భాస్కరభట్ల రవికుమార్
Jump to navigation
Jump to search
భాస్కరభట్ల రవికుమార్ | |
---|---|
జననం | భాస్కరభట్ల రవికుమార్ బురవెల్లి (తాత గారి ఊరు ) - గార మండలం , శ్రీకాకుళం జిల్లా , |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | భాస్కరభట్ల రవికుమార్ |
భాస్కరభట్ల రవికుమార్ ఒక తెలుగు సినీ పాటల రచయిత. 300కి పైగా సినిమా పాటలు రాశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది.
రచయితగా
[మార్చు]ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ " పెళ్ళెందుకే రమణమ్మ ", " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ", " బొమ్మను గీస్తే నీలా ఉంది ", "నచ్చావులే " మొదలైనవి. 1994 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు, సితారలో విలేకరిగా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియితగా పేరు వచ్చింది. సుమారు 300 పాటలు రాశాడు.
సినిమాలు
[మార్చు]- క్రష్ (2021)
- 2 కంట్రీస్ (2017)
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)
- బాబు బంగారం (2016): దండమే ఎట్టుకుంటం
- హార్ట్ అటాక్ (2014)
- వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013)
- కబడ్డీ కబడ్డీ (2003)
- ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
- ఆంధ్రావాలా (2004): నిప్పు తునకై, ఉంగ ఉంగ, నైరే నైరే
- అదిరిందయ్యా చంద్రం (2005)
- ఆ ఒక్కడు (2009): మూతిమీదికి, అదేదోలే
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
- జల్సా (2008) (లిరిక్స్: "గాల్లో తేలినట్టుందే")
- శంకర్‌దాదా జిందాబాద్ (2007) (లిరిక్స్: "చందమామ ")
- మున్నా (2007) (లిరిక్స్: "కొంచం కొంచం")
- దేశముదురు (2007) (లిరిక్స్: "గిల్లి", "సత్తే", "గోల", "అత్తన్తోడే")
- బొమ్మరిల్లు (2006) (లిరిక్స్: "బొమ్మని గీస్తే", "కాని ఇప్పుడు")
- అశోక్ (2006) (లిరిక్స్: "నువ్వసలు")
- పోకిరి (2006) (లిరిక్స్: "ఓ దేవ దేవ దేవ దేవుడా", "ఇప్పటికింకా", "చూడొద్దంటున్నా")
- బిల్లా
- అందమైన అబద్ధం
- కుబేరులు
- నచ్చావులే
- నేనింతే
- అధినాయకుడు (2012): ఓలమ్మీ అమ్మీ, గురుడా ఇలా రార, ఊరంతా, అందం ఆకుమడి, అదిగో
- సౌఖ్యం (2015): యు ఆర్ మై హనీ, లాలిపాప్
- పలాస 1978 (2020)[1][2]
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత
- 2012: "సార్ వస్తారా" (బిజినెస్ మేన్)
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)