హర్యానా జిల్లాల జాబితా
హర్యానా, భారతదేశ ఉత్తర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో 2023 నాటికి 22 జిల్లాలు ఉన్నాయి.దేశంలోని రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది.[1] రాష్ట్రానికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమాన, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. యమునా నది ఉత్తర ప్రదేశ్‌తో తన తూర్పు సరిహద్దును నిర్వచిస్తుంది. హర్యానా కూడా ఢిల్లీని మూడు వైపులా చుట్టుముట్టి, ఢిల్లీకి ఉత్తర, పశ్చిమ, దక్షిణ సరిహద్దులను ఏర్పరుస్తుంది. తత్ఫలితంగా, హర్యానాలోని పెద్ద ప్రాంతం జాతీయ రాజధాని ప్రాంతంలో చేర్చబడింది. చండీగఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల సంయుక్త రాజధాని.
చరిత్ర
[మార్చు]1966 నవంబరు 1న అప్పటి తూర్పు పంజాబ్ విభజన ప్రణాళిక ప్రకారం హర్యానా ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.అవి రోహ్తక్, జింద్, హిసార్, మహేంద్రగఢ్, గుర్గావ్, కర్నాల్, అంబాలా. భాషా జనాభా ఆధారంగా అప్పటి లోక్‌సభ స్పీకర్ -పార్లమెంటరీ కమిటీ సర్దార్ హుకమ్ సింగ్ సిఫార్సు తర్వాత విభజన జరిగింది.[2] పూర్వపు జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా తర్వాత మరో 15 జిల్లాలు జోడించబడ్డాయి.హర్యానా మొదటి ముఖ్యమంత్రిగా ా పండిట్ భగవత్ దయాళ్ శర్మ పనిచేసాడు.
2016లో, పెద్ద భివానీ నుండి చర్కీ దాద్రీ జిల్లాను రూపొందించారు. [3]
జిల్లాల జాబితా
[మార్చు]హర్యానా రాష్ట్రం 2023 నాటికి ఈ దిగువ వివరింపబడిన 22 జిల్లాలతో విభజనతో ఉంది:
వ.సంఖ్య | జిల్లా పేరు | కోడ్ | ప్రధాన కార్యాలయం | స్థాపన | విస్థార్ణం (చ.కి.మీ.లలో) | జనాభా (2011 లెక్కల ప్రకారం)[4] | రాష్ట్రంలో జిల్లా స్థానం |
---|---|---|---|---|---|---|---|
1 | అంబాలా | AM | అంబాలా | 1966 నవంబరు 1 | 1,574 | 1,136,784 | |
2 | భివానీ | BH | భివాని | 1972 డిసెంబరు 22 | 3,432 | 1,629,109 | |
3 | చర్ఖీ దాద్రి | CD | చర్ఖీ దాద్రి | 2016 డిసెంబరు 1 | 1370 | 502,276 | |
4 | ఫరీదాబాద్ | FR | ఫరీదాబాద్ | 1979 ఆగష్టు 15 | 792 | 1,798,954 | |
5 | ఫతేహాబాద్ | FT | ఫతేహాబాద్ | 1997 జులై 15 | 2,538 | 941,522 | |
6 | గుర్‌గావ్ | GU | గుర్‌గావ్ | 1966 నవంబరు 1 | 1,253 | 1,514,085 | |
7 | హిసార్ | HI | హిసార్ | 1966 నవంబరు 1 | 3,983 | 1,742,815 | |
8 | ఝజ్జర్ | JH | ఝజ్జర్ | 1997 జులై 15 | 1,834 | 956,907 | |
9 | జింద్ | JI | జింద్ | 1966 నవంబరు 1 | 2,702 | 1,332,042 | |
10 | కైతల్ | KT | కైతల్ | 1989 నవంబరు 1 | 2,317 | 1,072,861 | |
11 | కర్నాల్ | KR | కర్నాల్ | 1966 నవంబరు 1 | 2,520 | 1,506,323 | |
12 | కురుక్షేత్ర | KU | కురుక్షేత్రం | 1973 జనవరి 23 | 1,530 | 964,231 | |
13 | మహేంద్రగఢ్ | MH | నార్నౌల్ | 1966 నవంబరు 1 | 1,859 | 921,680 | |
14 | నూహ్ | NH | నూహ్ సిటీ | 2005 ఏప్రిల్ 4 | 1,874 | 1,089,406 | |
15 | పల్వల్ | PL | పల్వల్ | 2008 ఆగష్టు 15 | 1,359 | 1,040,493 | |
16 | పంచ్‌కులా | PK | పంచ్‌కులా | 1995 ఆగష్టు 15 | 898 | 558,890 | |
17 | పానిపట్ | PP | పానిపట్ | 1989 నవంబరు 1 | 1,268 | 1,202,811 | |
18 | రేవారీ | RE | రేవారీ | 1989 నవంబరు 1 | 1,582 | 896,129 | |
19 | రోహ్‌తక్ | RO | రోహ్‌తక్ | 1966 నవంబరు 1 | 1,745 | 1,058,683 | |
20 | సిర్సా జిల్లా | SI | సిర్సా | 1975 ఆగష్టు 26 | 4,277 | 1,295,114 | |
21 | సోనీపత్ | SO | సోనీపత్ | 1972 డిసెంబరు 22 | 2,122 | 1,480,080 | |
22 | యమునా నగర్ | YN | యమునా నగర్ | 1989 నవంబరు 1 | 1,768 | 1,214,162 |
ఇది కూడ చూడు
[మార్చు]- హర్యానా తహసీల్‌ల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Size, Growth Rate and Distribution of Population – Ranking of States and Union Territories by population: 2001 and 2011" (PDF). censusindia.gov.in. Ministry of Home Affairs – Office of the Register General & Census Commissioner. p. 47. Archived from the original (PDF) on 16 May 2011. Retrieved 19 July 2011.
- ↑ Khanna, C. L. (2008). Haryana General Knowledge. Delhi: Upkar Prakashan. pp. 10–11. ISBN 81-7482-383-2.
- ↑ Notification of new district charki Dadri issued; Publication: Business Standard newspaper; Published: 3 December 2016; Accessed: 3 May 2022
- ↑ "District-wise Population of Haryana" (DOC). censusindia.gov.in. Ministry of Home Affairs – Office of the Register General & Census Commissioner. Retrieved 18 July 2011.