జగత్ కిలాడీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగత్ కిలాడీలు
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.యన్. మూర్తి
తారాగణం యస్వీ రంగారావు,
వాణిశ్రీ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ ఫల్గుణ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 25 జూలై 1969
భాష తెలుగు

జగత్ కిలాడీలు 1969లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఫల్గుణా పిక్చర్స్ పతాకంపై పి. ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐ.యన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, యస్వీ రంగారావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ మరియు సంభాషణలను ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ రాశారు.

చిత్రకథ

[మార్చు]

జమీందారు రాజారావు (కాశీనాథ తాత) తన భార్య శ్యామలాదేవి (జి. వరలక్ష్మి) మరియు కుమారుడు ఆనంద్ (కృష్ణ)తో పాటు జీవిస్తుంటాడు. ఆనంద్ విదేశాల్లో ఉంటాడు. వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతులు, కొడుకు ఆనంద్‌కు మాత్రమే తెలుసు. ఆ పట్టణంలో భయంకరమైన దోపిడీదొంగ భయంకర్ (రావు గోపాలరావు) ఆ నిధిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో, భయంకర్ జమీందారును హత్య చేసి, ఆయన భార్యను గుహలో బంధిస్తాడు. భయంకర్ ఆచూకీ కోసం పోలీసు కమిషనర్ సిన్హా (గుమ్మడి) అన్వేషిస్తుంటాడు.

తండ్రి మరణంతో విదేశాల నుంచి వచ్చిన ఆనంద్, తల్లి ఆచూకీ కోసం భయంకర్‌ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు. ఆనంద్ పోలీసు కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. సిన్హా తల్లి భారతీదేవి (మాలతీ) మరియు చెల్లెలు శాంతి (వాణిశ్రీ) అతనికి సహాయం చేస్తారు. ఈ క్రమంలో, శాంతి - ఆనంద్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది.

అదే పట్టణంలో ఉన్న రౌడీ గంగులు (ఎస్. వి. రంగారావు) భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటాడు. కథ అనేక మలుపులు తిరుగుతూ చివరికి భయంకర్ పోలీసు కమిషనర్ సిన్హాను హత్యచేసి, అతని స్థానంలో సిన్హాగా మారిన సంగతి తెలియజేస్తుంది. రౌడీగంగులు సెంట్రల్ సిఐడి గంగారామ్‌గా మారిన రహస్యం బయటపడుతుంది. భయంకర్, అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరగా, ఆనంద్, సిఐడి గంగారామ్‌లకు అభినందనలు, శాంతి - ఆనంద్‌ల వివాహంతో చిత్రం సుఖాంతం అవుతుంది.

నటీనటులు

[మార్చు]
  • కాశీనాథ్ తాతా
  • జి.వరలక్ష్మి
  • కృష్ణ
  • రావు గోపాలరావు
  • గుమ్మడి
  • వాణిశ్రీ
  • ఎస్.వి.రంగారావు
  • రాజ్‌బాబు
  • బాలకృష్ణ
  • అర్జా జనార్ధనరావు
  • డాక్టర్ శివరామకృష్ణయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, మాటలు : విశ్వప్రసాద్
  • సంగీతం: ఎస్‌పి కోదండపాణి
  • నృత్యం: ఐసి తంగరాజ్, రాజ్‌కుమార్
  • కళ: బిఎన్ కృష్ణ
  • ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం
  • స్టంట్స్: మాధవన్
  • ఛాయాగ్రహణం: కన్నప్ప
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
  • నిర్మాతలు: పి ఏకామ్రేశ్వర రావు, కె రాఘవ

పాటలు

[మార్చు]

సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. "ఎగిరే పావురమా/ దిగులెరగని పావురమా" వంటి పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. వాణిశ్రీ మరియు కృష్ణపై చిత్రీకరించిన ఈ పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తుంది.[1]

  1. ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా - పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. ఎక్కడన్నా బావా అంటే ఒప్పు - ఎస్.పి. బాలు, విజయ లక్ష్మి, కన్నా రావు, రచన: కొసరాజు
  3. కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ఒకరు - పి.సుశీల - రచన: కొసరాజు
  4. వేళచూస్తే సందెవేళ గాలి వీస్తే పైరగాలి ఏల- పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లిదేవులపల్లి
  5. నాఅందం నాచందం , ఎల్ ఆర్ ఈశ్వరి రచన: విశ్వప్రసాద్.

ప్రేక్షకాభిమానం

[మార్చు]

యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన కృష్ణ ఈ చిత్రంలో ఆనంద్ పాత్రలో నటించి మెప్పించాడు. వాణిశ్రీ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఎస్. వి. రంగారావు, గుమ్మడి వంటి నటులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ చిత్రం విడుదలైన తరువాత సూపర్ హిట్ అయి, అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి. "ఫ్లాష్‌బ్యాక్ @50 జగత్ కిలాడీలు". 20 July 2019. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 13 September 2019.

బయటి లింకులు

[మార్చు]