పొగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Emmission of soot from a large diesel truck

పొగ (Smoke) అనేది మన కంటికి కనిపించే ఆవిరి. ఈ ఆవిరిలో కలిసుండే రేణువుల మూలంగా ఇది కనిపిస్తుంది. ఇది కొన్ని పదార్ధాలు మండడం వలన తయారౌతాయి.[1]

పొగ కొన్ని రకాల మంటలలోని వ్యర్ధ పదార్ధము. ఇది ఎక్కువగా పొయ్యిలు, కొవ్వొత్తి లు, నూనె దీపాలు మొదలైనవి వెలిగించినప్పుడు వెలువడుతుంది. కొన్ని రకాల పొగను దోమల నిర్మూలన కోసం ఉపయోగిస్తారు. దేవుని పూజకు ఉపయోగించే ధూపం కూడా ఒక రకమైన పొగ. ఇవి అగర్ బత్తీలు, సాంబ్రాణి మొదలైనవి వెలిగించినప్పుడు తయారై సుగంధ పరిమళాలను ఇస్తుంది. పొగ రైలు, డీజిల్ వాహనాలు మొదలైన కొన్ని రకాల యంత్రాలలో తయారై గొట్టాల ద్వారా బయటకు వస్తుంది.

ఇంటి లోపలి అగ్ని ప్రమాదాలలో మరణాలకు ముఖ్యమైన కారణం పొగను పీల్చడం. ఈ విధమైన పొగలో వేడిమితో పాటు విష వాయువుల మిశ్రమంలోని కార్బర్ మోనాక్సైడ్, హైడ్రోజెన్ సయనైడు మొదలైనవి కారణము.

మూలాలు

[మార్చు]
  1. Smoke Production and Properties Archived 2017-07-12 at the Wayback Machine - SFPE Handbook of Fire Protection Engineering

బయటి లింకులు

[మార్చు]