దీపా సాహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపా సాహి
మాయా స్టూడియో ప్రారంభోత్సవంలో దీపా సాహి
జననం (1962-11-30) 1962 నవంబరు 30 (వయసు 61)
వృత్తినటి, నిర్మాత, దర్శకురాలు, స్క్రిప్ట్/కథా రచయిత
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం
జీవిత భాగస్వామికేతన్ మెహతా

దీపా సాహి (జననం 1962 నవంబరు 30) ఆర్మీ నేపథ్యం నుండి వచ్చిన భారతీయ నటి, సినిమా నిర్మాత. ఆమె 1993 చలనచిత్రం మాయా మెమ్‌సాబ్‌లో నటుడు ఫారూఖ్ షేఖ్ సరసన మాయ పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె 2011లో తేరే మేరే ఫేరే సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

దీపా సాహి, డెహ్రాడూన్‌లో ఆర్మీ నేపథ్యం గల పంజాబీ కుటుంబంలో జన్మించింది.[2] ఆమె మీరట్‌లో పెరిగింది.[3] ఆమెకు ఒక అక్క ఉంది, ఆమె 18 సంవత్సరాల వయస్సులో మరణించింది.[4] ఆమె కుటుంబం తరువాత కెనడాకు మారింది, కానీ ఆమె మాత్రం భారతదేశంలోనే ఉంది.

దీపా సాహి ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చదువు కొనసాగించింది.[5] ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో బంగారు పతకం సాధించింది.[6][7]

దర్శకత్వం వహించాలనే లక్ష్యంతో ఆమె తరువాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది.[8] అయితే, ఆమె నటిగా ఆఫర్లను అందుకుంది, దీంతో ఆమె నటన వైపు అడుగులు వేసింది. ఆమె తన కెరీర్ తొలినాళ్లలో తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకుంది, అయితే నానా పటేకర్, హేమమాలిని నటించాల్సిన నానా కార్తే ప్యార్ చిత్రం ఆర్ధిక మాంద్యం కారణంగా నిలిచిపోయింది.[9]

ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు ఉషా మెహతా మేనల్లుడు అయిన చలనచిత్ర దర్శకుడు కేతన్ మెహతాను వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఇది రెండవ వివాహం.[1][6]

కెరీర్

[మార్చు]

ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆమె మొదటి సినిమాతోనే ప్రముఖ రచయిత గోవింద్ నిహలానీతో కలిసి పని చేసింది. 1984లో పార్టీ చిత్రంతో ఆమె అరంగేట్రం చేసింది.[10] దీనికి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఆమె అఘాత్ (1985)లో నటించింది. ఆమె థెస్పియన్ అచీవ్‌మెంట్, అయితే, అత్యంత ప్రశంసలు పొందిన టెలీఫిల్మ్ తమస్ (1986)లో ఆమె పోషించిన సాధికారత కలిగిన నిమ్న కుల పంజాబీ మహిళగా పాత్ర ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.[11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sense of humour is important in a marriage". Hindustan Times. 7 February 2011. Archived from the original on 16 December 2014. Retrieved 9 December 2014. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. HT Correspondent (12 December 2006), "History will pour out of every brick of Gobindgarh Fort, says Deepa Sahi" Archived 30 జూన్ 2018 at the Wayback Machine, Hindustan Times. Retrieved 20 January 2019.
  3. "Maya in control!". The Hindu. 9 September 2011. Archived from the original on 21 December 2019. Retrieved 9 December 2014.
  4. "Maya in control!". The Hindu. 9 September 2011. Archived from the original on 21 December 2019. Retrieved 9 December 2014.
  5. "DU has a lot on its ladies special platter". India Today. 3 June 2009. Archived from the original on 22 December 2015. Retrieved 9 December 2014.
  6. 6.0 6.1 "Ketan Mehta: I must be the craziest man Deepa has met in her life". The Times of India. 28 October 2014. Archived from the original on 30 October 2014. Retrieved 24 December 2014.
  7. "DEEPA SAHI". Whistler Film Festival. Archived from the original on 22 December 2015.
  8. "I am too restless to be an actress: Deepa Sahi". The Times of India. 2 September 2011. Archived from the original on 12 October 2018. Retrieved 9 December 2014.
  9. "No Rules, Make What You Want". The New Indian Express. 2 October 2011. Archived from the original on 23 December 2014. Retrieved 9 December 2014.
  10. "I'm too restless to act: Actress-producer Deepa Sahi". Daily News and Analysis. 28 September 2011. Archived from the original on 14 December 2014. Retrieved 9 December 2014.
  11. "Maya in control!". The Hindu. 9 September 2011. Archived from the original on 21 December 2019. Retrieved 9 December 2014.