గెడ్డాపు సత్యం
Jump to navigation
Jump to search
గెడ్డాపు సత్యం | |
---|---|
జననం | |
మరణం | 2015 జనవరి 8 | (వయసు 78)
మరణ కారణం | శ్వాసకోశ వ్యాధి |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు అధ్యాపకుడు |
ప్రభుత్వ డిగ్రీ కళాశాల | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పద్యకవి |
గుర్తించదగిన సేవలు |
|
పిల్లలు | జి.లక్ష్మీప్రసాద్ |
తల్లిదండ్రులు |
|
గెడ్డాపు సత్యం ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.
జీవిత విశేషాలు
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.
సాహితీసేవ
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.
రచనలు
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
- మృత్యుంజయుడు
- జైత్రయాత్ర
- శివకేశవమ్
- ప్రసన్నధర్మము
- కవితా వైజయంతి
- శ్రీ వేణుగోపబాల శతకము
- త్రికుటేశ్వర సుప్రభాతం మొదలైనవి.
మరణం
[మార్చు]వీరు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్వాసకోశ వ్యాధితో జనవరి 8, 2015న మరణించారు.[1]