ఖలీలాబాద్
ఖలీలాబాద్ | |
---|---|
Coordinates: 26°47′N 83°04′E / 26.78°N 83.07°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | సంత్ కబీర్ నగర్ |
విస్తీర్ణం | |
• Total | 26 కి.మీ2 (10 చ. మై) |
Elevation | 69 మీ (226 అ.) |
జనాభా (2011) | |
• Total | 47,847 |
• జనసాంద్రత | 1,042/కి.మీ2 (2,700/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 272175 |
Website | http://sknagar.nic.in/ |
ఖలీలాబాద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సంత్ కబీర్ నగర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణాన్ని 25 వార్డులుగా విభజించారు.
ఖలీలాబాద్, చేనేత వస్త్ర మార్కెట్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిని బర్దాహియా బజార్ అని పిలుస్తారు.
భౌగోళికం
[మార్చు]ఖలీలాబాద్ ఫైజాబాద్-గోరఖ్పూర్ రహదారిపై గోరఖ్‌పూర్‌కు పశ్చిమాన 36 కి.మీ, బస్తీకి తూర్పున 36 కి.మీ. దూరంలో ఉంది. ఖలీలాబాద్ 26 47' ఉత్తర అక్షాంశం, 83 4 ' తూర్పు రేఖాంశాల వద్ద ఉంది
వాతావరణం
[మార్చు]దక్షిణం వైపున ఉన్న జిల్లాల కంటే జిల్లా వాతావరణం చాలా సమానం. సంవత్సరాన్ని నాలుగు సీజన్లుగా విభజించవచ్చు. శీతాకాలం, నవంబరు మధ్య నుండి ఫిబ్రవరి వరకు, వేసవి కాలం జూన్ మధ్య వరకు ఉంటుంది. జూన్ మధ్య నుండి సెప్టెంబరు చివరి వరకు నైరుతి రుతుపవనాల కాలం. అక్టోబరు నుండి నవంబరు మధ్య వరకు వర్షాకాలం లేదా పరివర్తన కాలం.
రవాణా
[మార్చు]జాతీయ రహదారి 27, జాఅతీయ రహదారి 28 ఎలు ఖలీలాబాద్ గుండా వెళుతున్నాయి.
ఖలీలాబాద్ రైల్వే స్టేషను గోరఖ్పూర్ - లక్నో మార్గంలో ఉంది.
సమీప విమానాశ్రయం గోరఖ్‌పూర్‌లో ఉంది.
జనాభా
[మార్చు]భారత జనగణన 2011 ప్రకారం.ఖలీలాబాద్ పట్టణ జనాభా 47,847. అందులో 25,154 మంది పురుషులు, 22,693 మంది మహిళలు.