జేమ్స్ బ్రైడ్ టేలర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్
జేమ్స్ బ్రైడ్ టేలర్
ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 2వ గవర్నరు
In office
1937 జూలై 1 – 1943 ఫిబ్రవరి 17
అంతకు ముందు వారుఓస్బోర్న్ స్మిత్
తరువాత వారుసి.డి.దేశ్‌ముఖ్
వ్యక్తిగత వివరాలు
జననం(1891-04-21)1891 ఏప్రిల్ 21
మరణం1943 ఫిబ్రవరి 17(1943-02-17) (వయసు 51)
నైపుణ్యంఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి
సంతకం

సర్ జేమ్స్ బ్రైడ్ టేలర్ (ఆంగ్లం: James Braid Taylor; 1891 ఏప్రిల్ 21 - 1943 ఫిబ్రవరి 17) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ గవర్నర్, 1937 జూలై 1 నుండి 1943 ఫిబ్రవరి 17న మరణించే వరకు ఆయన పదవిలో కొనసాగాడు. ఆయనకు ముందు సర్ ఒస్బోర్న్ స్మిత్ గవర్నర్‌గా పనిచేశాడు.[1][2][3]

ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన ఆయన ఒక దశాబ్దానికి పైగా భారత ప్రభుత్వ కరెన్సీ విభాగంలో డిప్యూటీ కంట్రోలర్‌గా పనిచేసాడు. తరువాత అతను కరెన్సీ కంట్రోలర్ అయ్యాడు. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా ఆయన చేసాడు. ఆయన రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా చేసి ఆ తర్వాత, గవర్నర్ అయ్యాడు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్లు తయారీ, పైలటింగ్‌లతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్యాంకును పరిపాలించడంతో పాటు వెండి కరెన్సీ నుండి ఫియట్ మనీకి మారాలనే నిర్ణయంలోనూ పాల్గొన్నాడు. ఆయన రెండో గవర్నర్‌గా, భారత రూపాయి కరెన్సీ నోట్లపై ఆయన సంతకం చేసాడు.

ఆయన 1943 ఫిబ్రవరి 17న పదవిలో ఉండగానే మరణించాడు. అతని తర్వాత సర్ సి.డి.దేశ్‌ముఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన మొదటి భారతీయుడు అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. London Gazette, 2 January 1933
  2. London Gazette, 3 June 1935
  3. London Gazette, 6 June 1939