టి.ఆర్. జెలియాంగ్
టి.ఆర్. జెలియాంగ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మార్చ్ 2023 | |||
గవర్నరు | లా గణేశన్ | ||
---|---|---|---|
ముందు | ఐ.కె. సెమా (1989) | ||
పదవీ కాలం 19 జులై 2017 – 8 మార్చి 2018 | |||
గవర్నరు | పద్మనాభ ఆచార్య | ||
ముందు | షుర్హోజెలీ లీజీట్సు | ||
తరువాత | నెయిఫియు రియో | ||
పదవీ కాలం 24 మే 2014 – 20 ఫిబ్రవరి 2017 | |||
గవర్నరు |
| ||
ముందు | నెయిఫియు రియో | ||
తరువాత | షుర్హోజెలీ లీజీట్సు | ||
నాగాలాండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 15 మార్చి 2018 – 7 మే 2022 | |||
తరువాత | ఖాళీ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2008 | |||
ముందు | వత్సు మేరు | ||
నియోజకవర్గం | పెరెన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మ్బౌపుంగ్వా, అస్సాం , భారతదేశం (ప్రస్తుతం నాగాలాండ్ , భారతదేశం ) | 1952 ఫిబ్రవరి 21||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
జీవిత భాగస్వామి | కెవిజేనువో రంగ్‌కౌ | ||
నివాసం | రంగకౌ మాన్షన్, దిమాపూర్, నాగాలాండ్ |
తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్ (జననం: 1952 ఫిబ్రవరి 21) నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఎనిమిది సార్లు టెన్నింగ్, పెరెన్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2017 నుండి 2018 వరకు 10వ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేసి[1] ప్రస్తుతం నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జెలియాంగ్ 1982 & 1987 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో టెన్నింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 1989 ఎన్నికలలో నాగా పీపుల్స్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1993, 1998, 2003లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు టెన్నింగ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
జెలియాంగ్ 1989 నుండి 90 వరకు రాష్ట్ర సమాచార, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా, 1994 నుండి 1998 వరకు సహాయ & పునరావాస శాఖ సహాయ మంత్రిగా, 1998 నుండి 2003 వరకు పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను 2003లో నాగాలాండ్ కాంగ్రెస్‌ని స్థాపించి ఆ తరువాత దానిని నాగా పీపుల్స్ ఫ్రంటులో విలీనం చేసి 2004 నుండి 2008 వరకు నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికై తిరిగి 2008లో రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చి నెయిఫియు రియో మంత్రివర్గంలో ప్లానింగ్, జియాలజీ, మైనింగ్, పశుసంవర్ధక, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.
నాగాలాండ్ ముఖ్యమంత్రి
[మార్చు]జెలియాంగ్ 2014 మే నుండి 2017 ఫిబ్రవరి వరకు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా[2], 2017 జూలై నుండి 2018 మార్చి వరకు రెండు పర్యాయాలు నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు[3]. ఆ అతను తరువాత నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు శాసనసభాపక్ష నేతగా, 2022 నుండి నాగాలాండ్ ప్రభుత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (నాగాలాండ్) చైర్మన్ నియమితుడయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ BusinessLine (24 May 2014). "T R Zeliang sworn in as Nagaland CM" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
{{cite news}}
:|last1=
has generic name (help) - ↑ The Hindu (24 May 2014). "Zeliang sworn in as Nagaland CM" (in Indian English). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ The Hindu (19 July 2017). "Zeliang appointed Nagaland Chief Minister" (in Indian English). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.