తగరం

వికీపీడియా నుండి
(తగరము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తగరము, 00Sn
తగరము
Allotropessilvery-white, β (beta); gray, α (alpha)
Appearancesilvery (left, beta) or gray (right, alpha)
Standard atomic weight Ar°(Sn)
తగరము in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Ge

Sn

Pb
ఇండియంతగరముఆంటిమొని
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 5
Block  p-block
Electron configuration[Kr] 4d10 5s2 5p2
Electrons per shell2, 8, 18, 18, 4
Physical properties
Phase at STPsolid
Melting point505.08 K ​(231.93 °C, ​449.47 °F)
Boiling point2875 K ​(2602 °C, ​4716 °F)
Density (near r.t.)(తెలుపు) 7.365 g/cm3
(gray) 5.769 g/cm3
when liquid (at m.p.)6.99 g/cm3
Heat of fusion(తెలుపు) 7.03 kJ/mol
Heat of vaporization(తెలుపు) 296.1 kJ/mol
Molar heat capacity(తెలుపు) 27.112 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1497 1657 1855 2107 2438 2893
Atomic properties
Oxidation states−4, −3, −2, −1, 0,[3] +1,[4] +2, +3,[5] +4 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.96
Atomic radiusempirical: 140 pm
Covalent radius139±4 pm
Van der Waals radius217 pm
Color lines in a spectral range
Spectral lines of తగరము
Other properties
Natural occurrenceprimordial
Crystal structuretetragonal
Tetragonal crystal structure for తగరము

తెలుపు
Speed of sound thin rod(rolled)
2730 m/s (at r.t.)
Thermal expansion22.0 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity66.8 W/(m⋅K)
Electrical resistivity115 n Ω⋅m (at 0 °C)
Magnetic ordering(gray) diamagnetic[6], (తెలుపు) paramagnetic
Young's modulus50 GPa
Shear modulus18 GPa
Bulk modulus58 GPa
Poisson ratio0.36
Mohs hardness1.5
Brinell hardness~350 MPa
CAS Number7440-31-5
History
Discoveryaround 3500 BC
Symbol"Sn": from Latin stannum
Isotopes of తగరము
Template:infobox తగరము isotopes does not exist
 Category: తగరము
| references

తగరం Sn గుర్తు కలిగిన రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 50. దీన్ని ఇంగ్లీషులో టిన్ అంటారు. టిన్ వెండి రంగులో ఉండే లోహం.

అత్గరం తేలిగ్గా కత్తిరించగలిగేంత మృదువుగా ఉంటుంది. [9] తగరం కడ్డీని చేతితో తేలిగ్గా వంచవచ్చు. వంగినప్పుడు, "టిన్ క్రై" (తగరపు అరుపు) అనే శబ్దాన్ని వినవచ్చు. తగరపు స్ఫటికాలు ఒకదాన్నుండి ఒకటి విడిపోయేటపుడు వచ్చే శబ్దమది; ఈ లక్షణం ఇండియం, కాడ్మియం, జింక్, ఘన స్థితిలో ఉన్న పాదరసం లకు కూడా ఉంటుంది.

ఘనీభవించిన తర్వాత స్వచ్ఛమైన తగరానికి చాలా లోహాల మాదిరిగానే అద్దం లాంటి మెరుపు వస్తుంది. చాలా టిన్ మిశ్రమాలలో (ప్యూటర్ వంటివి) లోహం బూడిద రంగుతో ఘనీభవిస్తుంది.

టిన్ మూలకాల ఆవర్తన పట్టికలోని గ్రూపు 14 లో ఉండే ఒక పోస్ట్-ట్రాన్సిషన్ లోహం . ఇది ప్రధానంగా క్యాసిటరైట్ ఖనిజంలో లభిస్తుంది. ఇందులో స్టానిక్ ఆక్సైడ్, SnO
2
ఉంటుంది. తగరానికి గ్రూప్ 14 లో దాని పొరుగున ఉండే జెర్మేనియం, సీసం లు రెండింటితో రసాయన సారూప్యత ఉంటుంది. దీనికి రెండు ప్రధాన ఆక్సీకరణ స్థితులు +2, కొంచెం స్థిరంగా +4 ఉన్నాయి. టిన్ భూమిపై అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో 49 వది. దీనికి 10 స్థిరమైన ఐసోటోప్‌లున్నాయి. ఆవర్తన పట్టికలో అత్యధిక సంఖ్యలో స్థిరమైన ఐసోటోప్‌లు కలిగిన మూలకం ఇదే. దీనికి కారణం దానిలో మ్యాజిక్ సంఖ్యలో ఉన్న ప్రోటాన్‌లు.

పెద్ద ఎత్తున ఉపయోగించిన మొదటి టిన్ మిశ్రమం కంచు. దీన్ని సా.పూ. 3000 నాటికే వంతుల టిన్‌ను,  వంతుల రాగితో కలిపి తయారు చేసేవారు. సా.పూ. 600 తర్వాత, స్వచ్ఛమైన టిన్ లోహాన్ని ఉత్పత్తి చేసారు. ప్యూటర్ మిశ్రలోహంలో 85-90% టిన్ ఉండగా, మిగిలిన భాగం సాధారణంగా రాగి, యాంటీమోనీ, బిస్మత్, కొన్నిసార్లు సీసం, వెండితో ఉంటాయి. ఇది కాంస్య యుగం నుండి ఫ్లాట్‌వేర్ కోసం ఉపయోగించారు. ఆధునిక కాలంలో, టిన్ అనేక మిశ్రమాలలో ఉపయోగించబడుతోంది. ముఖ్యంగా టిన్ / లెడ్ సాఫ్ట్ సోల్డర్స్. వీటిలో సాధారణంగా 60% లేదా అంతకంటే ఎక్కువ టిన్ ఉంటుంది.ఆప్టోఎలక్ట్రానిక్ అప్లికేషన్లలో పారదర్శక, విద్యుత్తుతో నడిచే ఇండియం టిన్ ఆక్సైడ్ ఫిల్మ్‌ల తయారీలో కూడా తగరాన్ని వాడతారు. మరొక పెద్ద అప్లికేషన్ ఉక్కు యొక్క తుప్పు-నిరోధక టిన్ ప్లేటింగ్. అకర్బన టిన్ తక్కువ విషపూరితం కాబట్టి, టిన్-పూతతో కూడిన ఉక్కు ఆహార ప్యాకేజింగ్ కోసం టిన్ డబ్బాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కొన్ని ఆర్గానోటిన్ సమ్మేళనాలు మాత్రం చాలా విషపూరితంగా ఉంటాయి.

లభ్యత

[మార్చు]
క్యాసిటరైట్ నమూనా. ఇది టిన్ యొక్క ప్రధాన ఖనిజం

తక్కువ-నుండి-మధ్యస్థ ద్రవ్యరాశి ఉండే నక్షత్రాలలో (సూర్యుడి కంటే 0.6 నుండి 10 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో) సుదీర్ఘ <i id="mwAhY">s-</i> ప్రక్రియ ద్వారా తగరం ఉత్పత్తి అవుతుంది. ఇండియం యొక్క భారీ ఐసోటోపులు బీటా క్షయం చెందే ప్రక్రియలో కూడా ఇది ఉత్పత్తి అవుతుంది. [10]

భూమి పైపెంకులో తగరం 49వ అత్యంత సమృద్ధిగా లభించే మూలకం. భూమిలో దీని సాంద్రత 2 ppm ఉంటుంది. దీనితో పోలిస్తే  జింక్ 75 ppm, రాగి 50 ppm, సీసం 14 ppm ఉంటాయి. [11]

టిన్ మూలక రూపంలో లభించదు. వివిధ ఖనిజాల నుండి సంగ్రహించబడుతుంది. టిన్ కు క్యాసిటరైట్ (SnO
2
) ఏకైక వాణిజ్యపరంగా ముఖ్యమైన మూలం. అయితే స్టానైట్, సిలిండ్రైట్, ఫ్రాంకీట్, కాన్‌ఫీల్డ్‌టైట్, టీలైట్ వంటి కాంప్లెక్స్ సల్ఫైడ్‌ల నుండి చిన్న పరిమాణంలో టిన్ లభిస్తుంది. టిన్‌తో కూడిన ఖనిజాలు దాదాపు ఎల్లప్పుడూ గ్రానైట్ రాక్‌తో సంబంధం కలిగి ఉంటాయి. [12]

ప్రపంచ టిన్ గని నిల్వలు (టన్నులు, 2011) [13]
దేశం నిల్వలు
 China 1,500,000
 Malaysia 250,000
 Peru 310,000
 Indonesia 800,000
 Brazil 590,000
 Bolivia 400,000
 Russia 350,000
 Australia 180,000
 Thailand 170,000
  ఇతర 180,000
  మొత్తం 4,800,000
ఆర్థికంగా చవగ్గా పొందగలిగే టిన్ నిల్వలు [12]
సంవత్సరం మిలియన్ టన్నులు
1965 4,265
1970 3,930
1975 9,060
1980 9,100
1985 3,060
1990 7,100
2000 7,100 [13]
2010 5,200 [13]

2011లో దాదాపు 2,53,000 టన్నుల టిన్‌ను తవ్వారు. ఈ ఉత్పత్తి ఎక్కువగా చైనా (1,10,000 t), ఇండోనేషియా (51,000 t), పెరూ (34,600 t), బొలీవియా (20,700 t), బ్రెజిల్ (12,000 t) ఉంది. [13] ప్రస్తుత వినియోగ రేట్లు, సాంకేతికతల ప్రకారం చూస్తే 40 సంవత్సరాలలో భూమిపై తవ్వుకోగలిగిన టిన్ అయిపోతుందని అంచనా వేసారు. 2% వార్షిక వృద్ధి ప్రకారం చూస్తే, 20 సంవత్సరాలలోపు టిన్ అయిపోవచ్చని లెస్టర్ బ్రౌన్ 2006లో అన్నాడు.

స్క్రాప్ టిన్ అనేది మెటల్ యొక్క ముఖ్యమైన మూలం. రీసైక్లింగ్ ద్వారా టిన్ రికవరీ వేగంగా పెరుగుతోంది. అమెరికా 1993 నుండి టిన్‌ను తవ్వలేదు, 1989 నుండి కరిగించలేదు. ఇది అతిపెద్ద ద్వితీయ స్థాయి ఉత్పత్తిదారు. 2006లో [13] 14,000 టన్నులను రీసైక్లింగ్ చేసింది.

మంగోలియాలో కొత్త నిక్షేపాలను కనుగొన్నారు, [14] 2009లో కొలంబియాలో కొత్త టిన్ నిక్షేపాలను కనుగొన్నారు. [15]

ఉపయోగాలు

[మార్చు]

2018 లో ఉత్పత్తయిన మొత్తం టిన్‌లో సగం కంటే తక్కువ సోల్డరులో ఉపయోగించబడింది. మిగిలిన భాగాన్ని టిన్ ప్లేటింగ్, టిన్ రసాయనాలు, ఇత్తడి, కాంస్య మిశ్రమాలు, తదితర ఉపయోగాల కోసం వాడారు. [16]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Tin". CIAAW. 1983.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. "New Type of Zero-Valent Tin Compound". Chemistry Europe. 27 August 2016.
  4. "HSn". NIST Chemistry WebBook. National Institute of Standards and Technology. Retrieved 23 January 2013.
  5. "SnH3". NIST Chemistry WebBook. National Institure of Standards and Technology. Retrieved 23 January 2013.
  6. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  7. "SnH3". NIST Chemistry WebBook. National Institure of Standards and Technology. Retrieved 23 January 2013.
  8. "HSn". NIST Chemistry WebBook. National Institute of Standards and Technology. Retrieved 23 January 2013.
  9. Gray, Theodore (2007). "Tin images". The Elements. Black Dog & Leventhal.
  10. Shu, Frank H. (1982). The physical universe: An introduction to astronomy. University Science Books. pp. 119–121. ISBN 978-0-935702-05-7.
  11. Emsley 2001, pp. 124, 231, 449 and 503.
  12. 12.0 12.1 "Tin: From Ore to Ingot". International Tin Research Institute. 1991. Archived from the original on 2009-03-22. Retrieved 2009-03-21. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "I230527" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  13. 13.0 13.1 13.2 13.3 13.4 Carlin, James F. Jr. "Tin: Statistics and Information" (PDF). United States Geological Survey. Archived from the original on 2008-12-06. Retrieved 2008-11-23. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "USGS200YB" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  14. (1995). "Endogenous rare metal ore formations and rare metal metallogeny of Mongolia".
  15. "Seminole Group Colombia Discovers High Grade Tin Ore in the Amazon Jungle". FreePR101 PressRelease. Archived from the original on 2014-08-26.
  16. "Tin demand to decline – International Tin Association". Mining.com. 18 October 2019. Retrieved 3 July 2021.