జాతీయ రహదారి 275

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 275
275
National Highway 275
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 275
Vehicles_plying_on_Bengaluru_Mysuru_Expressway.jpg
మార్గ సమాచారం
పొడవు367 కి.మీ. (228 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరబెంగళూరు
Major intersections
జాబితా
పశ్చిమ చివరబంట్వాల్, కర్ణాటక
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకర్ణాటక
Major citiesబెంగళూరు, కెంగేరి, బిడడి, రామనగర, చన్నపట్నం, మద్దూరు, మాండ్య, శ్రీరంగపట్టణ, మైసూరు, హున్సూర్, పెరియపట్న, బైలకుప్పే, కుశలనగర్, మడికేరి, సుల్లియా, పుత్తూరు, బంట్వాల్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 48 ఎన్‌హెచ్ 73

జాతీయ రహదారి 275 (ఎన్‌హెచ్-275), బెంగళూరు-మంగళూరు ఎకనామిక్ కారిడార్ (EC-34) లో భాగం.[1] దీన్ని దీన్ని బెంగళూరు-మైసూరు యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా అంటారు. బెంగళూరు నుండి ప్రారంభమై మైసూరుకు 119 కి.మీ. (74 మై.) మార్గం 6-వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగాను, మైసూరు నుండి బిలికెరె (మడికేరి వైపు) వరకు 4-వరుసల దారి గానూ వెళ్ళిబంట్వాళ వద్ద ముగుస్తుంది.[2] ఈ రహదారి తీరప్రాంత నగరమైన మంగళూరును బెంగళూరుకు కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 75 (ఎన్‌హెచ్-75)కి బైపాస్ మార్గం కూడా. ఈ హైవేలోని బెంగళూరు నుండి మైసూరు వరకు ఉన్న భాగం 4 నుండి 10 వరుసలలకు అప్‌గ్రేడ్ చేసారు, ఇందులో 6-వరుసల విభాగం ఎలివేటెడ్ యాక్సెస్-నియంత్రిత క్యారేజ్‌వే కాగా, దీనికి రెండు వైపులా ఉన్న 2-వరుసల విభాగం, సర్వీస్ రోడ్లు. బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటల నుండి 75 నిమిషాలకు తగ్గినట్లు పేర్కొంది. [3]

హైవే నంబర్ మూలం గమ్యం ద్వారా పొడవు (కిమీ)
275 బంట్వాల్ బెంగళూరు మైసూరు 367

బెంగళూరు-మైసూరు భాగం

[మార్చు]
బెంగళూరు, మైసూరు మధ్య హైవే విభాగం

బెంగళూరు-మైసూరు యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్ వే 119 కి.మీ. (74 మై.) పొడవు, 10 లేన్లు, సుంకం వసూలు చేసే ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే. దీన్ని రెండు దశల్లో, ₹8,000 కోట్ల వ్యయంతో నిర్మించారు.[4] 56 కి.మీ. (35 మై.) లో మొదటి దశలో బెంగళూరు, నిడఘట్టలను కలపగా, 61 కి.మీ. (38 మై.) ల రెండవ దశలో నిడఘట్టను మైసూరును కలిపారు. ఈ 2018 ప్రాజెక్టుకు మార్చిలో శంకుస్థాపన చేశారు.[5]

ప్రాజెక్టు ప్రస్థానం

[మార్చు]
  • 2018 మార్చి: ప్రాజెక్టుకు శంకుస్థాపన.
  • 2018 ఏప్రిల్: భోపాల్‌కు చెందిన దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్‌కు దశ-1 కాంట్రాక్ట్ ఇవ్వబడింది.
  • 2021 డిసెంబరు: దశ-1 పనులు 83% వరకు పూర్తయ్యాయి. దశ II 73% వరకు పూర్తయింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే 2022 అక్టోబరు నాటికి అందుబాటులోకి వస్తుందని అప్పట్లో అంచనా వేసారు.[6]
  • 2023 మార్చి: ఎక్స్‌ప్రెస్‌వే విభాగాన్ని 2023 మార్చి 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాడు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Police ask motorists on Bengaluru-Mysuru expressway to drive cautiously". The Hindu. 6 October 2022.
  2. "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
  3. "Prime Minister Narendra Modi inaugurates 118-km Bangalore-Mysore Expressway". The Telegraph (in ఇంగ్లీష్). 12 March 2023. Retrieved 13 March 2023.
  4. "Bengaluru Mysuru Expressway Route Map, Toll Rates, Latest Updates & More - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-05-30. Retrieved 2024-05-30.
  5. "Bengaluru-Mysuru road is national highway, not expressway: NHAI". The Times of India. 2023-08-04. ISSN 0971-8257. Retrieved 2023-08-04.
  6. "Bengaluru-Mysuru expressway will be ready in October 2022: NHAI".
  7. "Prime Minister Narendra Modi inaugurates 118-km Bangalore-Mysore Expressway". The Telegraph (in ఇంగ్లీష్). 12 March 2023. Retrieved 13 March 2023.