బార్పేట జిల్లా
బార్పేట జిల్లా
বৰপেটা জিলা | |
---|---|
దేశం | భారత దేశము |
రాష్ట్రం | అసోం |
పరిపాలన విభాగం | Lower Assam |
జిల్లాకేంద్రం | బార్పేట |
విస్తీర్ణం | |
• Total | 3,245 కి.మీ2 (1,253 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 16,93,190 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
ISO 3166 code | IN-AS-BA |
Website | http://barpeta.gov.in/ |
బార్పేట జిల్లా, (అస్సామీ:বৰপেটা জিলা) భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని ఒక జిల్లా.బార్పేట పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3245 చ.కి.మీ. జనసంఖ్య 16,42,420.
చరిత్ర
[మార్చు]1983లో కామరూప్ జిల్లా నుండి కొంత భూభాం వేరు చేసి బార్పేట జిల్లా ఏర్పాటు చేయబడింది .[1] 2004 జూన్ 1 బక్సా జిల్లా ఏర్పాటు చేయబడిన సమయంలో జిల్లాలో అధికభాగం బక్సా జిల్లాలో చేర్చబడింది.[1]
భౌగోళికం
[మార్చు]బార్పేట జిల్లా వైశాల్యం 3245 చ.కి.మీ.[2] వైశాల్యపరంగా రష్యా లోని ఇతురప్ ఐలాండ్ వైశాల్యానికి సమానంగా ఉంటుంది.[3]
జిల్లా లోని ముఖ్యపట్టణాలు
[మార్చు]- బార్పేట: ఇది జిల్లా కేంద్రం అంతేకాక జిల్లాలో వైశాల్యంలో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రశాంతమైన, కాలుష్యరహితమైన పట్టణం. నగరంలో మితమైన మోటర్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నగరమంతటా సెలయేర్లు, నీటి కాలువలు ఉన్నాయి. వైష్ణవ సన్యాసి మహాదేవ్ స్థాపించిన బార్పేట సత్రం ప్రముఖ కేంద్రంగా ఉంది. గతంలో ఇది ట్రాంఫోర్ట్ పరిశ్రమకు కేంద్రంగా ఉంటూ ఉండేది. అయినప్పటికీ ఇది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నగరం దంతం పనితనానికి ప్రత్యేకత కలిగి ఉంది.
- హోలీ: ఇది జిల్లాలో రద్దిగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇది బార్పేట రోడ్డు, బార్పేట పట్టణం మద్య ఉంది. ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జాతీయ రహదారి 31 నగరం మద్య నుండి పయనిస్తుంది. ఇక్కడ జరిగే అస్సామీ రాసలీల ఉత్సవంలో అనేక మంది పాల్గొంటారు. నగరంలో అధికంగా విద్యావంతులు ఉన్నారు. నగరంలో వక్కల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో వక్కల తయారు చేస్తున్న నగరంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
- బార్పేట రోడ్డు: జిల్లాలో వైశాల్యపరంగా ప్రథమస్థానంలో ఉంది. ఇది పశ్చిమ అస్సాంలో ప్రధాన రద్ది అయిన వ్యాపారకేంద్రాలలో ఒకటి. నగర పరిసరాలలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
- సర్భోగ్: ఇది జాతీయరహదారి 31 పక్కన ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ పాలవారు విక్రయించే గేదె పెరుగు ప్రత్యేకత సంతరించుకుంది.
- పత్సల: ఇది అస్సాం హాలీవుడ్గా ప్రత్యేకత సంతరుంచుకుంది. ఇక్కడ పలు మొబైల్ చలన చిత్ర ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఈ పట్టణంలో విద్యావతులు అధికంగా ఉన్నారు. ఇది ఒక చిన్న పట్టణం.
- బర్మర: ఇది ఒక చిన్న పట్టణం. చెంగ, రౌలీ మద్య ఇది రావాణా కేంద్రంగా ఉంది. ఇక్కడ వారాంతర సంత జరుగుతుంది. సంతలో పేదలకు, మద్యతరగతి వారికి అందుబాటులో వస్తువులు లభిస్తుంటాయి.
- సర్తెబరి: ఇది జిల్లాలో గంటల తయారీకి గుర్తింపు పొందిన చిన్న పట్టణం.
- కల్గచై: ఇది జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న పట్టణం. ఇక్కడ బెంగాలీ భాష ముస్లిములు అధికంగా నివసిస్తున్నారు. ఇది ప్రముఖ విద్యాకేంద్రంగా, అస్సాంలోని బెంగాలీ భాధా ముస్లిం సాహిత్య కార్యకలాపాలకు ఇది ప్రత్యేకత సంతరించుకుంది.
- భవానిపూర్: ఇది జాతీయరహదారి-31 పక్కన ఉంది. ఇది జిల్లాకు కేంద్రస్థానంలో ఉంది. నగరంలో మంచి సాంకేతిక వ్యవస్థ ఉంది. ఇది చక్కని విద్యావంతులు కలిగిన నగరం. అంతేకాక అధికంగా జనసాంధ్రత కలిగిన నగరం. నగరంలో ప్రబలమైన భవానీపురియా గోపాల్ ఆతా సత్రం ఉంది.
- సరుపేట: ఇది ఒక వ్యాపార కూడలి. ఇది భవానిపూర్ సమీపంలో ఉంది.
- జనియా: జనియా బజార్ ఇది ఎఫ్.ఏ.ఎ. ఎం మెడికల్ కాలేజ్ (బార్పేట) సమీపంలో ఉంది..
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బార్పేట జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్రం లోని 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
శాసన వ్యవస్థ
[మార్చు]శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లాలో 6 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.[5]
- సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం
- బార్పేట శాసనసభ నియోజకవర్గం
- జానియా శాసనసభ నియోజకవర్గం
- బాగ్బర్ శాసనసభ నియోజకవర్గం
- సరుఖేత్రి శాసనసభ నియోజకవర్గం
- చెంగా శాసనసభ నియోజకవర్గం
లోక్సభ నియోజకవర్గాలు
[మార్చు]కోక్రాఝర్ లోక్సభ నియోజకవర్గం దీనిలో సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం భాగంగా ఉంది. పైవాటిలో మిగిలిన 5 నియోజకవర్గాలు బార్పేట లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,693,190, [7] |
ఇది దాదాపు. | గునియా-బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 292 వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 632[7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.4%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 951:1000 [7] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 65.03%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
- 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో అధికంగా ముస్లిములు 977,943 (59.37%), తరువాత స్థానంలో హిందువులు 662,066, తరువాత స్థానంలో క్రైస్తవులు 5,267 ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 11 October 2011.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 11 October 2011.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 1 డిసెంబరు 2015. Retrieved 11 October 2011.
Iturup (Etorofu) 3,238km2
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
- ↑ "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
- ↑ "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Guinea-Bissau 1,596,677 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Idaho 1,567,582
వెలుపలి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- అసోం జిల్లాలు
- బార్పేట జిల్లా
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు
- 1983 స్థాపితాలు
- పశ్చిమ అసోం
- భారతదేశం లోని జిల్లాలు