బాల్‌చంద్ర నెమాడే
నెమాడే
బాల్‌చంద్ర వనాజీ నెమాడే | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1938 సంగవి, రవేర్, మహారాష్ట్ర |
వృత్తి | మరాఠీ రచయిత |
జాతీయత | భారతీయుడు |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం-2014, పద్మశ్రీ– 2011 |
బాలచంద్ర వనాజీ నెమాడే (Devanagari: भालचंद्र वनाजी नेमाडे) (born 1938) మరాఠీ చయిత. కోసల, హిందూ పుస్తకాల రచయితగా సుప్రసిద్ధుడు. 2014సంవత్సరానికిగానూ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యాడు.[1]
జీవితం
[మార్చు]నెమాడే 1938లో ఖాందేశ్‌లోని సంగవి గ్రామంలో జన్మించాడు. మహారాష్ట్ర, పూణేలోని ఫెర్గూసన్ కళాశాల నుండి బాచిలర్ డిగ్రీని, అదే పూణేలోని డెక్కన్ కాలేజి ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రిసెర్చ్ నుండి భాషాశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డీ., డీ.లిట్., పట్టాలు అందుకున్నాడు.
నెమాడే ఆంగ్లం, మరాఠీ, తులనాత్మక సాహిత్యం మొదలగు అంశాలను వివిధ విశ్వవిద్యాలయాలలో బోధించాడు. లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్‌లోను పనిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయంలో గురుదేవ్ రవీంద్రనాథ ఠాగూర్ తులనాత్మక సాహిత్య పీఠంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 1960లో మరాఠీ పత్రిక 'వాచా (वाचा) ' కు సంపాదకుడిగా పనిచేశాడు. 1990లో టీక స్వయన్వర్ (टीका स्वयंवर). అను విమర్శా గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2015 ఫిబ్రవరీలో జ్ఞానపీఠ పురస్కారం పొందాడు[2].
సాహితీ ప్రస్థానం
[మార్చు]1963లో నెమాడే తన మొదటి నవల కోసల (कोसला) ను వెలువరించాడు.[3] ఇదీ గ్రామీణ ప్రాంతం నుండి పూనేకు చదువుకోడానికి వచ్చిన ఓ యువకుని కథ. ఇదీ నెమాడే జీవితాన్ని ప్రతిబింబించే నవల. ఈ నవల ఆంగ్లం, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఓరియా వంటి పలు భాషల్లోకి అనువాదమైంది. దీని తర్వాత బీదర్, హూల్, జరీలా, జూల్ అను మరో నాలుగు నవలలు రాశాడు[4].
రచనలు
[మార్చు]నవలలు
- కోసల (Kosla)
- బీదర్ (Bidhar)
- హూల్ (Hool)
- జరీలా (Jarila)
- జూల్ (Jhool)
కవితా సంకలనాలు
- మెలోడీ (Melody)
- దెఖనీ Dekhani
విమర్శా గ్రంథాలు
- టీకాస్వయంవర్
- సాహిత్యాచీ భాష
- తుకారామ్
- మరాఠీపై ఆంగ్లభాషా ప్రభావం.
- ఇండో - ఆంగ్లియన్ రాతలు
- స్థానికత్వం (దేశీవాద్)
మూలాలు
[మార్చు]- ↑ మూస:Civil Services Junction
- ↑ http://www.thehindu.com/todays-paper/nemade-wins-jnanpith/article6867002.ece
- ↑ Nemade, Bhalchandra (1963). Kosala (कोसला). Mumbai: Polular Prakashan. p. 265.
- ↑ Nemade, Bhalchandra (2003). Bidhar(बिढार). Mumbai: Polular Prakashan. p. 305. ISBN 978-81-267-0298-5.
బయటి లంకెలు
[మార్చు]- Civil Services Junction, Civil Services Junction, 7 February 2015.
- Reviving the true Hindu ethos Archived 2010-08-20 at the Wayback Machine, The Hindu, 3 July 2010.
- Brahmins, Hindutva have ruined Hindu religion: Bhalchandra Nemade, DNA Mumbai, 26 July 2010.
- ‘हिंदू’ ही भूसांस्कृतिक संकल्पना – भालचंद्र नेमाडे, लोकसत्ता, 18 July 2010.
- Bhalachandra Nemade speaking on his novel Hindu యూట్యూబ్లో, Star Maaza, 27 July 2010.
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- 1938 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- భారతీయ రచయితలు
- మరాఠీ రచయితలు
- మరాఠీ కవులు
- ముంబై విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థులు