అక్షాంశ రేఖాంశాలు: 41°14′13″N 96°06′59″W / 41.236833°N 96.116382°W / 41.236833; -96.116382

ఒమాహా హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒమాహా హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:నెబ్రాస్కా
ప్రదేశం:ఒమాహా
అక్షాంశ రేఖాంశాలు:41°14′13″N 96°06′59″W / 41.236833°N 96.116382°W / 41.236833; -96.116382

ఒమాహా హిందూ దేవాలయం, అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర రాజధాని ఒమాహాలో ఉన్న హిందూ దేవాలయం. ఒమాహా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని హిందూ భక్తులుగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ దేవాలయానికి చెందిన చాలామంది హిందూ సభ్యులు ఒమాహా ప్రాంతంలో మెడికల్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాలలో ఉన్నారు. వారిలో అనేకమంది నెబ్రాస్కా విశ్వవిద్యాలయం, క్రైటన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. సభ్య జనాభాలో 98% మంది భారతీయ సంతతికి చెందినవారు కాగా మిగిలిన 2% మంది నేపాలీలు ఉన్నారు.

చరిత్ర

[మార్చు]

1970ల నుండి, హిందువులు నెబ్రాస్కా-లింకన్, ఒమాహా విశ్వవిద్యాలయాలలో ఇంజనీరింగ్, మెడికల్ ఫీల్డ్స్‌లో చదవడానికి నెబ్రాస్కాకు వెళ్ళేవారు. హిందూ దేవాతారాధన కోసం వాళ్ళు కొందరి ఇళ్ళల్లో అనధికారిక సమావేశాలు జరుపుకునేవారు.

1993లో, వెస్ట్ ఒమాహాలో ఒక పాత ఇటాలియన్ రెస్టారెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత దాని స్థానంలో దేవాలయం నిర్మాణ ప్రణాళిక చేయబడింది.[1] 2004 ఆగస్టు 30న దేవాలయ నిర్మాణం పూర్తయింది, ప్రాణ్ పృష్ఠిష్ట కార్యక్రమం కూడా జరిగింది.[2] 2012లో సిక్కు దేవాలయంలో కాల్పులు జరిగినపుడు అక్కడి బాధితుల కోసం ఈ దేవాలయంలో పూజలు నిర్వహించబడ్డాయి.[3]

రూపకల్పన

[మార్చు]

పాడుబడిన ఇటాలియన్ రెస్టారెంట్‌ను కొనుగోలు చేసిన తరువాత దేవాలయాన్ని నిర్మించడానికి 11 మంది భారతీయ శిల్పులు నియమించబడ్డారు. దేవాలయ మొత్తం పునర్నిర్మాణం, శిల్పకళా ఖర్చులు $1.2 మిలియన్లు అయింది.[4] ఈ దేవాలయంలో హిందూ దేవతలతో అలంకరించబడిన అనేక స్తంభాలు, లోపలి ప్రధాన గర్భగుడిలో 2.5 టన్నుల వినాయకుడి విగ్రహాన్ని ఉన్నాయి.[5] ఫలహారశాల, లైబ్రరీ, తరగతి గది, యోగా కోసం గదులు, ప్రార్థనా మందిరం కూడా ఉన్నాయి.[6] ఇక్కడ ఆదివారం పాఠశాల తరగతులు నిర్వమించబడుతాయి.

స్వచ్ఛంద కార్యక్రమాలు

[మార్చు]

2001 గుజరాత్ భూకంపం సమయంలో భూకంప బాధితుల కోసం $35,000 సేకరించారు. ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు వార్షిక ఆరోగ్య శిబిరం నిర్వహిస్తోంది. హిందూధర్మం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.[7] 2019లో, మిస్సిస్సిప్పి నది వరదల కోసం $54,000 నిధులను సేకరించేందుకు హిందూ దేవాలయం మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించింది. హిందూ దేవాలయంలో జరిగిన వేడుకలో గవర్నర్ రికెట్స్‌కు చెక్కును కూడా అందించింది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Hindu Temple of Omaha NE". onlyinyourstate. Retrieved 2022-03-06.
  2. "Hindu Temple of Omaha, Nebraska". waymarking. Retrieved 2022-03-06.
  3. Squires, Lauren (6 August 2012). "Hindu Temple Holds Prayer For Peace". womt. Archived from the original on 2012-08-07. Retrieved 2022-03-06.
  4. "Omaha Restaurant Transformed Into Hindu Temple". Hinduismtoday. Retrieved 2022-03-06.[permanent dead link]
  5. Kelly, Michael (28 December 2017). "Kelly: Visit to striking Hindu Temple a first for many in Central's World Religions class; 'I've never seen anything like it in Omaha'". Omaha. Retrieved 2022-03-06.
  6. Reeves, Bob (28 March 2008). "Hindu convert a spiritual teacher at temple in Omaha". Retrieved 2022-03-06.
  7. "History". hindutemplenebraska. Retrieved 2022-03-06.
  8. Meadows, Danielle (28 August 2019). "India Association of Nebraska, Hindu Temple to donate $54,000 for flood relief". 3newsnow. Retrieved 2022-03-06.