చంద్రరేఖా విలాపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదాహరణ: చాలాసార్లు నిషేధించబడిన 18వ శతాబ్దపు బూతు పుస్తకం Fanny Hill: plate XI: The bathing party; La baignade)

చంద్రరేఖా విలాపం అనేది హాస్యరస బూతు ప్రబంధం. దీనిని 18వ శతాబ్దంలో పిఠాపురంకు చెందిన కూచిమంచి తిమ్మకవి తమ్ముడు కూచిమంచి జగ్గకవి వ్రాశాడు.[1] పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించారు. ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది.[2]

కవి పరిచయం

[మార్చు]

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దము తొలి భాగంలో పిఠాపురం ప్రాంతంలో ఉండేవాడు. ఇతని అన్న కూచిమంచి తిమ్మకవి. అతను కూడా ప్రసిద్ధుడే. జగ్గకవి రాసిన హాస్యరస ప్రబంధం ఇది.

ప్రచురణ

[మార్చు]

ఈ కావ్యాన్ని 1922లో పుదుచ్ఛేరి నుండి "కామ గ్రంథమాల" వారు ప్రచురించారు. దీనికి ఎస్.చిన్నయ్య గారు సంపాదకులుగా ఉన్నారు. 1922లో ఇది మొదటి సారి ప్రచురించబడినా తరువాత దీనిని ఎవరూ ప్రచురించలేదు.

గ్రంథ విశేషాలు

[మార్చు]

తెలుగులో విశిష్టమైన ప్రబంధం ఇది. రచనా పద్ధతి ప్రబంధాల వలెనే నడుస్తున్నా, ఇందులోని భాషా, వర్ణనా సంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేసిన హాస్య రస ప్రబంధం ఇది. ఈ కావ్యంలో కవి ఈ రచనకు ఎలా అంకురార్పణ జరిగిందో వివరించాడు.

ఒక కావ్యాన్ని మొదట తన సంప్రదాయ పద్ధతిలో రాసి, అంకితం తీసుకుంటానని వాగ్దానం చేసిన చింతలపాటి నీలాద్రిరాజు తీరా ఆ ప్రబంధం రచన జరిగిన తరువాత చేతిలో డబ్బులు లేవని, తీసుకొనలేనని చెప్పాడు. అంతే కాక వాటి వల్ల ఏమీ ఉపయోగం కలగడం లేదనీ, డబ్బు ఖర్చు లేకుండా తన గురించి, తను ఉంచుకున్న వేశ్య చంద్రరేఖ గురించి, ఓ హాస్య ప్రబంధం రాయమని సలహా కూడా ఇచ్చాడు. అంతకు ముందు ఆడిమళ్ళ వెంకట శాస్త్రులు అతనికి ఒక ప్రబంధాన్ని అంకితం ఇచ్చాడు. చంద్రరేఖ ఆ వేంకటశాస్త్రులు ఉంచుకున్న వేశ్య కటకపు వేంకటసాని కూతురు. బహుశా వీటన్నిటి కారణంగా జగ్గకవి, తనకు నీలాద్రిరాజు డబ్బివ్వకపోవడానికి ముఖ్య కారకుడు ఆ వేంకటశాస్త్రి అని నమ్మినట్లు కనబడుతుంది.

నీలాద్రి రాజునీ, చంద్రరేఖనీ, వేంకటశాస్త్రుల్నీ, వేంకట సానినీ గలగలిపి చండాలంగా బండబూతులు తిడుతూ జగ్గకవి ఈ గ్రంథాన్ని రాసాడు. [3]

ఇతర విశేషాలు

[మార్చు]

వెలుదండ నిత్యానందరావు ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న ఈ ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/11 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-04-03.
  2. "Chandra Rekha Vilapam - [PDF Document]". vdocuments.mx (in సంస్కృతం). Retrieved 2021-04-03.[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-12. Retrieved 2021-04-03.
  4. "తెలుగు సంశోధన సామ్రాట్టు | దర్వాజ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2019-10-25. Retrieved 2021-04-03.

బాహ్య లంకెలు

[మార్చు]