కొప్పల్
Koppal
Koppala | |
---|---|
City | |
Coordinates: 15°21′N 76°09′E / 15.35°N 76.15°E | |
Country | India |
State | Karnataka |
Region | Kalyana-Karnataka |
District | Koppal |
Government | |
• Type | City Municipality |
విస్తీర్ణం | |
• Total | 28.78 కి.మీ2 (11.11 చ. మై) |
Elevation | 529 మీ (1,736 అ.) |
జనాభా (2011) | |
• Total | 70,698 |
• జనసాంద్రత | 2,070.62/కి.మీ2 (5,362.9/చ. మై.) |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 583 231 |
Telephone code | 08539 |
Vehicle registration | KA-37 |
Website | www.koppalcity.mrc.gov.in |
కొప్పల్, భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లా లోని పట్టణం.ఇది జిల్లా కేంద్రం. కొప్పల్ మూడు వైపులా కొండలతో చుట్టబడి ఉంటుంది. దీనిని కోపన నగారా అని పిలిచేవారు. [1] [2] ఈ పట్టణంలో కొప్పల్ కోట, గవిమఠం (ఒక మత పుణ్యక్షేత్రం), మలే మల్లప్ప దేవాలయం వంటి చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. చారిత్రాత్మకంగా, కొప్పల్‌ను జైనకాశీ అని పిలుస్తారు. అంటే "కాశీ" క్షేత్రంగా జైనులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. [3] కొప్పల్ జిల్లాలో 700 కంటే ఎక్కువ బసాదులు (జైన ధ్యాన మందిరాలు) ఉన్నాయి. (బస్తీలు అని కూడాపిలుస్తారు), జైన ధ్యా నమందిరాలు లేదాప్రార్థన మందిరాలు ఉన్నందున దీనికి ఆపేరు వచ్చింది. కొప్పల్ జిల్లా 1998 ఏప్రిల్ 1న కర్నాటక రాష్ట్రం లోని ఉత్తర భాగంలోఉన్న రాయచూర్ జిల్లా నుండి ఈ ప్రాంతం వేరు చేయుటద్వారా కొప్పల్ జిల్లా పరిపాలనా కేంద్రంగా ఏర్పడింది. [4]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కొప్పల్ జిల్లా జనాభా 70,698. [5] ఇది భారతదేశంలో జనాభా పరంగా మొత్తం 640 జిల్లాలలో350వ సంఖ్యను ఇస్తుంది.[5] జిల్లా జనసాంద్రత చ.కి.మీ.కు 250 మంది (650 మంది చ.మైలుకు) ఉన్నారు.[5] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.32% నికి పెరిగింది.[5] కొప్పల్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 1006 స్త్రీల లింగ నిష్పత్తి ఉఁది. [5] అక్షరాస్యత రేటు 79.97% ఉంది [5]
రవాణా
[మార్చు]కొప్పల్ పట్టణంలో రైల్వే స్టేషన్ ఉంది, ఇది పట్టణ కేంద్రం నుండి వాయువ్యంగా ఉంది.ఇది ఢిల్లీ, బెంగళూరు, హుబ్లీ, హైదరాబాద్, తిరుపతి, కొల్హాపూర్‌లకు కలుపుతుంది. [6] జాతీయ రహదారి 63 నగరం గుండా వెళుతుంది.ఇది హుబ్లీ ద్వారా అంకోలా, అనంతపురం జిల్లా లోని గుత్తిని కలుపుతుంది.
-
చింతమణి దేవాలయం
-
గవిసిద్దేశ్వర దేవాలయం
-
నవబ్రిందావన
-
కృష్ణదేవరాయ సమాధి
-
హులిగెమ్మ దేవాలయం.
-
కొప్పల్ కోట -14
-
కొప్పల్ కోట -12
-
కొప్పల్ కోట -8
-
కొప్పల్ కోట -1 పనోరమా చిత్రం
-
సిద్దాపూర్ కొప్పల్ బస్టాప్
మూలాలు
[మార్చు]- ↑ "Historical geography of ancient India". Ess Ess Publication, Delhi. 1976.
- ↑ Kashyap, Sharvari (May 25, 2019). "Koppal: historical, sacred & beautiful". Deccan Herald. Retrieved 7 September 2022.
- ↑ "About District". Koppal District, Government of Karnataka. National Informatics Centre, Ministry of Electronics & Information Technology, Government of India. Retrieved 7 September 2022.
- ↑ Kashyap, Sharvari (May 25, 2019). "Koppal: historical, sacred & beautiful". Deccan Herald. Retrieved 7 September 2022.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "District History". Koppal District, Government of Karnataka. National Informatics Centre, Ministry of Electronics & Information Technology, Government of India. Retrieved 7 September 2022.
వెలుపలి లంకెలు
[మార్చు]