శ్రీ స్వామినారాయణ దేవాలయం (చికాగో)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ స్వామినారాయణ దేవాలయం
దేవాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలు (2008)
స్థానం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఇల్లినాయిస్
ప్రదేశం:చికాగో

శ్రీ స్వామినారాయణ దేవాలయం, అమెరికా ఇటాస్కాలోని చికాగో శివారులో ఉన్న స్వామినారాయణ హిందూ దేవాలయం.[1] $10 మిలియన్ల వ్యయంతో నిర్మించబడిన ఈ దేవాలయం 1998లో ప్రారంభించబడింది.[2] ఆ సమయంలో మిడ్‌వెస్ట్‌లోని అత్యంత ఖరీదైన హిందూ దేవాలయంగా నిలిచింది.[3]

చరిత్ర

[మార్చు]

1998 ఆగస్టు 2న ఆచార్య మహారాజశ్రీ తేజేంద్రప్రసాద్ పాండే ఈ దేవాలయాన్ని ప్రారంభించాడు. అమెరికాలోని మొదటి శిఖర్‌బంద్ స్వామినారాయణ దేవాలయమిది. హిందువులే కాకుండా ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధమతాలకు చెందిన భక్తులు ఇందులో ఉన్నారు.[1][4]

ఇతర వివరాలు

[మార్చు]

2008లో దేవాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. నైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇంగ్లండ్‌లోని వివిధ ప్రాంతాల నుండి 5000 మంది ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. రెండుగంటలపాటు సాగిన ఊరేగింపులో మహిళలు ఆభరణాలతో కూడిన చీరలు ధరించి సంప్రదాయ డప్పులతో లయబద్ధంగా నృత్యం చేశారు. ఊరేగింపులో భాగంగా యువత పదకొండు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Holt, Douglas (1998-11-06), HINDU SECT ENRICHES COMMUNITY OF ITASCA NEW TEMPLE PART OF GROWING PRESENCE, Chicago Tribune, archived from the original on 2012-10-21, retrieved 2022-03-23
  2. Williams 2004
  3. Anniversary Celebrations at Swaminarayan Temple In Midwest, Rediff.com, 1999-06-23, retrieved 2022-03-23
  4. About Midwest Swaminarayan Mandir, archived from the original on 2019-11-11, retrieved 2022-03-23
  5. Temple to celebrate 10th anniversary, Daily Herald (Arlington Heights), 2008-07-25, retrieved 2022-03-23
  6. Thousands gather for Itasca temple's anniversary, Daily Herald (Arlington Heights), 2008-08-03, retrieved 2022-03-23

బయటి లింకులు

[మార్చు]