థలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా సికింద్రాబాదు, కోఠి, ఉప్పల్, కాచిగూడ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, బోరబండ, యూసఫ్‌గూడ, దిల్‍సుఖ్‍నగర్, జాబ్లీ బస్ స్టేషన్, తుకారాం గేట్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలోని విద్యానగర్, జామియా ఉస్మానియా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Rtc Cross Roads Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
- ↑ "Bahubali" for a landmark release in RTC X roads.[permanent dead link]
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.