అక్షాంశ రేఖాంశాలు: 9°35′41″N 76°29′08″E / 9.5947087°N 76.4855729°E / 9.5947087; 76.4855729

కొట్టాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kottayam
City
Top to bottom, left to right: MC Mathew memorial at Thirunakkara, Aksharashilpam, Immaculate Heart of Mary Cathedral, Kodimatha Boat Jetty, Kottayam Government Medical College, CMS College Kottayam
Top to bottom, left to right: MC Mathew memorial at Thirunakkara, Aksharashilpam, Immaculate Heart of Mary Cathedral, Kodimatha Boat Jetty, Kottayam Government Medical College, CMS College Kottayam
Kottayam is located in Kerala
Kottayam
Kottayam
Location in Kerala, India
Kottayam is located in India
Kottayam
Kottayam
Kottayam (India)
Coordinates: 9°35′41″N 76°29′08″E / 9.5947087°N 76.4855729°E / 9.5947087; 76.4855729
CountryIndia
రాష్ట్రంKerala
జిల్లాKottayam
RegionCentral Travancore
Incorporated1921
Official LanguageMalayalam
Native LanguageMalayalam
Government
 • TypeMunicipality
 • BodyKottayam Municipality
 • Municipal ChairpersonBincy Sebastian
విస్తీర్ణం
 • City77.8 కి.మీ2 (30.0 చ. మై)
 • Land134.51 కి.మీ2 (51.93 చ. మై)
 • Water3.09 కి.మీ2 (1.19 చ. మై)
 • Urban
157.6 కి.మీ2 (60.8 చ. మై)
 • Metro
200.83 కి.మీ2 (77.54 చ. మై)
 • Rank5
Elevation
3 మీ (10 అ.)
జనాభా
 • City1,36,812
 • జనసాంద్రత1,800/కి.మీ2 (4,600/చ. మై.)
 • Urban
1,82,927
 • Urban density1,200/కి.మీ2 (3,000/చ. మై.)
 • Metro
3,57,533
 • Metro density1,800/కి.మీ2 (4,600/చ. మై.)
DemonymKottayamkar
Time zoneUTC+౦5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
686 001
Telephone codeKottayam:0481
Vehicle registrationKL-05
Sex ratio1075 female(s)/1000 male(s)/ /
Literacy99.66 %
HDI0.831

కొట్టాయం, భారతదేశం, కేరళ రాష్ట్రం లోని ఒక నగరం. దీనికి తూర్పున పశ్చిమకనుమలు, పశ్చిమాన కుట్టనాడ్, వెంబనాడ్ సరస్సు ఉన్నాయి.[1] ఇది నైరుతి కేరళలో ఉన్న కొట్టాయం జిల్లా కేంద్రం. కొట్టాయం మీనాచిల్ నది పరీవాహక ప్రాంతంలో ఉంది. దీపిక , మలయాళ మనోరమ, మంగళం వంటి అనేక మొదటి మలయాళ దినపత్రికలు ఇక్కడనుండి ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు కొట్టాయంలో ఉన్నాయి. అందువలన కొట్టాయంను "ది సిటీ ఆఫ్ లెటర్స్" అని పిలుస్తారు.

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

తెక్కుంకూర్ పాలకుడి రాజభవనం తలియిల్కోట్ట అనే కోటచే రక్షించబడింది. కొట్టాయం అనే పేరు మలయాళ పదం కోట్ట అంటే కోట (తాలియిల్కోట్ట) అకం అంటే లోపల అనే పదాల కలయిక నుండి పుట్టిందని నమ్ముతారు. మిశ్రమ రూపం, కొట్టైక్కకం (కోటక్కకం), "కోట లోపల" అని అనువదించవచ్చు.[2][3][4]

చరిత్ర

[మార్చు]

తెక్కుంకూర్ పాలన (1103 -1753)

[మార్చు]

సా.శ. 9 శతాబ్దం ప్రారంభం నుండి, తెక్కుంకూర్, కొట్టాయం చరిత్ర వాస్తవంగా గుర్తించలేంది. కొట్టాయం అప్పుడు కులశేఖర సామ్రాజ్యం (సా.శ.. 800–1103) లోని వెంపోలినాడ్‌లో భాగంగా ఉంది).1103 నాటికి, వెంపోలినాడ్ రాజ్యం తెక్కుంకూర్, వడక్కుంకూర్ రాజ్యాలుగా విడిపోయాయి. తరువాతి కొచ్చిన్ సామంత రాజ్యంగా మారింది.[5][6]

రాయల్ రాజగృహం మొదట కొట్టాయం లోని వెన్నిమలలో ఉండేది.ఇది తాలియిల్‌కోట అని పిలువబడే ఒక కోటచే రక్షించబడింది.దాని ఫలితంగా ఈ ప్రాంతం, కోట వలె అదే పేరుతో పిలువబడింది. తరువాత, తెక్కుంకూర్ రాజులు తమ రాజధానిని కొట్టాయం పట్టణం శివార్లలోని కుమారనల్లూర్ సమీపంలోని నట్టస్సేరికి మార్చారు. తెక్కుంకూర్ రాజవంశం కొట్టాయంను తజ్తంగడి నుండి పాలించిందని నమ్ముతారు. ముంజనాడ్, తెక్కుంకూర్ పాలకులు ప్రస్తుత కొట్టాయం పట్టణంలోని తజతంగడిలో వారి ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్నారు. ట్రావెన్‌కోర్‌కు చెందిన మార్తాండ వర్మ తెక్కుంకూర్‌పై దాడి చేసి రాజభవనం, తాలియిల్ కోటను ధ్వంసం చేశాడు. రాజభవనాలు, కోటల అవశేషాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి.

పోర్చుగీస్, డచ్‌లు ఈ రెండు రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. నల్లమిరియాలు, ఇతర సుగంధద్రవ్యాలతో వాణిజ్యం ఏర్పరచుకున్నారు.1741 ట్రావెన్‌కోర్-డచ్ యుద్ధంలో ట్రావెన్‌కోర్ రాజ్యం, డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీని లొంగదీసుకున్న తరువాత, మార్తాండ వర్మ సైనిక కార్యకలాపాలు తెక్కుంకూర్‌తో సహా ఉత్తర పొరుగురాజ్యాలపై పురోగమించాయి.

ట్రావెన్‌కోర్ పాలన (1753 - 1949)

[మార్చు]

తెక్కుంకూర్ రాజ్యాన్ని రక్షించడానికి చెంపకస్సేరి, వడక్కుంకూర్‌లతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, అవన్నీ చివరకు ట్రావెన్‌కోర్‌లో విలీనమయ్యాయి.[7] తెక్కుంకూర్ పాలకుడు మొదట కాయంకుళం రాజ్యానికి, తరువాత ట్రావెన్‌కోర్‌కు వ్యతిరేకంగా అంబలపుజ్హ సంస్థాన పక్షం వహించాడని మరొక ఆధారం పేర్కొంది. అంబలపుజ్హ పతనం తరువాత, తెక్కుంకూర్ పాలకుడు ట్రావెన్‌కోర్‌తో ఒప్పందానికి నిరాకరించడంతో, అతని రాజధాని నగరాన్ని 1750 సెప్టెంబరు 11 న మార్తాండ వర్మ జనరల్, ప్రధాన మంత్రి రామయ్య దళవా స్వాధీనం చేసుకున్నాడు. సా.శ.1753 లో రాష్ట్రాన్ని ట్రావెన్‌కోర్‌లో విలీనం చేశారు.

సా.శ.19వ శతాబ్దం ప్రారంభంలో, ట్రావెన్‌కోర్ అన్యాయమైన ఒప్పందాల వరుస తర్వాత బ్రిటన్‌కు రక్షణగా మారింది.1817లో, చర్చి మిషనరీ సొసైటీ (సిఎంఎస్) కళాశాలను కేరళలో మొదటి పాశ్చాత్య శైలి కళాశాలగా స్థాపించింది. ప్రజా అధికారయంత్రాంగం నిర్వాహకులను అందించడాన్ని ట్రావెన్‌కోర్ ప్రభుత్వం స్వాగతించింది.[8]

వైకోమ్ సత్యాగ్రహంలో మహాత్మా గాంధీ

ఆధునిక కాలంలోని అన్నిరాజకీయ ఆందోళనల్లో కొట్టాయం తన పాత్రను పోషించింది. 'మలయాళీ మెమోరియల్' ఆందోళన కొట్టాయంలో పుట్టిందని చెప్పవచ్చు.మలయాళీ మెమోరియల్ ట్రావెన్‌కోర్ పౌర సేవలలో చదువుకున్న ట్రావెన్‌కోరియన్‌లకు బయటివ్యక్తులకు వ్యతిరేకంగా మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. మహారాజా శ్రీ మూలంతిరునాళ్ (1891)కి సమర్పించబడిన స్మారకచిహ్నం కొట్టాయం పబ్లిక్ లైబ్రరీలో జరిగిన బహిరంగ సభలో రూపొందించారు.ఈసంఘటన రాష్ట్రంలో ఆధునిక రాజకీయ ఉద్యమానికి నాంది పలికింది.[2]

ఇక్కడే ప్రసిద్ధ వైకోమ్ సత్యాగ్రహం (1924-25), అంటరానితనం నిర్మూలన కోసం ఒక పోరాటం జరిగింది.ట్రావెన్‌కోర్‌లోని షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులకు దేవాలయాలలోకి ప్రవేశం మాత్రమే కాకుండా, ఆలయ రహదారులకు కూడా ప్రవేశం నిరాకరించబడింది. వైకోమ్, ప్రసిద్ధ శివాలయం స్థానం.ఇది ప్రతీకాత్మక సత్యాగ్రహానికి వేదిక.[9] ఈ నిరసనల కారణంగా, మహారాజా చితిర తిరునాళ్ బలరామ వర్మ 1936లో ఆలయ ప్రవేశ ప్రకటనను జారీచేశాడు.

భారతీయ పాలన (1949 - ప్రస్తుతం)

[మార్చు]

కొట్టాయం ట్రావెన్‌కోర్‌లో ఆదాయవిభాగంగా మారింది. దేవికులం ఐదవ విభాగం స్వల్పకాలం ఉనికిలో ఉంది.కానీ తర్వాత కొట్టాయం జిల్లాలో చేరింది.1949లో ట్రావెన్‌కోర్, కొచ్చిన్ రాష్ట్రం విలీనం సమయంలో,ఈ ఆదాయవిభాగాలు జిల్లాలుగా ఏర్పడ్డాయి.1949 జూలైలో కొట్టాయం ఒక జిల్లాగాఏర్పడింది.[10]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

కొట్టాయం సముద్రమట్టానికి 3 మీటర్లు (9.8 అ.) సగటు ఎత్తులో ఉంది.[11] ఇది మీనాచిల్ నది పరీవాహక ప్రాంతంలో, ఇడుక్కి జిల్లాలోని పశ్చిమ కనుమలలోని అనేక ప్రవాహాల నుండి ఏర్పడిన వెంబనాడ్ వెనుకకు మరలిన జలాల తీరప్రాంతంలో ఉంది.ఈ నగరం మీనాచిల్ నది లోతట్టునదికి సమీపంలో ఉంది.ఇక్కడ అది కుమరకోమ్‌లోని వెంబనాడ్ సరస్సులో కలుస్తుంది. ఎత్తుల ఆధారంగా కేరళలోని స్థలాల విభజన ప్రకారం,కొట్టాయం ఒక మిడ్‌ల్యాండ్ ప్రాంతంగా వర్గీకరించారు.

జనాభా శాస్త్రం

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
190117,552—    
191115,141−13.7%
192118,833+24.4%
193125,236+34.0%
194133,364+32.2%
195144,204+32.5%
196152,685+19.2%
197159,714+13.3%
198164,431+7.9%
199189,625+39.1%
20011,29,894+44.9%
20111,72,878+33.1%

2011 జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం నగరంలో మొత్తం 14,366 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొట్టాయం మొత్తం జనాభా 55,374, అందులో 26,687 మంది పురుషులు కాగా, 28,687 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1,075.నగర మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4571. అందులో మగ పిల్లలు 2314 మంది ఉండగా, ఆడ పిల్లలు 2257 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 8% ఉంది. బాలల లింగ నిష్పత్తి 975, ఇది సగటు లింగ నిష్పత్తి (1,075) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 97.6%. దీనిని కొట్టాయం జిల్లా 97.2% అక్షరాస్యత రేటుతో పోల్చితే కొట్టాయం అక్షరాస్యత రేటు ఎక్కువ. కొట్టాయంలో పురుషుల అక్షరాస్యత రేటు 98.35%, స్త్రీల అక్షరాస్యత రేటు 96.94% ఉంది. కొట్టాయంలో మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జనాభా వరుసగా 6.73% , 0.31% మంది ఉన్నారు.[12] మొత్తం జనాభాలో 14,282 మంది పురుషులు, 5,457 మంది స్త్రీలతో సహా 19,739 మంది వ్యక్తులు పని లేదా వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం 19,739 మంది శ్రామిక జనాభాలో, 90.17% మంది ప్రధాన పనిలో నిమగ్నమై ఉండగా, మొత్తం కార్మికులలో 9.83% మంది ఉపాంత పనిలో నిమగ్నమై ఉన్నారు.[13]

చదువు

[మార్చు]

17వ శతాబ్దంలో కొట్టాయంలో డచ్ పాఠశాల స్థాపించారు. అది స్వల్పకాలం మాత్రమే సాగింది. కేరళలో మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల, భారతదేశంలో మొదటి కళాశాల,1817లో చర్చ్ మిషనరీ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ ద్వారా సిఎంస్ కళాశాలగా స్థాపించారు.[14] 1989లో 100% అక్షరాస్యతతో కొట్టాయం భారతదేశపు మొదటి పట్టణంగా మారింది.[15] ప్రభుత్వ వైద్య కళాశాల, కేరళలోని ప్రముఖ వైద్య కళాశాలల, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కొట్టాయంలో ఉన్నాయి. కొట్టాయంలో అనేక ఇతర కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పంపాడిలో ఉన్నాయి.

పాలన

[మార్చు]

శాసన సభ

[మార్చు]

1994లో కేరళ పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఏర్పడిన ఆరు పురపాలక సంఘాలలో కొట్టాయం పురపాలక సంఘం ఒకటి. కొట్టాయం పట్టణం, కొట్టాయం శాసనసభ నియోజకవర్గం, కొట్టాయం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

కార్యనిర్వాహక

[మార్చు]

కొట్టాయం జిల్లా కలెక్టరేట్ కొట్టాయం పట్టణంలో ఉంది.జిల్లా కోర్టుతో సహా అనేక జిల్లా పరిపాలనా కార్యాలయాలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాయి.

న్యాయవ్యవస్థ

[మార్చు]

భారతదేశ వివిధ రాష్ట్రాలకు దివాన్‌గా ఉన్న కల్నల్ జాన్ మున్రో పదవీకాలంలో ఐదు న్యాయ స్థానాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి కొట్టాయం జిల్లా వాయువ్య ప్రాంతంలోని వైకోమ్‌లో స్థాపించారు. కొట్టాయంలోని జిల్లా న్యాయ స్థానం 1910లో ట్రాన్వాన్‌కోర్ శ్రీ మూలం తిరునాళ్ మహారాజు కాలంలో స్థాపించారు. 2010లో న్యాయ స్థానం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. న్యాయవ్యవస్థ జిల్లా ప్రధాన కార్యాలయం కొట్టాయం పట్టణంలో ప్రధాన జిల్లా న్యాయ స్థానం పేరుతో పరిపాలనా కేంద్రం ఏర్పడింది.

రాజకీయం

[మార్చు]

కొట్టాయంలో భారత జాతీయ కాంగ్రెసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), భారతీయ జనతా పార్టీ , కేరళ కాంగ్రెసు పార్టీ క్రియాశీలకంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు. కార్మిక రంగంలో నిమగ్నమైన భారతీయ మజ్దూర్ సంఘ్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, అనుబంధ కార్మికులుగా కొట్టాయంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు ప్రాచుర్యం పొందాయి.

ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ , పీఆర్ సోనా. పురపాలక సంఘంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ), అత్యధిక సభ్యులను కలిగి ఉన్న పార్టీల పాలక కూటమి సారధ్యంలో పాలన సాగుతుంది..

కొట్టాయం నుండి ప్రస్తుత శాసనసభ సభ్యుడు తిరువాంచూర్ రాధాకృష్ణన్.[16] 2011 నుండి కొట్టాయం పట్టణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ శాసనసభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.[17]

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About Kottayam". Government of Kerala. 4 April 2020. Retrieved 10 April 2020.
  2. 2.0 2.1 "About Kottayam". Kottayam. 3 April 2020. Retrieved 9 April 2020.
  3. "Structure and functioning of Gramsabhas". 2010. Archived from the original on 10 June 2011. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/354/2/11_chapter4.pdf
  5. P. Shungoonny Menon - A HISTORY OF TRAVANCORE - First edition: 1878, New edition: 1983, Page 130, 131 - ISBN 978-8170200406
  6. K.N Gopala Pillai Kuruppum Veettil (1948). Thekkumkur Rani (Queen of Thekkumkur). The Hindustan Publishing House, Trivandrum, Publisher: Thomas George BA. pp. 224–. Retrieved 2 December 2019.
  7. A. Sreedhara Menon (1987). Political History of Modern Kerala. D C Books. pp. 140–. ISBN 978-81-264-2156-5. Retrieved 10 August 2012.
  8. "Setting standards of excellence: UGC recognition has added to CMS College's list of merits". The Hindu. 4 January 2005. Archived from the original on 15 March 2005. Retrieved 5 April 2010.
  9. "Kottayam". Government of Kerala. 3 April 2020. Retrieved 9 April 2020.
  10. "Kottayam District, Government of Kerala | Kottayam, the Land of Letters | India".
  11. "Kottayam Travel Guide: Useful information to visit Kottayam. 8 Reviews". Archived from the original on 2016-08-18. Retrieved 2023-05-29.
  12. "Kottayam Municipality City Population Census 2011-2021 | Kerala".
  13. "Kottayam Population, Caste Data Kottayam Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-29.
  14. "Setting standards of excellence: UGC recognition has added to CMS College's list of merits". The Hindu. 4 January 2005. Archived from the original on 15 March 2005. Retrieved 5 April 2010.
  15. "City of letters sets itself a new milestone".
  16. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies" (PDF). Kerala. Election Commission of India. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-10-19.
  17. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies" (PDF). Kerala. Election Commission of India. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-10-19.

వెలుపలి లంకెలు

[మార్చు]