పార్వతీపురం
పార్వతీపురం | |
---|---|
పట్టణం | |
Coordinates: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | పార్వతీపురం పురపాలకసంఘం, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BUDA) |
• శాసన సభ్యుడు | Alajangi Jogarao |
విస్తీర్ణం | |
• Total | 7.24 కి.మీ2 (2.80 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 53,844 |
• జనసాంద్రత | 7,400/కి.మీ2 (19,000/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 535 501 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 91–8963 |
వాహనాల నమోదు కోడ్ | AP35 (Former) AP39 (from 30 January 2019)[3] |
పార్వతీపురం, (వినండి: // ( listen)), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం.
భౌగోళికం
[మార్చు]రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 523 కి.మీ, సమీప నగరమైన విజయనగరానికి ఉత్తరంగా 87 కి.మీ దూరంలోవుంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 53,844.
పరిపాలన
[మార్చు]పార్వతీపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 16 పై గల శ్రీకాకుళం నుండి ఈ ఊరికి రహదారి ఉంది. టాటానగర్-జార్సుగూడ-విజయనగరం, విజయనగరం-రాయ్ పూర్ లైన్లో పార్వతీపురం ఉంది. పార్వతీపురం రైల్వే స్టేషన్, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనే రెండు స్టేషన్లున్నాయి. సమీప విమానాశ్రయం 150 కి.మీ దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]దేవాలయాలు
[మార్చు]- కాశీవిశ్వనాథ దేవాలయం, అడ్డపుసిల: 5 కి.మీ దూరంలోగల చారిత్రక ఆలయం, దగ్గర్లోనే ప్రసిధ్ధమైన "గుంప" గ్రామంలో నాగావళి నది ఒడ్డున 'సోమేశ్వరుని'క్షేత్రం ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి భక్తులు ఈ ఆలయానికి పోటెత్తురారు
- శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తోటపల్లి: చిన్న తిరుపతిగా పేరొందినది.
- సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, బెలగాం: 1888లో నిర్మించబడింది.
- కేథలిక్ చర్చి,పార్వతీపురం.
జలాశయాలు, ఆనకట్టలు
[మార్చు]- ఝంజావతి రబ్బరు ఆనకట్ట: 15 కి.మీ దూరంలో ఉంది. జలయజ్ఞంలో భాగంగా 2006 లో నిర్మించబడింది
- తోటపల్లి జలాశయం:నాగావళి నదిపై 2015 లో నిర్మించబడింది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- ఉప్మాక నారాయణమూర్తి - (1896 -1962) సాహితీ వేత్త, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
- ఎస్.వి.జోగారావుగా - ప్రఖ్యాత నఖచిత్రకారునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
- గణేష్ పాత్రోగా - ప్రసిధ్ధి చెందిన సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి గారు, తెలుగు పండితునిగా ఇక్కడి మిషనరీ హైస్కూల్లో ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇక్కడే పదవీ విరమణ చేశారు.వీరు కూడా తెలుగు సాహిత్యంపై ఎనలేని క్రృషి చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు రచించారు. పంతుల సీతాపతిరావు మాస్టారు అంటే తెలియనివారుండరు. ఈయన కూడా మిషనరీ స్కూల్లోనే భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించే మాస్టారుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి పదవీవిరమణ చేశారు. వీరు భౌతిక, రసాయనశాస్త్రాలలో నిష్ణాతులు. వీరికి ఆంగ్లము, తెలుగు భాషలపైన మంచి పట్టు ఉండడమే కాకుండా రచనా వ్యాసంగం ఆయా భాషలలో కొనసాగించారు.
- వేపా కృష్ణమూర్తి
- గొబ్బూరి వెంకటానంద రాఘవరావు
- పంతుల జోగారావు
- బెలగాం భీమేశ్వరరావు - బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
ఇవీ చూడండి
[మార్చు]- [[పార్వతీపురం లోక్సభ నియోజకవర్గంగా ఉండి తరువాత అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సెగ్మెంట్ గా కలిసిపోయింది. మన మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ శ్రీ వరాహగిరి వెంకటగిరి గారు (శ్రీ వి.వి.గిరి గారు) ఒకప్పుడు ఎమ్.పి.గా పోటీచేసి ఓడిపోయిన నియోజకవర్గమే ఈ పార్వతీపురం లోక్ సభ నియోజకవర్గం.]]
- పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
వెలుపలి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages including recorded pronunciations
- Commons category link is on Wikidata
- ఆంధ్రప్రదేశ్ జిల్లాల ముఖ్యపట్టణాలు
- పార్వతీపురం మన్యం జిల్లా మండల కేంద్రాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- పార్వతీపురం మన్యం జిల్లా
- పార్వతీపురం మన్యం జిల్లా పట్టణాలు