మామిడిపూడి ఆనందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడిపూడి ఆనందం
మామిడిపూడి ఆనందం


పదవీ కాలం
1969-1980
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

పదవీ కాలం
1958-1969

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1964-1969
ముందు జి.ఎస్.రాజు
తరువాత ఎర్రం సత్యనారాయణ

వ్యక్తిగత వివరాలు

జననం (1919-05-13)1919 మే 13
మద్రాసు ,మద్రాసు ప్రెసిడెన్సీ,బ్రిటీషు ఇండియా
మరణం 2001 ఫిబ్రవరి 19(2001-02-19) (వయసు 81)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సీతాలక్ష్మి
సంతానం 5 కుమారులు, 1 కుమార్తె(శాంతా సిన్హా)
మతం హిందూ

మామిడిపూడి ఆనందం ఆంధ్రప్రదేశ్ నుండి రెండు పర్యాయాలు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1919, మే 13న మద్రాసు నగరంలో జన్మించాడు. ఇతని తండ్రి రచయిత, విద్యావేత్త, విజ్ఞానసర్వస్వ నిర్మాతగా పేరుపొందిన మామిడిపూడి వేంకటరంగయ్య. ఇతడు బి.ఎ. చదివాడు. చార్టెడ్ అకౌంటెంటుగా పనిచేశాడు. ఇతని వివాహం సీతాలక్ష్మితో జరిగింది. వీరికి 5గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు. ఇతని కుమార్తె శాంతా సిన్హాకు పద్మశ్రీ పురస్కారం, రామన్ మెగసెసేపురస్కారాలు లభించాయి. ఇతడు "లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్" అనే గ్రంథాన్ని రచించాడు.

రాజకీయ రంగం

[మార్చు]

ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 1958 నుండి 1969 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1964 -1969ల మధ్య శాసనమండలి డిప్యుటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రివిలేజస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రాజ్యసభకు ఎన్నికై రెండు విడతలు (1969-74, 1974-80) రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు.

మరణం

[మార్చు]

ఇతడు 2001, ఫిబ్రవరి 19న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Archived from the original (PDF) on 30 మార్చి 2019. Retrieved 11 May 2020.